For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరినూనె + నిమ్మరసం - తెరచుకున్న చర్మగ్రంథులను మూసుకునేలా చేసే గొప్ప మిశ్రమం

|

సాగిన చర్మగ్రంథులు సులభంగా మూసుకుపోతాయి మరియు మొటిమలు, చర్మంపై మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి అనేక చర్మవ్యాధులకి దారితీస్తాయి.

బాహ్యకారణమైన నగర కాలుష్యం చర్మరంధ్రాలు మూసుకుపోవటానికి ప్రధాన కారణం. మురికి మరియు గాలిలో ఉన్న కాలుష్యపదార్థాలు చర్మం ఉపరితలంపై ఇరుక్కుపోయి రంథ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. ఇవేకాక, మృతకణాలు కూడా రంధ్రాలను మూసుకుపోయేట్లా చేస్తాయి.

Coconut Oil

రంధ్రాలు మూసుకుపోయి, వాటిని ఎక్కువకాలం అలానే వదిలేస్తే, మీ ఆరోగ్యం, అందంపై చాలా ప్రభావం చూపిస్తుంది. పెద్ద రంధ్రాలు తెరుచుకుని ఉంటే మీ అందం తగ్గి మీరు బ్యూటీ ఉత్పత్తులపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకని మీ చర్మరంధ్రాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.అక్కడ ఏ మట్టి, మృతకణాలు పేరుకుపోకుండా చూసుకోవాలి.

<strong>పెద్దగా, బాగా తెరుచుకున్న మీ చర్మ రంధ్రాలను తగ్గించే సహజమైన ఇంటి చిట్కాలు..</strong>పెద్దగా, బాగా తెరుచుకున్న మీ చర్మ రంధ్రాలను తగ్గించే సహజమైన ఇంటి చిట్కాలు..

శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లున్న సహజ ఉత్పత్తులను వాడి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మంచి మార్గం.

మేము చెప్పేది కొబ్బరినూనె మరియు నిమ్మరసం గురించి.

కొబ్బరినూనె తేమగుణాలు, నిమ్మరసంలో ఉన్న రక్తస్రావాన్ని ఆపే లక్షణం రెండూ కలిసి పెద్ద రంధ్రాలను పూడ్చగలవు.

అదేకాక, ఈ రెండు వస్తువులు వాపులను, బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ రెండు చర్మంపైన ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేసి, కొత్తవి రాకుండా నిరోధిస్తాయి.

Coconut Oil

సులభంగా తయారుచేసుకోగలిగే మిశ్రమం అన్నిటికన్నా మేటి ఇంటిచిట్కాగా ఈ సమస్యకి పేరొందింది.

సంప్రదాయ చర్మసంరక్షణ వస్తువులు రాకముందు నుంచే, ప్రజలు ఈ మిశ్రమాన్ని వివిధ చర్మ స్థితులకోసం వాడేవారు.

పెద్దవైన రంధ్రాలను చిన్నవి చేస్తామని చెప్పే వస్తువులకి మీ డబ్బులను తగలెయ్యడం కన్నా, మీ సమయంలో కొన్ని నిమిషాలను చర్మసంరక్షణకై కేటాయించి ఈ చిట్కాతో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మార్చుకోండి.

ఈ చిట్కాను పాటించిన చాలామంది మహిళలు ఇది చర్మానికి చాలా ప్రభావం చూపిస్తుందని తెలిపారు.

ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై వాడటానికి రకరకాల పద్ధతులున్నా, తెరచుకుని ఉన్న,పెద్దవైన రంధ్రాలను మూయటానికి ప్రత్యేకంగా మేము కింద తెలిపిన పద్ధతి ఉపయోగపడుతుంది.

మీ ముఖాన్ని మైల్డ్ ఫేస్ వాష్ తో, గోరువెచ్చని నీటితో కడగండి.

Coconut Oil

- ఒక చెంచా ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరి నూనెను తీసుకుని, 1 చెంచా తాజా నిమ్మరసంతో కలపండి.

- సమస్య ఉన్న చోట దీన్ని పూయండి.

- 5-10 నిమిషాలు గుండ్రంగా మసాజ్ చేయండి.

- మీ ముఖంపై నుంచి ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గుడ్డను గోరువెచ్చని నీటిలో ముంచి తుడుచుకోండి.

- వారానికి 3-4సార్లు ఇలానే చేసి ఫలితాలు పొందండి.

<strong>వర్షాకాలంలో చర్మం కాంతివంతంగా, స్వచ్చంగా ఉంచే చిట్కాలు</strong>వర్షాకాలంలో చర్మం కాంతివంతంగా, స్వచ్చంగా ఉంచే చిట్కాలు

ఈ ఇంటివద్ద చేసుకునే మిశ్రమం చర్మసంరక్షణలో ఉపయోగిస్తే మీ తెరుచుకున్న చర్మరంధ్రాలన్నిటినీ మూసుకోవటంలో సాయపడుతుంది.

గమనిక ; ముఖానికి ఈ మిశ్రమం వాడేముందు చేతికి కొబ్బరినూనె, నిమ్మరసం మిశ్రమాన్ని రాసి చూసుకోవటం మంచిది.

English summary

Coconut Oil + Lemon Juice – The Ultimate Combination For Shrinking Pores

Stretched out skin pores tend to get clogged too easily and can lead to a wide array of unsightly skin problems such as acne, blemishes, blackheads, etc. Coconut Oil + Lemon Juice – The Ultimate Combination For Shrinking Pores. Read to know more about it...
Story first published:Tuesday, October 17, 2017, 16:32 [IST]
Desktop Bottom Promotion