For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో చర్మం డ్రైగా మారకుండా ఉండాలంటే ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..!

By Mallikarjuna
|

వింటర్ వచ్చిందంటే చాలు చర్మ సౌందర్యాన్నంతటిని పాడుచేస్తుంది. అప్పటి వరకూ అందంగా, కాంతి వంతంగా వెలిగిపోయే చర్మం కాస్త చలికి, కఠిమైన చల్లటి గాలులకు చర్మంలో మాయిశ్చరైజర్ తగ్గిపోయి, చర్మం నిర్జీవంగా మారుతుంది. చర్మంలో న్యాచురల్ మాయిశ్చరైజర్ కోల్పోవడం వల్ల చర్మం డ్రైగా, పొట్టుగా మారుతుంది.

అందువల్ల వింటర్ సీజన్లో చర్మం సంరక్షణ కోసం ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం. వింటర్లో చర్మ సంరక్షణకు కొన్ని ఫేస్ ప్యాక్స్ సహాయపడుతాయి. వీటి ద్వారా చలికాలంలో చర్మం పొడిబారకుండా నివారించుకోవచ్చు.

ఫేస్ ప్యాక్స్ కోసం అరటి, అవొకాడో, వంటి న్యాచురల్ పదార్థాలను ఉపయోగించుకోవచ్చు. అంతే కాదు, వింటర్లో వచ్చే ఇతర చర్మ సమస్యలను కూడా ఈ ఫేస్ ప్యాక్ లతో నివారించుకోవచ్చు.

ముఖ్యంగా ఫ్రూట్స్ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంలో కోల్పోయిన కళను తిరిగి తీసుకొస్తుంది. ఫ్రూట్స్ లో ఉండే యాంటీఆక్సిడ్సెంట్స్, విటమిన్స్ చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది, మాయిశ్చరైజింగ్ గుణాలను పెంచుతుంది.

వింటర్లో డ్రై స్కిన్ నివారించుకోవడానికి కొన్ని ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ఈ క్రింది విధంగా..

1. దానిమ్మ ఫేస్ ప్యాక్

1. దానిమ్మ ఫేస్ ప్యాక్

- ఒక టీస్పూన్ దానిమ్మ రసాన్ని ఒక టీస్పూన్ శెనగపిండితో కలపాలి.

- ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాలు అలాగే ఉంచాలి

- 10 నిముషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

- ఈ ప్యాక్ ను నెలలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. ఆరెంజ్ ఫేస్ ప్యాక్

2. ఆరెంజ్ ఫేస్ ప్యాక్

- 2 టీస్పూన్ల అలోవెర జెల్ తీసుకుని, ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్ తో కలపాలి.

- ఈ మిశ్రమాన్ని ముఖానికి పూర్తిగా అప్లై చేయాలి. ఒక సారి డ్రైగా మారిన తర్వాత తిరిగి దానిమీద మరో సారి ప్యాక్ అప్లై చేయాలి

- 10 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. తర్వాత లైట్ గా మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

- ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. అరటితో ఫేస్ ప్యాక్

3. అరటితో ఫేస్ ప్యాక్

- బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చేసి అందులో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి,

- ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

- పూర్తిగా డ్రైగా మారే వరకూ ఉండనిచ్చి తర్వాత ట్యాప్ వాటర్ తో కడగాలి. తడిని పూర్తిగా తుడిచి, లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

- ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. ఆపిల్ ఫేస్ ప్యాక్

4. ఆపిల్ ఫేస్ ప్యాక్

- ఆపిల్ ను ముక్కలుగా కట్ చేసి, మెత్తగా చేయాలి. అందులో ఒక టీస్పూన్ తేనె బేసి బాగా మిక్స్ చేయాలి.

- ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 10 -15నిముషాలు పూర్తిగా డ్రైగా మారనివ్వాలి.

- 15 నిముషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఉత్తమ ఫలితాలకోసం ఒక వారం పాటు ఈ ప్యాక్స్ వాడుకోవచ్చు.

5. అవొకాడో ఫేస్ ప్యాక్

5. అవొకాడో ఫేస్ ప్యాక్

- అవొకాడోను మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మొత్తానికి అప్లై చేయాలి.

- ఈ ఫేస్ ప్యాక్ పూర్తిగా ఎండి పోయే వరకూ అలాగే ఉండనిచ్చి తర్వాత ట్యాప్ వాటర్ తో కడిగేయాలి.

- ఈ స్కిన్ న్యూరిషింగ్ ఫేస్ ప్యాక్ ను వారంలో ఒకాసిరి వేసుకుంటుంటే చర్మం స్మూత్ గా మారుతుంది.

6. ద్రాక్షతో ఫేస్ ప్యాక్

6. ద్రాక్షతో ఫేస్ ప్యాక్

- ఒక గుప్పెడు ద్రాక్ష తీసుకుని, మెత్తగా చేయాలి. తర్వాత అందులోనే ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి.

- ఈ పేస్ట్ ను ముఖం మొత్తానికిఅప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 15 నిముషాలు డ్రైగా మారనివ్వాలి.

- ఫేస్ ప్యాక్ డ్రైగా అయిన తర్వాత ట్యాప్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి.

- ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

7. పియర్స్ ఫేస్ ప్యాక్స్ :

7. పియర్స్ ఫేస్ ప్యాక్స్ :

- బేరిపండ్లను మెత్తగా పేస్ట్ చేసి, అందులో అరటీస్పూన్ బాదం ఆయిల్ కలపాలి.

- తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచాలి.

- 15 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో కడగేయాలి.

- ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ను వారంలో ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

8. స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్

8. స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్

- సింపుల్ గా బాగా పండిన స్ట్రాబెర్రీని తీసుకుని అందులో ఒక టీస్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి.

- ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి, 10 నిముషాలు అలాగే ఉండనివ్వాలితర్వాత ట్యాప్ వాటర్ తో కడగాలి.

-వారంలో ఒకసారి ఇలా వేసుకోవడం వల్ల చర్మం అందంగా, కాంతివంతంగా మారుతుంది.

English summary

Fruit Face Packs To Avoid Dry Skin This Winter

Extra care needs to be taken to your skin, especially during winter. And, the best way to take care of the skin would be by treating your skin with face packs that can prevent dryness.
Desktop Bottom Promotion