For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే రైస్ పౌడర్ ఫేస్ ప్యాక్ రెసిపీ

చర్మ సౌందర్యాన్ని పెంపొందించే రైస్ పౌడర్ ని తమ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం ఆసియా మహిళల బ్యూటీ సీక్రెట్స్ లో ముఖ్యమైనది. రైస్ పౌడర్ ముఖాన్ని పాలిష్ చేయడంతో పాటు కాంతివంతంగా చేస్తుంది.

|

చర్మ సౌందర్యాన్ని పెంపొందించే రైస్ పౌడర్ ని తమ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం ఆసియా మహిళల బ్యూటీ సీక్రెట్స్ లో ముఖ్యమైనది. రైస్ పౌడర్ ముఖాన్ని పాలిష్ చేయడంతో పాటు కాంతివంతంగా చేస్తుంది. మృదువైన, ప్రకాశించే చర్మం కోసం ఇంటిలోనే సులభంగా ఈ DIY రైస్ పౌడర్ ఫేస్ ప్యాక్ ను ఏ విధంగా తయారుచేసుకోవాలో మేమిక్కడ వివరిస్తాం.

స్టోర్స్ లో అనేక రకాలైన రైస్ పౌడర్ ఫేస్ ఫ్యాక్స్ అందుబాటులోనుంటాయి. అయితే, ఇవన్నీ కాస్త ఖరీదైనవే. కాబట్టి, ఈ ఫేస్ మాస్క్లను కొనడానికి అంత సొమ్మును వెచ్చించే బదులు ఇంట్లోనే సులభంగా చక్కటి రైస్ పౌడర్ ఫేస్ ప్యాక్ ని తయారుచేసుకుంటే మీ చర్మం పోగొట్టుకున్న మృదుత్వాన్ని సొంతం చేసుకుంటుంది.

అన్ని రకాల చర్మాలకి తగిన బేసిక్ రైస్ పౌడర్ ఫేస్ ప్యాక్ ని సులభంగా ఇంటిలోనే ఏ విధంగా చేసుకోవాలో మేము వివరిస్తాము. ఈ ఫేస్ ప్యాక్ ని క్రమం తప్పకుండా వాడడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

ఈ ఫేస్ ప్యాక్ ని తయారుచేయడానికి కొన్ని బేసిక్ ఇంగ్రీడియెంట్స్ ని మీరు సిద్ధం చేసుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం....

కావలసిన పదార్థాలు

రైస్ పౌడర్ - ఒక టేబుల్ స్పూన్

diy rice powder face pack

తేనె - ఒక టీస్పూన్

diy rice powder face pack

పాలు - ఈ పదార్థాలను కలిపేందుకు అవసరమైనంత

diy rice powder face pack

జిన్సెంగ్

diy rice powder face pack

ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసే విధానం:

రైస్ పౌడర్ ని, తేనెని, పాలని అలాగే జిన్సెంగ్ చూర్ణాన్ని బాగా కలపాలి. జిన్సెంగ్ గుణాలు ఫేస్ ప్యాక్ లో మిళితమయ్యే వరకు ఈ ఫేస్ ప్యాక్ ని కాసేపు అలాగే ఉంచాలి. ఇప్పుడు, ముఖంపై ఈ మిశ్రమాన్ని మృదువుగా బ్రష్ తో అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో ఈ ప్యాక్ ను తొలగించాలి.

diy rice powder face pack

ఈ ఫేస్ ప్యాక్ యొక్క ప్రయోజనాలు:

రైస్ పౌడర్ చర్మంపై కఠినంగా వ్యవహరించకుండా చర్మాన్ని సున్నితంగా పాలిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై పేరుకుపోయిన దుమ్ముని తొలగిస్తుంది.

చర్మానికి తగినంత తేమను అందిస్తూ స్కిన్ టోన్ ని మెరుగుపరచడానికి పాలు చక్కగా ఉపయోగపడతాయి. అదే విధంగా, తేనె అనేది చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేసి చక్కటి నిగారింపుని కలిగించడానికి తోడ్పడుతుంది.

diy rice powder face pack

జిన్సెంగ్ అనేది సహజసిద్ధమైన స్కిన్ టోనర్ గా వ్యవహరిస్తూ చర్మానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. యాంటీఏజింగ్ గుణాలు జిన్సెంగ్ లో పుష్కలంగా ఉన్నాయి. అందువలన, స్కిన్ టోన్ ను మెరుగుపరచడంలో పాటు ముడతలను తగ్గించడంలో ఈ పదార్థం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందువలన, ఇది సెన్సిటివ్ అలాగే ఆయిలీ స్కిన్ కలవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ ఫేస్ మాస్క్ ని వారానికి ఒకసారి వాడడం ద్వారా అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ హోమ్ మేడ్ రైస్ పౌడర్ ఫేస్ ప్యాక్ ని వాడి మీరు పొందిన ప్రయోజనాలను మాకు తెలియచేయండి.

English summary

DIY: Rice Powder Face Pack Recipe

Using rice powder for the face is one of the best kept secrets of Asian women. It helps polish and clarify the face. We'll tell you how you can make a DIY rice powder face pack at home that would help in giving you soft and glowing skin.
Desktop Bottom Promotion