For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై, ఆయిల్, సాప్ట్ స్కిన్ ఇలా అన్ని రకాల చర్మ తత్వానికి హోం మేడ్ స్క్రబ్స్

By Staff
|

కాంబినేషన్ స్కిన్ అంటే కొంత మందికి డ్రై స్కిన్ ఉంటే కొందరికి ఆయిల్ స్కిన్, మరికొందరికి సాస్ట్ స్కిన్ ఇలా ఉంటుంది. ఇలా ఒక్కో చర్మానికి ఒక్కవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే అంత సులభం కాదు. ఇటువంటి చర్మ తత్వాలున్న వారు ఏవి పడి అవి చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. చర్మ తత్వాన్ని బట్టి, బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి.

ఇలాంటి చర్మ తత్వంలో మీరు ఒకరైతే , అప్పుడు మీరు కూడా ఖచ్ఛితంగా కొన్ని ప్రత్యేకమైన నేచురల్ రెమెడీస్ ను ఫాలో అవ్వాలి. కొన్ని ప్రత్యేకమైన నేచురల్ రెమెడీస్ డ్రైస్కిన్, ఆయిల్ స్కిన్ రెండింటికి సహాయపడుతాయి.

అలాగే కనీసం వారంలో ఒకసారి స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడం చాలా అవసరం. స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ వల్ల చర్మంలో మలినాలు టాక్సిన్స్ తొలగిపోతాయి. దాంతో చర్మం సమస్యలను దూరం చేసుకోవచ్చు .

స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్ కొరకు కొన్ని హోం మేడ్ స్ర్కబ్స్ ను మీకు పరిచయం చేస్తున్నాము. అవి కూడా మీ చర్మ తత్వానికి తగిన విధంగా తయారుచేయడం జరిగింది. ఈ ఎఫెక్టివ్ హోం మేడ్ స్ర్కబ్ కాంబినేషన్ స్కిన్ కోసం తయారుచేసుకోవచ్చు. వీటిని తయారుచేసుకోవడం కూడా సులభం. ఫలితం కూడా ఎఫెక్టివ్ గా ఉండి, చర్మ సమస్యలను దూరం చేస్తుంది. మరి అవేంటో తెలుసుకుందాం..

1.కొబ్బరి నూనె, బ్రౌన్ షుగర్, కోకా పౌడర్

1.కొబ్బరి నూనె, బ్రౌన్ షుగర్, కోకా పౌడర్

ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని, అందులో ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్, ఒక టీస్పూన్ కోకో పౌడర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్నిబాడీ మొత్తానికి అప్లై చేసి సున్నింతగా స్ర్కబ్ చేయాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. బ్లూ బెర్రీస్, తేనె , షుగర్

2. బ్లూ బెర్రీస్, తేనె , షుగర్

ఒక గుప్పెడు బ్లూబెర్రీస్ తీసుకుని, దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె మిక్స్చేయాలి. అలాగే షుగర్ కూడా మిక్స్ చేసి, బాడీ మొత్తానికి అప్లై చేసి స్ర్కబ్ ప్యాడ్ తో చర్మానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఈ హోం మేడ్ స్ర్కబ్ ను వారంలో ఒకటి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గుప్పెడు బ్లూబెర్రీస్ ను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ షుగర్ వేయాలి. మూడు బాగా మిక్స్ చేసి స్ర్కబ్ ప్యాడ్ తో చర్మానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఈ హోం మేడ్ స్ర్కబ్ ను వారంలో రెండు సార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. రెడ్ లెంటిల్స్ అండ్ మిల్క్

3. రెడ్ లెంటిల్స్ అండ్ మిల్క్

ఎర్ర కందిపప్పు ఒక టీస్పూన్ తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అందులో రెండు టీస్పూన్ల పచ్చిపాలను మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ బ్యూటీ మెరుగుపడుతుంది.

4.ల్యావెండర్ ఆయిల్, కేన్ షుగర్

4.ల్యావెండర్ ఆయిల్, కేన్ షుగర్

రెంటు టీస్పూన్ల షుగర్ లో4టీస్పూన్ల ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఇది చర్మానికి అప్లై చేసి, స్ర్కబ్ చేయడం వల్ల చర్మ రంద్రాల్లోని మురికి తొలగిపోయి, చర్మ శుభ్రపడుతుంది. 10 నిముసాల తర్వాత ముఖం శుభ్రం చేసుకుంటే స్కిన్ బ్యూటీ మెరుగుపడుతుంది. ఇలా వారంలో ఒకసారి చేస్తుంటే క్లియర్ అండ్ క్లీన్ స్కిన్ పొందుతారు.

5.బాదం పౌడర్, ఎగ్ వైట్ మరియు నిమ్మరసం

5.బాదం పౌడర్, ఎగ్ వైట్ మరియు నిమ్మరసం

ఒక ఎగ్ వైట్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూప్ బాదం పౌడర్ ను మిక్స్ చేయాలి. అలాగే ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల గ్రేట్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఈ హోం మేడ్ ట్రీట్మెంట్ ను నెలకొకసారి వేసుకుంటే చాలు స్కిన్ సాప్ట్ గా మరియు స్మూత్ గా మారుతుంది.

6.వేపాకు, సాండిల్ ఉడ్ పౌడర్, రోజ్ వాటర్

6.వేపాకు, సాండిల్ ఉడ్ పౌడర్, రోజ్ వాటర్

గుప్పెడు వేపాకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఒక టీస్పూన్ రోజ్ వాటర్, సాండిల్ వుడ్ పౌడర్ మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి , మెడకు బాడీ మొత్తానికి అప్లైచేసి స్ర్కబ్ చేయాలి. ఈ ట్రీట్మెంట్ ను నెలకొకసారి వేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది.

7. ఆలివ్ ఆయిల్, కాఫీవిత్తనాలు, తేనె

7. ఆలివ్ ఆయిల్, కాఫీవిత్తనాలు, తేనె

ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో , 2 టేబుల్ స్పూన్ల కాఫీ గ్రైండ్ పౌడర్ మిక్స్ చేసి అందులో తేనె కూడా చేర్చి ముఖం, మెడకు అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

English summary

Extremely Effective Homemade Scrubs For Combination Skin

As the name suggests, combination skin is a blend of oily and dry skin. Taking care of this particular skin type is no easy feat. One has to stick to a consistent skin care regime, which includes of beauty items that are especially made for this skin type.
Desktop Bottom Promotion