For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలిన గాయాలు, బొబ్బలను నయం చేసే 15 వంటింటి చిట్కాలు

By Mallikarjuna
|

ప్రమాదాలు అనేటివి మనకు చెప్పి రావు. ప్రమాదాలు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏవిధంగా అయినా జరగవచ్చు. చర్మం విషయానికి వస్తే, ఏదో ఒక సందర్భంలో చేతులు కాల్చుకోవడం సహజంగా చూస్తుంటాము.

ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఆయిల్ చిట్లడం, వేడిగా ఉన్న కుక్కర్ నుంచి స్టీమ్ బయటకు రావడం వంటి కారణాల వల్ల చర్మంపై కాలుతూ ఉంటాయి. కాలిన గాయలు నాలుగు రకాలు, ఫస్ట్ లేయర్ స్కిన్ బర్న్, సెకండ్ లేయర్ స్కిన్ బర్న్, థర్డ్ లేయర్ స్కిన్ బర్న్, ఫోర్త్ లేయర్ స్కిన్ బర్న్. ఈ నాలుగు రకాలు, మొదటి రెండు రకాలను ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. చివరి రెండు రకాలకు వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది.

కాలిన గాయాలు, బొబ్బలను నయం చేసే 15 వంటింటి చిట్కాలు

మొదటి రెండు రకాల కాలిన గాయాలు, బొబ్బలు, మచ్చలు నివారించడానికి హోం రెమిడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. హోం రెమెడీస్ ఉపయోగించినా కొన్ని సందర్భాల్లో త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని సందర్బాల్లో ఆలస్యం అవుతుంది. కాబట్టి, గాయాలు మానే వరకూ హోం రెమెడీస్ ను వాడుతూనే ఉండాలి.

అయితే కాలిన వెంటనే.. మచ్చలు పడకుండా, పొంగకుండా, రెడ్ గా ఏర్పడకుండా.. ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకోవాలి. కాలిన వెంటనే చల్లటి నీటితో కాలిన ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. చల్లటి నీటిలో క్లాత్ ముంచి, నీటిని పిండేసి.. కాలిన చర్మంపై కొన్ని గంటలపాటు క్లాతును ఉంచాలి.

చర్మంపై అసహ్యంగా కనిపించే కాలిన మచ్చలు నివారించే రెమిడీస్..!చర్మంపై అసహ్యంగా కనిపించే కాలిన మచ్చలు నివారించే రెమిడీస్..!

ఐస్ ని కూడా కాలిన చర్మంపై పెట్టుకోవచ్చు. దీనివల్ల రక్తం గడ్డకట్టకుండా అరికట్టవచ్చు. ఒక్కసారి గాయమంతా పూర్తీగా నయం అయిన తర్వాత.. చిన్న చిన్న మచ్చలు బ్రౌన్ కలర్ లో కనిపిస్తాయి. లేదా చర్మం రఫ్ గా మారుతుంది. ఇలాంటప్పుడు.. కొన్ని హోం రెమిడీస్ ప్రయత్నిస్తే.. ఎఫెక్టివ్ ఫలితాలు చూడవచ్చు.

ఐస్ ప్యాక్:

ఐస్ ప్యాక్:

ఐస్ ప్యాక్ ఇది ఒక పురాతన హోం రెమెడీ. కాలిన గాయలాకు ఐస్ బాగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఐస్ ను నేరుగా గాయాల మీద రుద్దకూడదు. ఐస్ ప్యాక్ ను అప్లై చేయాలి. ఐస్ ప్యాక్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అయితే ఐస్ ను గాయాల మీద నేరుగా అప్లై చేయకుండా గాయం చుట్టూ అప్లై చేయడం వల్ల ఆ ప్రభావం గాయానికి చేరి ఉపశమనం కలిగిస్తుంది.

ల్యావెండర్ ఆయిల్ :

ల్యావెండర్ ఆయిల్ :

స్కిన్ బర్న్ ను నివారించడంలో చాలా సింపుల్ మార్గం ల్యావెండర్ ఆయిల్ . కాలినగాయాల మీద రెండు మూడు చుక్కల నూనె వేసి అప్లై చేయాలి. ఇలా క్రమంగా రోజూ చేస్తుంటే కాలిన గాయాల నుండి ఉపశమనం కలుగుతుంది. రోజుకు ఐదు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గాయం తగ్గే కొద్ది మూడుసార్లు, రెండు సార్లు, ఒకసారి అప్లై చేస్తే సరిపోతుంది.

టూత్ పేస్ట్ :

టూత్ పేస్ట్ :

కాలిన వెంటనే గాయం మీద టూత్ పేస్ట్ ను రాయకూడదు. మొదట కాలిన గాయాన్ని నీటితో కడిగే , తర్వాత టిష్యుపేపర్ లేదా పొడి బట్టతో గాయాన్ని తుడవాలి.దీని వల్ల స్కిన్ డ్రైగా మారుతుంది. ఆ తర్వాత టూత్ పేస్ట్ ను అప్లై చేయాలి. దీన్ని అప్లై చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలిగుతుంది. అయితే టూత్ పేస్ట్ లో వివిధ రకాలు ఉంటాయి. అయితే వాటిలో పుదీనా ఫ్లేవర్ కలిగిన వైట్ కలర్ టూత్ పేస్ట్ ను గాయాల మీద రాయడం మంచిది.

వెనిగర్:

వెనిగర్:

కాలిన గాయలకు ద్రవంలా ఉండే ఈ పదార్థము ను అప్లై చేయడం వల్ల గాయాలకు మంచి ఉపశమనానికి మరియు చల్లని అనుభూతి ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది . వెగినగార్ ను ఉపయోగించే ముందు నీటిలో కొద్దిగా వేసి మిక్స్ చేసి అప్లై చేయాలి. మద్యమద్యలో లేదా తరచూ వెనిగార్ ను కాలిన గాయాల మీద అప్లై చేస్తుండటం వల్ల బర్నింగ్ నొప్పిని మరియు వాపును తగ్గిస్తుంది.

కాలిన గాయలకు వెంటనే ఇంట్లో చేసే చికిత్సా పద్దతుకాలిన గాయలకు వెంటనే ఇంట్లో చేసే చికిత్సా పద్దతు

తేనె:

తేనె:

ఇది కాలిన గాయాలకు చాలా సాధారణంగా ఉపయోగించే ఒక సహజ రెమడీ, కాలిన గాయాల మీద తేనెను రాయడం వల్ల స్కార్స్ చాలా తక్కువగా ఏర్పడుతాయి. తాజాగా తీసిన తేనెల యాంటిసెప్టిక్ మరియు మంటను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నందున తాజా తేనెను ఉపయోగించండి.

అలొవెరా:

అలొవెరా:

కలబందలో ఉండే acemannen కంటెంట్ చర్మం మంట నయం చేసే శక్తి ని కలిగి ఉంటుంది. ఇది స్కిన్ బర్న్ ను చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. కాలిన గాయాల మీద అలొవెరా జెల్ ను డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మరియు కాలిన గాయాలాను చాలా త్వరగా మాన్పుతుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. బాగా కాలిన గాయాల మీద అలోవెరా జెల్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి స్కార్స్ ఏర్పడవు.

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ ను కాలిన గాయాల మీద అప్లై చేయడంతో మంచి ఫలితం ఉంటుంది. గుడ్డులోని తెల్లని పదార్థం తీసుకుని బీట్ చేయాలి. దీన్ని కాలిన గాయాల మీద అప్లై చేయాలి. కాలిన గాయాల మీద ఎగ్ వైట్ అప్లై చేయడం వల్ల నొప్ని, వాపు, చర్మం ఎర్రగా కందడం తగ్గుతుంది.

పసుపు:

పసుపు:

కాలిన గాయాలకు అమ్మలు, అమ్మమ్మలు ఉపయోగించే ఫస్ట్ అండ్ సింపుల్ రెమెడీ పసుపు.కాలిన వెంటనే పెట్టకుండా, మొదట గాయాన్ని నీళ్ళతో కడిగి, తేమ తుడిచి, తర్వాత పసుపు అప్లై చేయాలి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్.. కాలిన గాయాలను వెంటనే నయం చేస్తుంది. వాపుని, మచ్చలు తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పెరుగులో చిటికెడు పసుపు కలిపి.. అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటినీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి.

పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్

టీ బ్యాగ్

టీ బ్యాగ్

టీ బ్యాగ్ చర్మాన్ని టైట్ గా మార్చి, డ్యామేజ్ అయిన చర్మకణాలను తొలగిస్తుంది. మచ్చలను తొలగిస్తుంది. బ్లాక్ టీ బ్యాగ్ తీసుకుని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత కాలిన చర్మంపై పెట్టాలి. చర్మం వెచ్చగా అయిన తర్వాత.. తీసేయాలి. ఇలా.. రోజుకి రెండు మూడు సార్లు చేయాలి. బ్లాక్ టీ బ్యాగ్ లో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంలో మంట తగ్గిస్తుంది. మొదట కాలిన గాయన్ని చల్లటి నీటితో కడిగి, తర్వాత పొడిబట్టతో తేమలేకుండా తుడవాలి. తర్వాత టీబ్యాగ్ ను గాయం మీద అప్లై చేయాలి.

కొబ్బరినూనె-నిమ్మరసం:

కొబ్బరినూనె-నిమ్మరసం:

కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటం వల్ల.. గాయమైన స్కిన్ టిష్యూస్ ని నయం చేస్తుంది. అలాగే కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని, అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి నేరుగా గాయం మీద అప్లై చేసి.. మసాజ్ చేయాలి. అందులోని పోషకాలను చర్మం గ్రహిస్తుంది. ఇలా రోజుకి రెండు, మూడు సార్లు చేస్తే.. బర్న్ మార్క్స్ తొలగిపోతాయి.

బొప్పాయి:

బొప్పాయి:

కాలిన గాయాలకు మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ, బొప్పాయి. బాగా పండిన బొప్పాయిలో యాంటీఫాలజిస్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఇవి కాలిన గాయలను మాన్పుతుంది. స్కిన్ బర్న్ ను నివారిస్తుంది. బొప్పాయిని మెత్తగా పే్ట్ చేసి గాయం మీద అప్లై చేయాలి. చాలా సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బంగాళాదుంప

బంగాళాదుంప

బంగాళాదుంపలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలిన మచ్చలను లైట్ గా మార్చేస్తాయి. బంగాళాదుంపను కొన్ని ముక్కలుగా కట్ చేసి.. కాలిన చర్మంపై రబ్ చేయాలి. క్లాక్ వైట్, యాంటీ క్లాక్ వైజ్ రుద్దాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి.

పాలు

పాలు

చల్లటి పాలల్లో ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం ఉండటం వల్ల.. స్కిన్ టిఫ్యూష్ ని మెరుగుపరిచి, మచ్చలను తగ్గిస్తాయి. కాటన్ బాల్ ని పచ్చిపాలలో ముంచి.. కాలిన మచ్చలపై పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి మూడుసార్లు చేయాలి.

పెరుగు:

పెరుగు:

కాలిన గాయాల మీద పాలను ఎలా అప్లై చేస్తారో, అదే విధంగా పెరుగు కూడా అప్లై చేయవచ్చు, అయితే పెరుగు చల్లగా, తాజాగా ఉండాలి. పెరుగులో ఉండే చిక్కదనం, గాయానికి పూత పూకగానే గాయం మొత్తం విస్తరిస్తుంది. క్రమం తప్పకుండా పెరుగును అప్లై చేస్తుంటే గాయంతో పాటు, మచ్చలు కూడా తొలగిపోతాయి.

చేతులు కాలితే....చేయండిలా!చేతులు కాలితే....చేయండిలా!

సోయా సాస్:

సోయా సాస్:

కాలిన గాయాలు బొబ్బలుగా కనబడుతుంటే, సోయాసాస్ గొప్పగా సహాయపడుతుంది. సోయాసాస్ ను గాయాల మీద అప్లై చేయడం వల్ల ఇది గాయాలను ఎఫెక్టివ్ గా మాన్పుతుంది. చిన్ని బొబ్బలైతే ఒకటి, రెండు రోజుల్లో మానిపోతుంది. పెద్దవాటికి క్రమం తప్పకుండా వాడుతూనే ఉండాలి.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయలో సల్ఫర్ ఉండటం వల్ల.. కాలిన మచ్చలను తొలగిస్తుంది. ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసం తీయాలి. కాటన్ బాల్ ఉపయోగించి.. చర్మంపై రాసుకోవాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి.

English summary

15+ Kitchen Products That Cure Skin Burn

Coming to the remedies for skin burn, all these products are easily availabe in the kitchen and after the accident, you should first go there to find atleast one of these for immediate relief from skin burn.
Desktop Bottom Promotion