For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుమ్మడికాయతో మీ స్కిన్ గ్లో పెంచుకోవచ్చని తెలుసా...

గుమ్మడికాయతో మీ స్కిన్ గ్లో పెంచుకోవచ్చట.

By Lakshmi Perumalla
|

నారింజ రంగులో ఉండే గుమ్మడికాయ తినటానికే కాకుండా అలంకరణకు మరియు సౌందర్య ప్రయోజనాలకు చాలా ప్రసిద్ధి చెందింది.

పురాతన కాలం నుండి ఈ అద్భుతమైన కూరగాయను చర్మ సంరక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. గుమ్మడికాయలో విటమిన్లు మరియు ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ (AHA) సమృద్ధిగా ఉండుట వలన చర్మం పునరుద్ధరణకు మరియు చర్మం యవ్వనంగా కనపడటానికి సహాయపడుతుంది.

How To Use Pumpkin For Skin Care

గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందట!

చాలా మంది ప్రజలు వారి చర్మ సంరక్షణలో ఈ అద్భుతమైన కూరగాయను చేర్చారు.అయితే, మీరు మీ చర్మం మీద ప్రయత్నించకపోతే, చర్మ సంరక్షణ కోసం గుమ్మడికాయను ఎలా ఉపయోగించాలో మీకు boldsky ఈ వ్యాసంలో వివరిస్తుంది.

గుమ్మడికాయ ప్రయోజనాలు పొందాలంటే గుమ్మడికాయను ఒక నిర్దిష్ట మార్గంలో ఉపయోగించాలి. ఈ క్రింది మార్గాలు మీరు ఉత్తమ ఫలితాలను పొందటానికి సహాయపడతాయి. మీరు ప్రకాశవంతమైన ఛాయను పొందటానికి మరియు వృధాప్య లక్షణాలను ఆలస్యం చేయటానికి ఈ కూరగాయను ఉపయోగించవచ్చు.

ఇప్పుడు చెపుతున్న మార్గాలను అనుసరించి మీరు మీ చర్మ సంరక్షణలో గుమ్మడికాయను చేర్చుకొని ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోండి.

<strong>గుమ్మడిలో ఉన్నాయి ఆశ్చర్యం కలిగించే సౌందర్య రహస్యాలు</strong>గుమ్మడిలో ఉన్నాయి ఆశ్చర్యం కలిగించే సౌందర్య రహస్యాలు

గుమ్మడికాయ + విటమిన్ ఇ ఆయిల్

గుమ్మడికాయ + విటమిన్ ఇ ఆయిల్

- గుమ్మడికాయ ముక్కను పేస్ట్ చేసి దానిలో విటమిన్ E గుళిక నుండి తీసిన నూనెను కలపాలి.

- ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసి 10 నుంచి 15 నిముషాలు ఆలా వదిలేయాలి.

- మీ చర్మాన్ని ఒక ప్రక్షాళన మరియు వెచ్చని నీటితో శుభ్రపరచండి.

- ఈ విధంగా మీ చర్మ పోషణ కొరకు గుమ్మడికాయను ఉపయోగించండి.

గుమ్మడికాయ + దాల్చిన చెక్క పొడి

గుమ్మడికాయ + దాల్చిన చెక్క పొడి

- ఒక స్పూన్ గుమ్మడికాయ పేస్ట్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్ మరియు చిటికెడు దాల్చిన చెక్క పొడి కలపాలి.

- ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసి 15 నిమిషాల పాటు ఆలా వదిలేయాలి.

- ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

- ఈ విధంగా చేస్తే మీ చర్మం యవ్వనంగా కనపడుతుంది.

గుమ్మడికాయ + తేనే

గుమ్మడికాయ + తేనే

- ఒక స్పూన్ గుమ్మడికాయ పేస్ట్ లో ఒక స్పూన్ తేనే కలపాలి.

- ఈ మిశ్రమాన్ని చర్మం మీద రాసి 10 నిముషాలు ఆలా వదిలేయాలి.

- ఆ తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

- ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మొటిమలు,నల్లని మచ్చలు తగ్గుతాయి.

గుమ్మడికాయ + పెరుగు

గుమ్మడికాయ + పెరుగు

- ఒక స్పూన్ గుమ్మడికాయ జ్యుస్ లో రెండు స్పూన్ల పెరుగు కలపాలి.

- ఈ మిశ్రమాన్ని చర్మం మీద రాసి 10 నిముషాలు ఆలా వదిలేయాలి.

- ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

- ఈ మిశ్రమం వృద్ధాప్య సంకేతాలను తగ్గించటానికి బాగా సహాయపడుతుంది.

గుమ్మడికాయ + బాదం ఆయిల్

గుమ్మడికాయ + బాదం ఆయిల్

- ఒక బౌల్ లో ఒక స్పూన్ గుమ్మడికాయ పేస్ట్ తీసుకోని దానిలో అరస్పూన్ బాదం నూనె కలపాలి.

- ఈ మిశ్రమాన్ని చర్మం మీద రాసి 10 నిముషాలు ఆలా వదిలేయాలి.

- ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

గుమ్మడికాయ + ఆపిల్ సైడర్ వినెగార్

గుమ్మడికాయ + ఆపిల్ సైడర్ వినెగార్

- ఒక స్పూన్ గుమ్మడికాయ గుజ్జులో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వినెగార్ వేసి కలపాలి.

- ఈ మిశ్రమాన్ని చర్మం మీద రాసి 10 నుంచి 15 నిముషాల పాటు ఆలా వదిలేయాలి.

- ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

- ఈ మిశ్రమం మీ చర్మం నుండి బ్లాక్ హెడ్స్ తొలగించటానికి సహాయపడుతుంది.

గుమ్మడికాయ + నిమ్మ రసం

గుమ్మడికాయ + నిమ్మ రసం

- ఒక స్పూన్ గుమ్మడికాయ గుజ్జులో రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి.

- ఈ మిశ్రమాన్ని చర్మం మీద రాసి 15 నిముషాల పాటు ఆలా వదిలేయాలి.

- ముఖం ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

- ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ప్రకాశవంతమైన ఛాయ మీ సొంతం అవుతుంది.

గుమ్మడికాయ + వోట్మీల్

గుమ్మడికాయ + వోట్మీల్

- ఒక స్పూన్ గుమ్మడికాయ గుజ్జులో ఒక స్పూన్ ఉడికించిన వోట్మీల్ కలపాలి.

- ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి నిదానంగా స్క్రబింగ్ చేయాలి.

- పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి.

- ఈ మిశ్రమం మీ చర్మ ఎక్స్ ఫ్లోట్ తొలగించటానికి సహాయపడుతుంది.

గుమ్మడికాయ + బొప్పాయి గుజ్జు

గుమ్మడికాయ + బొప్పాయి గుజ్జు

- ఒక స్పూన్ గుమ్మడికాయ జ్యుస్ లో ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు కలపాలి.

- ఈ మిశ్రమాన్ని చర్మం మీద రాసి 10 నిముషాలు ఆలా వదిలేయాలి.

- ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

- ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

English summary

How To Use Pumpkin For Skin Care

Not just the health benefits but there are several beauty benefits of pumpkin too. Rea to know how pumpkin can benefit your skin.
Desktop Bottom Promotion