For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నూనెలతో ఆయిల్ స్కిన్ కు చెక్ పెట్టవచ్చు!

|

చాలా మంది అమ్మాయి లేదా అబ్బాలు అస్తమానం అద్దం ముందు నిలబడే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు. ఇంకా చేప్పాలంటే చర్మ సమస్యలున్నప్పుడు ఇంకొద్దిసేపు ఎక్కువగా నిలబడి మొటిమలు, మచ్చలు, నల్లని వలయాలను ఎలా నివారించుకోవాలని చూస్తుంటారు . వీటికి తోడు ఆయిల్ స్కిన్ ఉన్నట్లైతే మరికొంత ఇరిటేషన్ పొందుతారు. ముఖంలో జిడ్డు, షైనింగ్ ప్యాచెస్ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి సమస్యలు టీనేజ్ లో ఎక్కువ. అంతే కాదు సీజన్స్ బట్టి కొంత మందిలో కొత్తగా సమస్యలు వస్తుంటాయి.

వింటర్లో కూడా ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. వింటర్ లో పొడి గాలుల ప్రభావం వల్ల చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను తొలగించడం వల్ల ముఖం జిడ్డుగా మారుతుందని అనుకుంటారు. అయితే అది నిజం కాదు, వారి చర్మ తత్వాన్ని బట్టే చర్మం ఆయిలీగా కనబడుతుంది. వింటర్ అయినా, సమ్మర్ అయినా ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి స్పెషల్ గా కేర్ తీసుకోవాలి.

Homemade Essential Oil Face Masks For Oily Skin

చర్మంలో సెబమ్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల , చర్మంలో జిడ్డు తత్వం పెరుగుతుంది. చర్మంలో జిడ్డు పెరిగితే, చర్మంలో మొటిమలు, మచ్చలు పెరుగుతాయి. కాబట్టి, ఆయిల్ స్కిన్ నివారించాలంటే యాంటీఆక్సిడెంట్స్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న నూనెలను చర్మానికి ఉపయోగించాలి.

ఆయిల్ స్కిన్ నివారించుకోవడం ఎలా? ఆయిల్ స్కిన్ నివారించే 8 ఫేస్ ప్యాక్స్!ఆయిల్ స్కిన్ నివారించుకోవడం ఎలా? ఆయిల్ స్కిన్ నివారించే 8 ఫేస్ ప్యాక్స్!

మనం రెగ్యులర్ గా ఉపయోగించే నూనెలతోనే ఆయిల్ స్కిన్ ను నివారించుకోవచ్చు. అయితే వీటికి నేచురల్ అండ్ ట్రెడిషినల్ పదార్థాలను కలిపినప్పుడు అద్భుతమైన హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ తయారవుతాయి. ఈ మాస్కులను నెలలో రెండు సార్లు వేసుకుంటే, చర్మంలో జిడ్డుతత్వం త్వరగా తగ్గిపోతుంది.

గమనిక: ఎలాంటి ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా, ముందుగా చేతి మీద ప్యాచ్ టెస్ట్ వేసుకోవడం మంచిది.

1. టీట్రీ ఆయిల్, ఓట్ మీల్ ఫేస్ ప్యాక్

1. టీట్రీ ఆయిల్, ఓట్ మీల్ ఫేస్ ప్యాక్

ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్ లో 3 చుక్కల టీట్రీ ఆయిల్, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తరవ్ాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకొకసారి వేసుకుంటే ఆయిల్ స్కిన్ నివారిస్తుంది.

2. కేడర్ వుడ్ ఎసెన్షియల్ ఆయిల్, టమోటో ఫేస్ ప్యాక్

2. కేడర్ వుడ్ ఎసెన్షియల్ ఆయిల్, టమోటో ఫేస్ ప్యాక్

కేడర్ ఉడ్ ఎసెన్షియల్ ఆయిల్ 3 చుక్కలు, 1టేబుల్ స్పూన్ టమోటో పేస్ట్ మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను నెలలో రెండు సార్లు వేసుకోవచ్చు.

ఆయిల్ స్కిన్ నివారించడానికి 8 మోస్ట్ ఎఫెక్టివ్ ఫ్రూట్ స్క్రబ్ఆయిల్ స్కిన్ నివారించడానికి 8 మోస్ట్ ఎఫెక్టివ్ ఫ్రూట్ స్క్రబ్

3. రోజ్మెర్రీ ఆయిల్, బేకింగ్ సోడా, నిమ్మరసం ఫేస్ మాస్క్

3. రోజ్మెర్రీ ఆయిల్, బేకింగ్ సోడా, నిమ్మరసం ఫేస్ మాస్క్

3 చుక్కల రోజ్మెర్రీ ఆయిల్, అరటీస్పూన్ బేకింగ్ సోడా, ఒక టీస్పూన్ నిమ్మరసం, 4 చుక్కల రోజ్ వాటర్ ను మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ను నెలలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆయిల్ స్కిన్ నివారించుకోవచ్చు.

4. లెమన్ ఆయిల్, బెంటోనైట్ క్లే

4. లెమన్ ఆయిల్, బెంటోనైట్ క్లే

బెంటోనైట్ క్లే లో రెండు, మూడు చుక్కల లెమన్ ఆయిల్ మిక్స్ చేసి, డిస్టిల్డ్ వాటర్ కలిపి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 10 నిముషాలు డ్రై అయిన తర్వాత మెత్తటి, కాటన్ క్లాత్ తో ముఖం క్లీన్ గా తుడవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మరీ జిడ్డులేకుండా నివారించబడుతుంది.

5. జెరేనియం ఆయిల్ , ఎగ్ వైట్

5. జెరేనియం ఆయిల్ , ఎగ్ వైట్

ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అందులో జెరేనియం ఆయిల్ ను మిక్స్ చేసి, ముఖానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ను నెలలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆయిల్ స్కిన్ తగ్గుతుంది.

6. అలోవెర ఆయిల్, ఫుల్లర్స్ ఎర్త్

6. అలోవెర ఆయిల్, ఫుల్లర్స్ ఎర్త్

ఒక టీస్పూన్ ఫుల్లర్స్ ఎర్త్ తీసుకుని, అందులో రెండు, ముడు చుక్కల అలోవెర ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ ట్రెడిషినల్ రెమెడీని బాగా మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ను నెలలో రెండు సార్లు వేసుకోవచ్చు.

ఆయిల్ స్కిన్ ఉన్నవారు వింటర్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు ..!ఆయిల్ స్కిన్ ఉన్నవారు వింటర్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు ..!

7. వైలాంగ్ ఎసెన్సియల్ ఆయిల్, శెనగపిండి

7. వైలాంగ్ ఎసెన్సియల్ ఆయిల్, శెనగపిండి

ఒక టీస్పూన్ శెనపిండిలోని ఒక టీస్పూన్ నూనెను మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ మాస్క్ ను ముఖం, మెడకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ను నెలకొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

8. జోజోబ ఆయిల్ , సాండిల్ ఉడ్ పౌడర్

8. జోజోబ ఆయిల్ , సాండిల్ ఉడ్ పౌడర్

ఒక టీస్పూన్ సాండిల్ ఉడ్ పౌడర్ లో రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. అలాగే రెండు మూడు చుక్కలు వేసి ఫేస్ మాస్క్ తయారుచేసుకోవాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను రోజులో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

9. ల్యావెండర్ ఆయిల్, అలోవెర జెల్

9. ల్యావెండర్ ఆయిల్, అలోవెర జెల్

రెండు మూడు స్పూన్ల అలోవెర జెల్ తీసుకుని అందులో ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత తడి బట్టతో తుడిచేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను నెలలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో ఎసెన్షియల్ ఆయిల్ పూర్తిగా నివారించబడుతుంది

English summary

Homemade Essential Oil Face Masks For Oily Skin

Here are some homemade essential oil face masks to try for oily skin. Take a look and try them now.
Desktop Bottom Promotion