For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసే ఫేస్ ప్యాక్స్

వృద్యాప్యలక్షణాలు కనబనివ్వకుండా చేసేందుకు వివిధ రకాల సౌందర్యఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి, వాటిలో ఏది ఉత్తమమైనదో తెలుసుకోవడం కష్టం.

|

యాంటీఏజింగ్ (వయస్సైపోవడం) శరీరంలో ఇది సహజంగా జరిగే మార్పు. కానీ ఎవ్వరికీ ఈ లక్షణాలు ఇష్టముండదు కదా? వయస్సైపోతున్నదని బాధపడుతున్నారా? ఎందుకు భయం, వయస్సైన తర్వాత ఎలా కనబడుతామని ఆందోళన? ఎవరైనా సరే ఏదో ఒక రోజు వయస్సు అవ్వాల్సిందే. అదే లైఫ్ అంటే .అయితే వయస్సైపోతుందని బాధపడే వారు, వయస్సును ఆపు చేయలేరు కానీ, వయస్సయ్యే లక్షణాలను మాత్రం ఆలస్యంచేయగలరు.

వృద్యాప్యలక్షణాలు కనబనివ్వకుండా చేసేందుకు వివిధ రకాల సౌందర్యఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి, వాటిలో ఏది ఉత్తమమైనదో తెలుసుకోవడం కష్టం. ప్రతి ఒక్కటి ఉత్తమమైనదిగానే కనిపిస్తుంది, కానీ ఏటువంటి దాన్ని ఎంపిక చేసుకోవాలో తెలియదు. మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే అన్ని రకాల యాంటీఏజింగ్ ఉత్పత్తుల్లో రసాయనాతో తయారై ఉంటాయి. వీటి వినియోగం వల్ల వృద్యాప్యలక్షణాలు మరింత ఎక్కువగా కనబడుతాయి.

వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసే ఫేస్ ప్యాక్స్

మార్కెట్లో ప్రొడక్ట్స్ ప్రస్తుతానికి ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలంలో వీటి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. మరి అయితే ఏం చేయాలి? వృద్యాప్యలక్షణాలను ఆలస్యం చేయడానికి ఏదైనా మార్గం ఉందా? అంటే ఖచ్చితంగా ఉందనే అంటున్నారు నిపుణులు. ఇంట్లోనే యాంటీ ఏజింగ్ క్రీములను స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఇవి 100% సహజసిద్దమైనవి, వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

అరటి -పెరుగు ప్యాక్ :

అరటి -పెరుగు ప్యాక్ :

బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి, మూడు టీస్పూన్లు తీసుకోవాలి. అందులో విటమిన్ ఇ ఆయిల్ మిక్స్ చేయాలి. తర్వాత ఫ్రిజ్ లో 10 నిముషాలు పెట్టి, తర్వాత తీసి, పెరుగు కూడా కలిపి ముఖానికి చల్లగా ప్యాక్ వేసుకుని, అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మంలో ముడుతలు, సన్నని చారలు తొలగిపోతాయి.

నిత్యయవ్వనాన్ని ప్రోత్సహించే 14 యాంటీఏజింగ్ ఫుడ్స్ నిత్యయవ్వనాన్ని ప్రోత్సహించే 14 యాంటీఏజింగ్ ఫుడ్స్

టమోటో , గుమ్మడి విత్తనాల ప్యాక్ :

టమోటో , గుమ్మడి విత్తనాల ప్యాక్ :

టమోటో ముక్కలతో పాటు కొద్దిగా గుమ్మడి విత్తనాలు కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 45నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

టమోటోలో ఉండే యాసిడ్స్ చర్మానికి పాలిష్ ఇస్తుంది, ట్యానింగ్ తగ్గిస్తుంది. లైన్స్ , ముడుతలను తొలగిస్తుంది,

గుమ్మడి పవర్ ఫుల్ బూస్టర్ గా పనిచేస్తుంది. చర్మానికి కావల్సిన మినిరల్స్ ను అందిస్తుంది.

గ్రీన్ ఫేస్ ప్యాక్ :

గ్రీన్ ఫేస్ ప్యాక్ :

ఒక కప్పు గ్రీన్ లీవ్స్ కొత్తిమీర, ఒక కప్పు కరివేపాకు , ఒక కప్పు పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేయాలి.

ఇందులో కొద్దిగా కొబ్బరి పాలు, రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫ్రిజ్ లో 10 నిముషాలు పెట్టాలి.

10 నిముషాల తర్వాత బయటకు తీసి, విటమిన్ ఇ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 45 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. అంతే ముడుతలు మచ్చలు ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

వయస్సు పెరుగుతున్నాయంగ్ గా కనబడేందుకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వయస్సు పెరుగుతున్నాయంగ్ గా కనబడేందుకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్

అవొకాడో అండ్ క్రీమ్ ఫేస్ ప్యాక్ :

అవొకాడో అండ్ క్రీమ్ ఫేస్ ప్యాక్ :

అవొకాడోలో లోపల గింజ తొలగించి మెత్తగా పేస్ట్ చేయాలి. దీనికి ఫ్రెష్ క్రీమ్ జోడించి 10 నిముషాలు ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత బయటకు తీసి, ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 45 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ రెగ్యులర్ గా వేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. ముడుతలు మాయం అవుతాయి.

యాపిల్, పొటాటో, అలోవెర

యాపిల్, పొటాటో, అలోవెర

ఈ కాంబినేషన్ వండర్ ఫుల్ కాంబినేషన్ ఒక్కొక్కటి 3/4 తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులో అలోవెర జెల్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 45 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

English summary

Five Anti-Ageing Face Packs From The Kitchen

There are several fruits and vegetables you could use to make effective anti-ageing skin treatments, although if you have very severe signs of ageing, consulting a dermatologist would be the best option for you.
Story first published:Saturday, July 22, 2017, 16:38 [IST]
Desktop Bottom Promotion