Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
అన్ని రకాల చర్మ తత్వాలకు స్కిన్ బ్రైట్ గా మార్చే కా ఫీ కోకా ఫేస్ మాస్క్..!
అందం విషయంలో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటాము. వాటిలో రసాయనాల జోలికి పోకుండా... అతి తక్కువ ధరలో చర్మాన్ని శుభ్రం చేసుకుని, అందంగా ఉండే టెక్నిక్ ఒకటి మీ ఇంట్లోనే ఉంది. ఆ సీక్రెట్ ఏజెంట్ ఎ
అందం విషయంలో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటాము. వాటిలో రసాయనాల జోలికి పోకుండా... అతి తక్కువ ధరలో చర్మాన్ని శుభ్రం చేసుకుని, అందంగా ఉండే టెక్నిక్ ఒకటి మీ ఇంట్లోనే ఉంది. ఆ సీక్రెట్ ఏజెంట్ ఎవరనుకున్నారు వంటింట్లో అందుబాటులో ఉండే కాఫీపొడి.
ఒక కప్పు కాఫీతో ఆరోగ్యానికి ఆశ్చర్యం కలిగే లాభాలు
కాఫీ ఓ యాంటాక్సిడెంట్. ఇది రక్తప్రసరణను క్రమపరిచి చర్మానికి శక్తినిస్తుంది. వింటుంటే అందమైన రుచి కళ్ల ముందు కదలాడుతోంది కదూ. మరింకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్...

స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేసే కాఫీ బాడీ స్క్రబ్ :
కాఫీ, పంచదార (పొడి) - పావు కప్పు చొప్పున, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ - రెండు టేబుల్ స్పూన్లు ఈ స్క్రబ్ తయారీకి అవసరం. ఈ పదార్థాలన్నింటినీ కలిపి తయారుచేసిన స్క్రబ్‌తో శరీరాన్ని నెమ్మదిగా రుద్దాలి. ముందు శరీరమంతా తడిచేయాలి. ఆ తరువాత స్క్రబ్‌ని రాసుకోవాలి. పది నిమిషాల నుంచి పావుగంట పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. చర్మం మృదువుగా అనిపించగానే గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి.

యాంటీఆక్సిడెంట్స్ అందించే కొకొవా కాఫీ ఫేస్ స్క్రబ్:
కొకొవా పౌడర్, తేనె, కొబ్బరి నూనె - ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున, పాలు - పావు కప్పు, కాఫీ పొడి - ఒక టేబుల్ స్పూన్. ఈ స్క్రబ్‌ను ముఖానికి రాసుకునే ముందు ముఖంపైన ఉండే స్వేదరంధ్రాల్లోని దుమ్మును తొలగించాలి. అందుకోసం ముందు వేడినీళ్లలో ముంచిన చేతిరుమాలుతో తుడవాలి. ఆ తరువాత మాస్క్‌ను ముఖమంతటా సమంగా పరచాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖం మీద నీళ్లు చల్లుకుని స్క్రబ్‌ను నెమ్మదిగా మర్దనా చేయాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీళ్లతో ముఖాన్ని కడిగేయాలి.

స్కిన్ టైటనింగ్ కోసం కాఫీ-లెమన్ మాస్క్:
వాడేసిన కాఫీ పొడి, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనెలతో పాటు నిమ్మరసం, నీళ్లు ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని అన్నింటినీ కలపాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక ఈ స్క్రబ్‌ను ముఖమంతా సమంగా రాసుకుని నెమ్మదిగా మర్దనా చేయాలి. ఆ తరువాత కాస్త నిమ్మరసం తీసుకుని అందులో కొద్దిగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, నీళ్లు కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చివర్లో ఐస్‌క్యూబ్స్‌తో ముఖాన్ని కడిగితే తెరుచుకున్న స్వేదరంధ్రాలు మూసుకుపోతాయి. స్కిన్ టైట్ గా మారుతుంది.

కళ్ళ ఉబ్బును తగ్గించే -కాఫీ మాస్క్:
కళ్లకింద నల్లటి వలయాలు తొలగించేందుకు ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది. కాఫీ పొడి - ఒక టేబుల్ స్పూన్, రెండు టేబుల్ స్పూన్ల పాలు ఇందుకు అవసరం. ఈరెండింటినీ బాగా కలిపి కళ్ల కింద రాసుకుని ఆరాక కడిగేసుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చేస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది.

స్కిన్ టోన్ ను మెరుగుపరిచే కాఫీ మాస్క్ :
కాఫీ ఫేస్ మాస్క్ తో స్కిన్ కాంప్లెక్షన్ మారడం మాత్రమే కాదు, స్కిన్ కు నేచురల్ గ్లో అందిస్తుంది. చర్మంలో డార్క్ స్పాట్స్, స్కిన్ పిగ్మెంటేషన్ వంటివి తొలగిస్తుంది. చర్మానికి ఒక ప్రకాశవంతమైన కాంతిని అందిస్తుంది. అందుకు కాఫీ పౌడర్ లో ఎగ్ వైట్ మిక్స్ ఫేస్ మాస్క్ వేసుకోవాలి.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:
సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు స్కిన్ ట్రీట్మెంట్ లకు దూరంగా ఉన్నవారు, నిమ్మ, ఆరెంజ్ తో వేసుకునే ప్యాక్ లు చర్మంను టైట్ గా మార్చుతాయి. సెన్సిటివ్ స్కిన్ కు కాఫీ పౌడర్ బెస్ట్ చాయిస్. యాంటీఇన్ఫ్లమేటరీ, స్మూత్ స్కిన్ కూడా ఇది గ్రేట్ గా పనిచేస్తుంది.

చర్మంను స్మూత్ గా మార్చుతుంది:
చర్మం ఉబ్బుగా కనబడితే అందంగా కనబడరు. కాబట్టి, చర్మం స్మూత్ గా మార్చే గుణాలు కాఫీ పౌడర్ లో ఉన్నాయి. కాఫీ పౌడర్ లో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ ముఖానికి ప్యాక్ వేసుకుని స్ర్కబ్ చేయాలి.



Click it and Unblock the Notifications











