Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే..
పెదాల చుట్టూ చర్మం నలుపును పోగొట్టే వంటింటి చిట్కాలు!
మనం నిద్రలేచిన దగ్గర నుండి ఎంతో మందిని చూస్తుంటాం..ఎంతో మందిని కలుస్తుంటాం. ఎదుటివారిని ఆకర్షించాలంటే అన్నిటికన్నా ముందు మన ముఖంలో చిరునవ్వు ఉండాలి. కాని కొందరు అలా నవ్వడానికి కూడా మొహమాటపడతారు.

అందుకు కారణం వారి పేదలు నల్లగా ఉండడం.. లేక వీరి పెదాల చుట్టూ నల్లగా ఉండడం వల్ల వీరు నలుగురిలో నవ్వడానికి వెనకాడతారు. శరీరంలో విటమిన్ల లోపం ఉంటె పెదాలు ఇలా నల్లగా మారుతాయి. మరో కారణం తరచూ నాలుకతో తడుపుతూ ఉండటం. శరీరం వేడి వల్ల కూడా పెదాలు నల్లగా మారవచ్చు. ఇవే కాదు.. పెదాలు నల్లబడడానికి మరెన్నో కారణాలు ఉన్నాయి.
మెడ చుట్టూ, వీపు భాగంలో డార్క్ స్కిన్ పోగొట్టే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!
పెదాలు నల్లగా మారడానికి కారణాలు ఏవైనా వాటితని సహజ రంగులోకి మార్చుకోవాలి. నీళ్లూ, కాయగూరలూ, పండ్లూ అవసరమైన మేరకు తీసుకునేవారిలో తేమ పుష్కలంగా ఉండి పెదాలు పొడిబారవు. నలుపు సమస్య ఉండదు. అందుకే పండ్లూ, కాయగూరలూ తింటూ లిప్‌బామ్‌ని రెండు పూటలా రాసుకోవాలి. ఎస్‌పీఎఫ్ లేని లిప్‌బామ్‌లు అయితే మంచిది. వీటితో ఇలా నల్లగా ఉన్న పేదలను.. సహజ రంగులోకి మార్చుకోడానికి మరి కొన్ని చిట్కాలు మీ కోసం...

నిమ్మరసం :
చర్మంలో డార్క్ ప్యాచెస్ ను నివారించే బ్లీచింగ్ ఏజెంట్ గా నిమ్మరసం పనిచేస్తుంది. ఎందుకంటే నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది డార్క్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది.

నిమ్మ-ఆలివ్ ఆయిల్ :
నిమ్మరసంలో ఆస్ట్రింజెంట్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి, చర్మంలో లైట్ గా మార్చడంలో ఇది గ్రేట్ రెమెడీ. నిమ్మరసంకు సమంగా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని, రెండూ బాగా కలిసేలా మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. తర్వాత ముఖం శుభ్రంగా కడిగి, ఈ రెమెడీని ముఖానికి అప్లై చేయాలి. రోజులో రెండు సార్లు ఈ రెమెడీ ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. పెదాల చుట్టూ మాత్రమే కాదు ముఖంలో ఎక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నా తొలగిపోతుంది.

గంద-పసుపు:
పెదాల చుట్టూ చర్మంలో నలుపు తగ్గించడానికి గందం, పసుపు గ్రేట్ గా సహాయపడుతుంది. గందం కొద్దిగా తీసుకుని, అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేసి, అరగంట తర్వాత కొద్దిగా నీళ్ళతో తడిచేసి, స్ర్కబ్ చేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ హోం రెమెడీ డార్క్ లిప్స్ ను నివారించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఓట్ మీల్ స్ర్కబ్ :
ఓట్ మీల్ స్ర్కబ్ డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. నోటి చుట్టూ డార్క్ ప్యాచెస్ ను తొలగిస్తుంది. ఈ రెమెడీని ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. అందుకు రెండు టీస్పూన్ల ఓట్ మీల్ తీసుకుని, అందులో కొద్దిగా టమోటో రసం, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, స్ర్కబ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెర:
ఇది పురాతన కాలం నాటి ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది చర్మంలో సన్ టాన్ నివారిస్తుంది. ఫ్రెష్ అలోవెర జ్యూస్ తీసుకుని, ముఖం, పెదాల చుట్టూ మసాజ్ చేయాలి. అలోవెర జెల్ అప్లై చేసిన అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పాలు :
పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మ రంగును న్యాచురల్ గానే తెల్లగా మార్చుతుంది. అంతే కాదు స్కిన్ ను యంగ్ గా మార్చుతుంది. చర్మంలో మంచి కాంతి వస్తుంది. పెదాల చుట్టూ నలుపు తగ్గుతుంది. అందుకోసం కొద్దిగా పచ్చిపాలు తీసుకుని, పెదాల చుట్టూ అప్లై చేయాలి. పాల తడి పూర్తిగా డ్రైగా మారే వరకూ ఉండి తర్వాత చల్లటి నీటితో కడిగితే పెదాల చుట్టూ ఉండే డార్క్ స్కిన్ సమస్య తగ్గుతుంది.

శెనగపిండి:
శెనగపిండి డార్క్ స్కిన్ నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంలోని డార్క్ ప్యాచెస్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. రెండు స్పూన్ల శెనగపిండి, ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి. అలాగే కొద్దిగాపాలు మిక్స్ చేసి, తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ మాస్క్ ను పెదాల చుట్టూ అప్లై చేసి, డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు-నిమ్మరసంతో ప్యాక్ :
పాలు మరియు నిమ్మరసం మిక్స్ చేసి పెదాల చుట్టూ అప్లై చేయాలి. ఒక స్పూన్ క్రీమ్ తీసుకుని అందులో నిమ్మరసం మిక్స్ చేసి, తర్వాత పెదాల చుట్టు నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. కొద్ది సమయం మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో కడిగితే చాలు చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ రెమెడీని ఉపయోగించడం వల్ల డార్క్ స్కిన్ తొలగిపోతుంది. ఇది కాంతివంతమైన హెల్తీ స్కిన్ ను అందిస్తుంది.

బాదం ఆయిల్:
బాదం ఆయిల్ తో చర్మానికి మసాజ్ చేయాలి. రాత్రుల్లో చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు బాదం ఆయిల్ ను చర్మంపై అప్లై చేసి, మసాజ్ చేసి వదిలేయాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications