For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంను తేమగా, కాంతివంతంగా మార్చే ఆరెంజ్ ఫేస్ మాస్క్..!

సౌందర్యానికి పండ్లు కూడా అద్భుతంగా ఉపయోగపడుతాయన్న సంగతి మనకు తెలిసిందే. పండ్లలో ముఖ్యంగా ఆరోగ్యానికి మరియు అందానికి బాగా ఉపయోగపడేది ఆరెంజ్. ఆరెంజ్ తొక్క చర్మఛాయను పెంచడంలో కొన్ని అద్భుతాలను చేస్తుంది

|

సౌందర్యానికి పండ్లు కూడా అద్భుతంగా ఉపయోగపడుతాయన్న సంగతి మనకు తెలిసిందే. పండ్లలో ముఖ్యంగా ఆరోగ్యానికి మరియు అందానికి బాగా ఉపయోగపడేది ఆరెంజ్. ఆరెంజ్ తొక్క ముఖం మరియు చర్మఛాయను పెంచడంలో కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది. ఆయిల్ చర్మాన్ని, చర్మంలో మూసుకుపోయిన రంధ్రాలను, ఇన్ఫ్లమేషన్ ను తొలగిస్తుంది, మొటిమలను నివారిస్తుంది, blemishesను తొలగిస్తుంది. ఇంకా స్కిన్ టోన్ కూడా మీ ముఖం మెరిసేలా చేస్తుంది. ఆరెంజ్ తొక్కను నిల్వ చేయడంతో పాటు ఉపయోగించడం కూడా చాలా సులభం.

DIY: Orange Facial Mask To Keep The Skin Hydrated

అందుకు మీరు చేయాల్సిందల్లా, మీరు తిన్నప్రతి సారి ఆరెంజ్ తొక్కను పడేయకుండా సేవ్ చేయాలి. తర్వాత కొంత పెద్ద మెత్తం అయిన తర్వాత తొక్కను రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అంతే ఫేస్ కు ఉపయోగించడానికి ఆరెంజ్ పౌడర్ రెడీ. ఈ పౌడర్ ను దీర్ఘకాలం ఉపయోగించడానికి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ పౌడర్ తో ఫేస్ ఫ్యాక్ వేసుకోవడం వల్ల ముఖంలో మంచి ఛాయతో పాటు, కళంకంలేని క్లియర్ స్కిన్ ను మీకు అందిస్తుంది. మరి ఈ సులభమైన ఫేస్ ప్యాక్ తో మీ అందాన్ని మెరుగుపరచుకోవడానికి తప్పనిసరిగా ఆరెంజ్ తొక్కలను ఉపయోగించండి. ఆరెంజ్ పౌడర్ తో ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు

కావలసిన పదార్థాలు

- నారింజ 4-5 ముక్కలు

- శనగపిండి 2 స్పూన్లు

- పెరుగు 2 స్పూన్లు

తయారీ :

తయారీ :

- రెండు టీస్పూన్ల శెనగపిండిని మిక్సీ జార్ లో వేయాలి

తయారీ :

తయారీ :

- అలాగే ఆరెంజ్ తొనలు కూడా జోడించాలి.

తయారీ :

తయారీ :

- రెండు టీస్పూన్ల శెనగపిండిని మిక్సీ జార్ లో వేయాలి

- అలాగే ఆరెంజ్ తొనలు కూడా జోడించాలి.

తయారీ :

తయారీ :

- రెండు టీస్పూన్ల పెరుగు జోడించాలి.

- మొత్తం పదార్థాలన్నింటిని గ్రైండ్ చేసుకోవాలి.

తయారీ :

తయారీ :

- తర్వాత దీన్ని స్మూత్ గా పేస్ట్ చేయాలి. ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

- అవసరమయితే ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం జోడించి తిరిగి బ్లెండ్ చేసుకోవచ్చు.

- పేస్ట్ స్మూత్ గా అయిన తర్వాత, దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఈ పేస్ మాస్క్ వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది.

ఆరెంజ్ బెనిఫిట్స్

ఆరెంజ్ బెనిఫిట్స్

ఆరెంజ్ లో ఉండే వాటర్ కంటెంట్ చర్మంను హైడ్రేషన్ లో ఉంచుతుంది. ఎక్కువ సమయం తేమగా, కాంతి వంతంగా మారుతుంది.

- ఆరెంజ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఏజింగ్ లక్షణాలను తెలిపే ముడుతలను, ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

- ఆరెంజెస్ లో ఉండే విటమిన్స్, ఏజ్ స్పాట్స్, మొటిమలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

- ఆరెంజ్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలు, మచ్చలు, టానింగ్ నివారిస్తుంది.

- స్కిన్ టానికంగ్ , సమ్మర్లో వేడి , ఎండవల్ల పిగ్మెంటేషన్ సమస్యను నివారిస్తుంది.

- ఆరెంజెస్ లో ఉండే విటమిన్ సి కంటెంట్ నేచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. సన్ డ్యామేజ్ ను నివారిస్తుంది

శెనగపిండి బెనిఫిట్స్

శెనగపిండి బెనిఫిట్స్

- శెనగపిండిని అప్లై చేసుకునే విధానంను బట్టి ఉంటుంది. శెనగపిండి ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ టాన్ నివారించుకోవచ్చు .

- శెనగపిండిలో స్కిన్ లైటనింగ్ గుణాలు అద్బుతుంగా ఉన్నాయి .

- ఇది ముఖంలో ఆయిల్ మరియు జిడ్డును తొలగిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య నుండి విముక్తి కలిగిస్తుంది.

- మొటిమలు, మచ్చలను నివారించడంలో శెనగపిండి గ్రేట్ గా సహాయపడుతుంది.

- చర్మంను స్మూత్ గా..కాంతివంతంగా మార్చడంలో ఇది ఒక నేచురల్ రెమెడీ .

- శెనగ పిండి గ్రేట్ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది,. డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది.

పెరుగులోని ప్రయోజనాలు

పెరుగులోని ప్రయోజనాలు

- పెరుగులో ఉండే అసిడిక్ , వాటర్ కంటెంట్ గుణాలు చర్మానికి కావల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

- చర్మంను కాంతివంతంగా, తేమగా మార్చడంలో ఎక్సలెంట్ హోం రెమెడీ పెరుగు.

- అలాగే పెరుగు చర్మంలోని ముడుతలను, చారలను ఏజింగ్ లక్షనాలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

- పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్స్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

- మొటిమలు, మచ్చలకు వ్యతిరేఖంగా పోరాడుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను నివారిస్తుంది.

- స్కిన్ కు కావల్సిన పోషక విలువలను అందిస్తుంది. చర్మంలో డార్క్ నెస్ ను తొలగిస్తుంది.

English summary

DIY: Orange Facial Mask To Keep The Skin Hydrated

Summer is almost here, and our skin tends to be the worst sufferer during this season. Our body, face and hair suffer a lot due to the harmful UV rays of the sun. However, to treat your skin right during summer, we've shared pointers on how to prepare an orange facial mask.
Desktop Bottom Promotion