For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖం అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి బనానా ఫేస్ ప్యాక్ రిసిపిలు

డ్యామేజ్ అయిన స్కిన్ మరియు డ్రై స్కిన్ నివారించడానికి అరటిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. దీన్ని ఒక హెల్తీ మీల్ గానే కాకుండా మీ చర్మ సంరక్షణకోసం స్కిన్ డైట్ లో తీసుకోవచ్చు.

By Lekhaka
|

చలికాలంలో మాత్రమే కాదు వేసవి కాలంలో కూడా స్కిన్ డీహైడ్రేషన్ వల్ల చర్మం డ్రైగా మారుతుంది. ఈ డ్రై స్కిన్ నివారించుకోవడానికి వేసవిలో విరివిగా దొరికే అరటిపండ్లు బాగా సహాయపడుతాయి. అరటి పండ్లలో ఎక్కువ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, ఇవి చర్మానికి చాలా అవసరం అవుతాయి . ఇది చర్మానికి తగిన తేమను అందించడంతో పాటు, చర్మ యొక్క డ్రై నెస్ ను నివారిస్తుంది.

డ్రై స్కిన్ నివారించడానికి కొన్ని బనాన ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాము. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్నిచూడటానికి యవ్వనంగా మరియు మెరిసే విధంగా మార్చేస్తాయి.

డ్యామేజ్ అయిన స్కిన్ మరియు డ్రై స్కిన్ నివారించడానికి అరటిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. దీన్ని ఒక హెల్తీ మీల్ గానే కాకుండా మీ చర్మ సంరక్షణకోసం స్కిన్ డైట్ లో తీసుకోవచ్చు.

అరటిపండుకు మరికొన్ని నేచురల్ పదార్థాలు జోడించి ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మం యొక్క డ్రైనెస్ ను పోగొట్టడం మాత్రమే కాదు, చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి పునరుద్దరిస్తుంది దాంతో చర్మం తిరిగి తేమగా మరియు కాంతివంతంగా కనిపిస్తుంది.

మరి డ్రై స్కిన్ నివారించుకోవడానికి కొన్ని హోం మేడ్ బనానా ఫేస్ ప్యాక్ లను ఏవిధంగా తయారుచేయాలి, ఎలా వేసుకోవాలన్న విషయాన్ని ఈ క్రింది స్లైడ్ ద్వారా చూడండి...

బనానా(అరటి)-ఓట్స్:

బనానా(అరటి)-ఓట్స్:

మీరు బాగపండిన అరటి పండుకు ఓట్స్ ను చేర్చి ఫేస్ మాస్క్ అప్లై చేయండి. ఇది ఒక సులభమైన చిట్కా. అరకప్పు ఓట్స్ ను మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని అందులో అరటిపండు గుజ్జును కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ నేచురల్ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత ముఖం మీద నీళ్ళు చల్లుకొని సున్నితంగా రుద్దాలి. తర్వాత జోరుగా నీళ్ళు పోస్తు ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో ఉన్నా బ్లాక్ హెడ్స్, మృత కణాలు తొలగిపోతాయి.

అరటి మరియు పెరుగు ఫేస్ ప్యాక్:

అరటి మరియు పెరుగు ఫేస్ ప్యాక్:

బాగా పండిన అరటిపండుకు పెరుగు మిక్స్ చేసి దీన్ని ముఖానికి పట్టించాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, సన్ టాన్ నివారిస్తుంది . మరియు ఇది మీ ముఖాన్ని బ్రైట్ గా మరియు ఫ్రెష్ గా మార్చుతుంది . మీ చర్మానికి అవసరం అయ్యే హైడ్రేషన్ అందిస్తుంది మరియు డ్రై నెస్ నివారిస్తుంది.

బనానా(అరటి)-తేనె:

బనానా(అరటి)-తేనె:

మనందరికి తెలుసు అరటిపండులోనూ, తేనెలోనూ అద్భుతమైన న్యూట్రియంట్స్ కలిగి ఉన్నాయని. అరటి పండులోని సగభాగం తీసుకొని ఒక బౌల్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దానికి ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ముఖం పొడిబారినట్లు కనబడుతుంటే కనుక ఫేషియల్ స్టీమింగ్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ మాయిశ్చరైజర్ తో మసాజ్ చేసుకొని చూడండి అద్భుతమైన మార్పు కనబడుతుంది.

అరటిపండు-పాలు:

అరటిపండు-పాలు:

రెండు చెంచాల అరటిపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ పాలు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కోల్డ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ ముఖం కాంతివంతంగాను, తాజాగాను కనబడుతుంది.

అరటి మరియు సాండిల్ ఉడ్ ప్యాక్:

అరటి మరియు సాండిల్ ఉడ్ ప్యాక్:

గంధం చర్మానికి అప్లౌ చేస్తే మంచి గ్లో వస్తుంది. కొద్దిగా సాండిల్ వుడ్ పౌడర్ ను అరటి పండు గుజ్జుతో మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మార్చుతుంది. దీన్ని ముఖానికి అప్లై చేసి, కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి గ్లో వస్తుంది.

English summary

DIY Banana Face Packs For Dry Skin

Some of us don't like taking the effort to go all the way to the parlor. For those times, making DIY fruit face packs, especially with the use of banana, can be really helpful. So, here are some banana face packs you can make at home to beat your dry skin.
Desktop Bottom Promotion