For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్ లో గ్లో రావాలంటే ఫేషియల్ సెరమ్ వాడండి..

By Mallikarjuna
|

ఫేషియల్ సెరమ్ అనేది ఒక అత్యాధునిక స్కిన్ కేర్ ప్రొడక్ట్. ఈ మద్యకాలంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

స్కిన్ కేర్ ఎక్స్ పర్ట్ మరియు బ్యూటీ బ్లగర్స్ ఈ ఎసెన్షియల్ స్కిన్ బ్రైటనింగ్ ప్రొడక్ట్ రొటీన్ గా ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే కాంతి వంతమైన చర్మ సౌందర్యాన్ని పొందడానికి వివిధ రకాల ఫేష్ వాష్, స్కిన్ టోనర్స్, మాయిశ్చరైజర్స్ లాగే స్కిన్ ఫేషియల్ సెరమ్ కూడా ఒకటి. ఇది చర్మ అందాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం అందంగా కనబడేలా చేస్తుంది.

ఫేషియల్ సెరమ్ చర్మంలోకి త్వరగా ఇంకుతుంది. చర్మం లోపలి బాగాలకు బాగా విస్తరించి చర్మం మీద ఎఫెక్టివ్ గా పనిచేసి అద్భుత ఫలితాలను ఇస్తుంది.

<strong>ఫెషియల్ సీరం Vs ఫెషియల్ మాయిశ్చరైజర్ - వీటి మధ్య తేడాలు ఏమిటి?</strong>ఫెషియల్ సీరం Vs ఫెషియల్ మాయిశ్చరైజర్ - వీటి మధ్య తేడాలు ఏమిటి?

ఈ ఫేషియల్ సెరమ్ గురించి మీకు ఇప్పటి వరకూ తెలిసిఉండవకపోవచ్చు. అయితే , ఫేషియల్ సెరమ్ వివిధ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి కాస్త ఖరీదైనవి.

diy vitamin c serum

అందువల్ల, ఫేషియల్ సెరమ్ లో వివిధ రకాల బ్యూటీ బ్రాండ్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. చర్మ తత్వాలను బట్టి కూడా వివిధ రకాల ఫేషియల్ సెరమ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

చర్మ సమస్యల్లో డార్క్ స్పాట్స్, మొటిమలు, మచ్చలు, ముడుతల, స్ట్రెచెస్, స్కార్స్ వంటి సమస్యలను అన్ని రకాల ఏజ్ గ్రూప్ మహిళలు ఎదుర్కొంటున్నారు.

అయితే, సెరమ్స్ కూడా చర్మ సమస్యను బట్టి వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో చర్మానికి సంబంధించిన వాటిలో విటమిన్ సి ఫేషియల్ సెరమ్ ముఖ్యమైనది.

diy vitamin c serum

ఈ నిజమైన ఫేషియల్ సెరమ్ ఈ ప్రపంచంలో ఉండే మహిళల యొక్క చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో, అద్భుతంగా అభివర్ణింపబడినది.

విటమిన్ సి ఫేషియల్ సెరమ్ ను ఉపయోగించడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగాలుంటాయో ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది:

· ఇది చర్మాన్ని సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది.

· చర్మ పిగ్మెంటేషన్ ను నివారించి, చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

· చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.

· ఇది చర్మంలో అలసటను తగ్గిస్తుంది. ముఖంలో న్యాచురల్ గ్లోను తీసుకొస్తుంది.

· ఇది చర్మానికి కావల్సిన తేమను మరియు మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది.

· ఇది చర్మం యొక్క ఎలాసిటిని మెరుగుపరుస్తుంది. చర్మం అందంగా కనబడటానికి సహాయపడుతుంది.

విటమిన్ సి ఫేషియల్ సెరమ్ బ్యూటీ స్టోర్స్ లో దొరుకుతుంది . మరియు స్వయంగా ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. అయితే అందుకు కొన్ని పదార్థాలు అవసరం అవుతాయి. ఇవి చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఖర్చు తక్కువ , ప్రయోజనం ఎక్కువ. ముఖ్యంగా దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

<strong>జుట్టుకు హెయిర్ సెరమ్ అప్లై చేస్తే మంచిదేనా..?</strong>జుట్టుకు హెయిర్ సెరమ్ అప్లై చేస్తే మంచిదేనా..?

diy vitamin c serum

కావల్సినవి:

1 విటమిన్ సి పౌడర్ ఒక టీస్పూన్

2 ఒక టేబుల్ స్పూన్ డిస్టిల్డ్ వాటర్

1 విటమిన్ ఇ ఆయిల్ క్యాప్స్యూల్

2 టీస్పూన్ల అలోవెర జెల్

1 టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్

diy vitamin c serum

తయారుచేయు పద్దతి:

- ఒక బౌల్లో విటమిన్ సి పౌడర్ మరియు వాటర్ తీసుకుని రెండూ బాగా మిక్స చేయాలి.

- విటమిన్ ఇ క్యాప్స్యూల్లోని ఆయిల్ ను తీసుకుని, అలోవెర జెల్ కు కలపాలి.

- అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేసి, కలపాలి.

- ఈ మిశ్రమాన్ని గ్లాస్ బాటిల్లో నిల్వచేసుకుని అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు.

diy vitamin c serum

ఎలా ఉపయోగించాలి:

- ఒక మంచి ఫేషియల్ తో ముఖంను శుభ్రం చేసుకోవాలి.

- చేతి వేళ్ళను ఉపయోగించి ముఖానికి ఫేషియల్ సెరమ్ ను అప్లై చేయాలి.

- అలాగే మీరు రోజు ఉపయోగించే మాయిశ్చరైజర్ లేదా సన్ స్క్రీన్ ఉపయోగించాలి.

ఈ వండర్ ఫుల్ ఫేషియల్ సెరమ్ ను మీ రెగ్యులర్ బ్యూటీ విషయంలో తప్పకుండా వాడాలి. ఇది చర్మ కాంతిలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది . చర్మం రంగును మెరుగుపరుస్తుంది.

హెచ్చరిక : ఈ ఫేషియల్ సెరమ్ ను ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

English summary

DIY Vitamin C Facial Serum Recipe For Flawless Skin

Here’s how you can prepare diy vitamin c serum recipes. These are the best beauty uses vitamin c serum.
Story first published:Friday, October 27, 2017, 17:39 [IST]
Desktop Bottom Promotion