For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖం మీద వున్న సన్ టాన్ పోగొట్టడానికి నిమ్మకాయ రసాన్ని ఎలా వాడాలి?

మీ ముఖం నుండి సన్ టాన్ తొలగించడానికి నిమ్మకాయ జ్యూస్ ఎలా ఉపయోగించాలి.

By Ashwini Pappireddy
|

నిమ్మ రసంలో ఉన్నటువంటి కొన్ని సహజ లక్షణాల వలన గత కొన్ని సంవత్సరాల నుండి చర్మ సంబంధిత సమస్యలకు చికిత్స కోసం నిమ్మరసంని ఒక ఔషధంగా వాడుతున్నారు.ఈ సహజ పదార్ధం లో ఉన్నటువంటి విటమిన్ సి, సిట్రిక్ ఆమ్లం మరియు మీ చర్మం యొక్క స్థితిని మార్చే ఇతర సమ్మేళనాలతో నిండి ఉంటుంది.

ఇది బ్లీచింగ్ గా పని చేసి మీ చర్మం తెల్లబడటంలో సహాయపడుతుంది. నిమ్మరసం లో ఈ లక్షణాలని కలిగివుండటం వలన ఇది సూర్యుడిని నుండి వచ్చే టాన్ ని పోగొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

how to use lemon juice to remove sun tan from your face

సూర్యుని నుండి మీ ముఖం మీద ఏర్పడే టాన్ ని పోగొట్టడానికి నిమ్మరసం ని ఎలా ఉపయోగించాలో ఇప్పడు చూద్దమా మరి!

సూర్యుని నుండి ఏర్పడే టాన్ నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి నిమ్మ రసం ప్రభావవంతంగా పనిచేయడం వలన దీనిని చర్మ సంరక్షణకి చికిత్సగా వాడుతారు.

మీరు కూడా టాన్ సమస్యతో బాధపడుతున్నారా? మరియు మీ ముఖం లో ఏర్పడిన టాన్ ని ఎలా పోగొట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే! అవును, ఇవాళ మీరు మీ ముఖం లో సూర్యుడి నుండి వచ్చే టాన్ ని తొలగించడానికి నిమ్మ రసంను ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చునో మీకోసం తెలియజేశాము.

మీరు ఈ క్రింది వాటిని ఉపయోగించాడనికి ముందు మీరు మీ చర్మాన్ని ఒకసారి పరీక్షించుకోవడం అవసరం. మరి అవేంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధం గా వున్నారా?

1. నిమ్మకాయ రసంతో దోసకాయ:

1. నిమ్మకాయ రసంతో దోసకాయ:

- ఒక చిన్న గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ దోసకాయ పేస్ట్ ని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తో

కలపండి.

- ఈ రసాన్ని టాన్ ఏర్పడిన ప్రాంతం మొత్తం రాయండి.

- ఒక 10 నిముషాల పాటు అలానే ఉంచేసి ఆరిన తర్వాత మంచి నీటి తో కడిగేయండి.

- మీ చర్మం నుండి సులభంగా టాన్ పోవడానికి దీనిని కనీసం వారానికి 3-4 సార్లు వాడటం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

2. నిమ్మకాయ రసం తో పసుపు :

2. నిమ్మకాయ రసం తో పసుపు :

- ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకొని దానికి ఒక చిటికెడు పసుపు మరియు ½ టీ

స్పూన్ గులాబీ నీటిని జత చేసి బాగా కలపండి.

- ఇప్పుడు ఈ రసాన్ని మీ చర్మం కమిలిపోయిన మరియు టాన్ ఏర్పడిన ప్రాంతం మొత్తం మెల్లగా

పత్తితో రాయండి.

- 5-10 నిమిషాల పాటు మీ చర్మం మీద ఉండనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- గొప్ప ఫలితాలను పొందడానికి ఒక వారంలో కనీసం రెండుసార్లు ఈ కాంబోని ఉపయోగించండి.

3. నిమ్మకాయ రసం తో మజ్జిగ:

3. నిమ్మకాయ రసం తో మజ్జిగ:

- ఒక చిన్న గిన్నెలో1 టీస్పూన్ నిమ్మ రసం యొక్క మిశ్రమాన్ని 2 టీస్పూన్లు మజ్జిగతో కలిపి సిద్ధం చేసుకోండి.

- ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాసి, ఒక 5 నిముషాల పాటు ఆరనివ్వాలి.

- గమనించదగ్గ ఫలితాల కోసం, మీ ముఖాన్ని శుభ్రం చేయడానికి వారానికి కనీసం 2-3 సార్లు దీనిని ప్రయత్నించండి.

4. నిమ్మకాయ రసం తో పెరుగు:

4. నిమ్మకాయ రసం తో పెరుగు:

- ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్ని కలపాలి.

- ఎండకి కమిలిపోయిన మరియు టాన్ ఏర్పడిన ప్రాంతంలో ఈ రసాన్ని రాసి 5 నిముషాలపాటు

ఆరనివ్వండి.

- కాస్సేపటి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. మరియు దీనిని మీ చర్మం రిఫ్రెష్ టోనర్ గా ఉపయోగించుకోవచ్చు.

- మీ ముఖం మీద వున్న టాన్ ని తొలగించడానికి ఈ పద్దతిని రోజువారీ భాగంగా ప్రయత్నించండి.

5. కలబంద గుజ్జు మరియు ఆరెంజ్ తొక్క పొడి తో నిమ్మకాయ రసం:

5. కలబంద గుజ్జు మరియు ఆరెంజ్ తొక్క పొడి తో నిమ్మకాయ రసం:

- ఒక చిన్న గిన్నెలో ½ టీస్పూన్ నిమ్మ రసం తీసుకొని 1 టీస్పూన్ కలబంద గుజ్జు మరియు చిటికెడు నారింజ తొక్క పొడితో కలపండి.

- ఈ రసాన్ని ఎండతో భాధించబడిన ప్రాంతంలో రాయండి.

- ఒక 10 నిముషాల పాటు ఆరనివ్వండి,కాస్సేపటి తరువాత గోరువెచ్చని

నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

- ప్రతి వారం ఇదే ప్రక్రియని అనుసరించి మీ చర్మం మీద వున్న టాన్ నుండి విముక్తులవండి.

6. నిమ్మకాయ రసంతో తేనె మరియు శనగపిండి

6. నిమ్మకాయ రసంతో తేనె మరియు శనగపిండి

-1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం లో ½ టీస్పూన్ శనగపిండి మరియు1 టేబుల్ స్పూన్ తేనెని కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసే ముందు మీ ముఖాన్ని తడిగా ఉంచుకోండి.

- ఎండకి భాధించబడిన ప్రాంతంలో దీనిని రాసి సుమారు 10-15 నిమిషాలు ఆరనివ్వండి.

- కాస్సేపటి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- వారానికి ఒకసారి దీనిని ఉపయోగించడం వలన సూర్యని నుండి ఏర్పడిన టాన్ నుండి విముక్తి పొందండి.

7. నిమ్మకాయ రసం తో బియ్యపు పిండి

7. నిమ్మకాయ రసం తో బియ్యపు పిండి

- ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండిలో 2 టీస్పూన్ల నిమ్మ రసం ని కలపండి.

- సూర్యుడికి ప్రభావితమైన ప్రాంతంలో దీనిని రాసి 5-10 నిమిషాలు మసాజ్ చేయండి

-కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- కనిపించే ఫలితాలను పొందడానికి ఒక వారంలో రెండుసార్లు మీ ఇంట్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకొని ఈ నిమ్మ రసం మిశ్రమాన్ని ఉపయోగించండి.

8. నిమ్మకాయ రసం తో బొప్పాయి గుజ్జు

8. నిమ్మకాయ రసం తో బొప్పాయి గుజ్జు

- తాజాగా సేకరించిన 2 టీస్పూన్ల నిమ్మ రసం ని బొప్పాయి గుజ్జుతో కలపండి.

-ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాయండి.

- కాసేపు ఆరనివ్వాలి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- కావలసిన ఫలితాలను పొందటానికి వారానికి మూడుసార్లు దీనిని ఉపయోగించవచ్చు.

English summary

How To Use Lemon Juice To Remove Sun Tan From Your Face

Lemon juice has become a cult-favourite for treating skin-related problems. This natural ingredient is replete with vitamin C, citric acid and other compounds that can improve the state of your skin and also remove sun tan from face .
Story first published:Wednesday, November 29, 2017, 12:41 [IST]
Desktop Bottom Promotion