For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ నిగారింపు కోసం, చర్మం మెరిసేలా చేసే కర్రీ లీవ్స్ (కరివేపాకు) ఫేస్ ప్యాక్..!

కరివేపాకు జుట్టుకు మాత్రమే కాదు చర్మ నిగారింపుకు కూడా ఉపయోగించుకోవచ్చు...

|

ఆర్థికంగా ఎదగాలనో.. పోటీ ప్రపంచంలో ముందుండాలనో.. మరే ఇతర కారణాల వల్లో మనల్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా గృహిణులు తమ శరీరం పట్ల చాలా అశ్రద్ధ చూపిస్తుంటారు. కొన్ని రోజులు అలాగే వదిలేస్తే.. చర్మం, జుత్తు వంటివి కూడా క్రమంగా పాడైపోతాయి. అలా అని వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇంట్లోనే మన చర్మానికి సరిపోయే ప్యాక్స్ వారానికోసారి వేసుకున్నా సరిపోతుంది.

కరివేపాకు కూరలో ఎంతటి సువాసన ఇస్తుందో ముఖానికీ అంతే సౌందర్యాన్ని తెస్తుంది. జుట్టుకూ పోషణనిస్తుంది. ఇందులోని ఎ,సి విటమిన్లు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. మరి దాన్నెలా ఉపయోగించాలంటే..ఓసారి ఈ ప్యాక్‌ను ట్రై చేసి, ఫలితం మీరే చూడండి.

కావలసినవి

కావలసినవి

  • కరివేపాకు పేస్ట్ (ఆకులను మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి) - 1 టేబుల్ స్పూన్
  • శనగపిండి - అర టేబుల్ స్పూన్
  • పెరుగు లేదా పాలు - అర టేబుల్ స్పూన్
  • తయారీ

    తయారీ

    • ఓ బౌల్‌లో కరివేపాకు పేస్ట్, శనగపిండి, పెరుగు లేదా పాలు వేసి బాగా కలుపుకోవాలి. (కరివేపాకు పేస్ట్‌కు బదులుగా.. ఎండబెట్టిన కరివేపాకుల పొడిని కూడా ప్యాక్‌గా వేసుకోవచ్చు)
    • ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి

      ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి

      ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని కాస్తంత స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే.. మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

      కరివేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం

      కరివేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం

      కరివేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం మీ చర్మాన్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. అలాగే ఈ కరివేపాకు ప్యాక్ ముఖంపై మొటిమలు, దద్దుర్లను దూరం చేస్తుంది.

      శనగపిండి మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది

      శనగపిండి మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది

      అలాగే ఇందులోని శనగపిండి మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. అంతేనా, ఇది చర్మాన్ని మృదువుగా, నిగనిగలాడేలా చేస్తుంది.

      పాలు లేదా పెరుగు,

      పాలు లేదా పెరుగు,

      ఫేస్ ప్యాక్ లలో పాలు లేదా పెరుగు కలపడం వల్ల చర్మం సున్నితంగా, నునుపుగా మారుతుంది.

      మొటిమల నివారణకు :

      మొటిమల నివారణకు :

      మొటిమలు,వాటి వల్ల వచ్చిన మచ్చలను నివారించడానికి నిమ్మరసం, కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుంది. కరివేపాకును స్మూత్ గా పేస్ట్ చేసి, అందులో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

      కరివేపాకులను మెత్తగా చేసి దానికి చిటికెడు పసుపు

      కరివేపాకులను మెత్తగా చేసి దానికి చిటికెడు పసుపు

      కొన్ని కరివేపాకులను మెత్తగా చేసి దానికి చిటికెడు పసుపు చేర్చాలి. ఆ ముద్దని మొటిమలు ఉన్న చోట రాస్తే అవి తగ్గుతాయి.

      ముఖం మీద మచ్చలను, వలయాలను తగ్గించి

      ముఖం మీద మచ్చలను, వలయాలను తగ్గించి

      గుప్పెడు కరివేపాకును మెత్తగా చేసి దానికి చెంచా చొప్పున ముల్తానీమట్టీ, గులాబీ నీరు కలపాలి. ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది ముఖం మీద మచ్చలను, వలయాలను తగ్గించి మెరిసేలా చేస్తుంది.

      జిడ్డు తొలగిస్తుంది

      జిడ్డు తొలగిస్తుంది

      ముల్తానీమట్టి ముఖం మీద ఎక్కువగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. గులాబీ నీళ్లు సహజ రంగును ఇవ్వడంలో సాయపడతాయి.

      మొటిమల తాలూకు మచ్చలు మాయమవుతాయి.

      మొటిమల తాలూకు మచ్చలు మాయమవుతాయి.

      రెండు చెంచాల కరివేపాకు ముద్దకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి నల్లటి మచ్చలు ఉన్న చోట రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనివల్ల మొటిమల తాలూకు మచ్చలు మాయమవుతాయి.

      చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

      చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

      రెండు చెంచాల కరివేపాకు ముద్దకు మూడు చెంచాల ఆలివ్‌నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఆలివ్‌ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్‌, తేమ గుణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

English summary

Curry Leaves Face Packs For Getting Flawless Skin ...

Only homemade remedies can cure your skin problem. You need not spend a lot for that. Just search your kitchen buckets and you will get numerous products which come handy to you. Curry leaves are one of such products. Using curry leaves for skin has several benefits. The antimicrobial properties and presence of vitamins (Vitamin A and C) makes it a healthy adds on into your food. But you can also use curry leaves for solving skin problems.
Story first published:Wednesday, August 23, 2017, 13:14 [IST]
Desktop Bottom Promotion