For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళ క్రింద నల్లని వలయాలను తొలగించుకోవడానికి ఆముదం ఎలా వాడాలి?

|

మన శరీరం మీద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా కళ్ళక్రింద ఉండే చర్మం మరింత సున్నితంగా పల్చగా ఉంటుంది. కళ్ళ క్రింద చర్మంలో కూడా అనేక రక్తనాళాలు, నరాలు విస్తరించి ఉంటాయి. కాబట్టి, ఈ ప్రదేశంలో ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా చర్మం దెబ్బతింటుంది. సమస్యగా మారుతుంది.

చర్మం పల్చగా ఉన్న చోట చర్మంలో ముడుతలు ఏర్పడటం చాలా సహజం. ముడుతల సమస్యల స్త్రీలకు మాత్రమే కాదు, చాలా మంది మగవారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?

కళ్ళ చుట్టూ నల్లని వలయాలు మాయం చేసే బెస్ట్ టిప్స్కళ్ళ చుట్టూ నల్లని వలయాలు మాయం చేసే బెస్ట్ టిప్స్

కళ్ళ క్రింద నల్లని వలయాలను నివారించడంలో ఆముదం గ్రేట్ గా సహాయపడుతుంది. ఆముదం నూనెలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. ఆముదంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ముఖంలో నీరు చేరకుండా చేస్తుంది. దాంతో డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి

కళ్ళ క్రింద నల్లని వలయాలను నివారించుకునే క్రమంలో కేవలం ఆముదం మాత్రమే పనిచేయకపోతే, ఇతర పదార్థాలతో కలిపి వాడుకోవచ్చు. ఆముదంతో కలిపి వాడుకోదగ్గ పదార్థలేంటో, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...

డార్క్ సర్కిల్స్ మాయం చేసే సీక్రె ట్ నేచురల్ రెమెడీస్డార్క్ సర్కిల్స్ మాయం చేసే సీక్రె ట్ నేచురల్ రెమెడీస్

కొబ్బరి నూనె, ఆముదం నూనె :

కొబ్బరి నూనె, ఆముదం నూనె :

కొబ్బరి నూనె, ఆముదం నూనెను 1:1 తీసుకోవాలి. ఈ రెండు నూనెలను బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళక్రింద రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది. డార్క్ సర్కిల్స్ కు మసాజ్ చేస్పుడు, ముక్కుప్రకల కూడా అప్లై చేసి, సున్నితమైన మసాజ్ చేయాలి.

ఆముదం, ఆవ నూనె :

ఆముదం, ఆవ నూనె :

కళ్ళ క్రింద నల్లని వలయాలను తగ్గించుకోవడానికి ఆముదం, ఆవనూనె గ్రేట్ గా సహాయపడుతుంది. ఆవనూనె చర్మం మీద చాలా వేగంగా రియాక్ట్ అవుతుంది. రెండు టేబుల్ స్పూన్ల ఆముదం నూనెను, ముప్పావు టీస్పూన్ ఆవనూనెతో కలిపి డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేయాలి. మసాజ్ చేయకూడదు. మసాజ్ చేస్తే అది మంట, లేదా కళ్ళవెంబట నీరు కారేలా చేస్తుంది.

ఆముదం, బాదం నూనె :

ఆముదం, బాదం నూనె :

ఆముదం, బాదం నూనె రెండూ కలిపి, మూత టైట్ గా ఉన్న డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. అవసరం అయినప్పుడు కళ్ళ క్రింద చర్మానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక రెండు మూడు నిముషాలు మసాజ్ చేసి వదిలేయాలి.

పురుషుల్లో కళ్లక్రింద నల్లటి వలయాలు: నివారించే చిట్కాలుపురుషుల్లో కళ్లక్రింద నల్లటి వలయాలు: నివారించే చిట్కాలు

ఆముదం, ఫ్రెష్ క్రీమ్ :

ఆముదం, ఫ్రెష్ క్రీమ్ :

ఫ్రెష్ క్రీమ్ లో కొద్దిగా ఆముదం కలిపి డార్క్ సర్కిల్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. క్రీమ్ అంటే పాల మీగడ కూడా తీసుకోవచ్చు.ఒక టీస్పూన్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుని, అందులో 10 చుక్కల ఆముదం కలపాలి. దీన్ని అప్లై చేయడానికి ముందు రెండూ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి.

ఆముదం, పచ్చిపాలు :

ఆముదం, పచ్చిపాలు :

ఆముదం, పచ్చిపాలు రెండూ కలిపి డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేయాలి. నూనెతో పాలు నిలవనప్పుడు, ఈ నూనెలో కాటన్ డిప్ చేసి, కళ్ళ మీద పెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత కాటన్ తీసేసి, చన్నీటితో కడిగేసుకోవాలి. అలాగే టిష్యును కూడా ఆముదం, పాల మిశ్రమంలో డిప్ చేసి కళ్ళ మీద ఉంచుకోవచ్చు.

English summary

How To Use Castor Oil For Dark Circles

If you're counting on home remedies for curing dark circles, then we'd always suggest castor oil. Beauty enthusiasts confirm that omega-3 content of castor oil hydrates the area and antioxidants in the oil help in fluid retention, thereby lessening the dark circles.
Desktop Bottom Promotion