For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందరూ ఉపయోగించడానికి వీలైన..సులభమైన నేచురల్ బ్యూటి టిప్స్..!!

అందంగా కనపించడం కోసం మహిళలకు ఇష్టమైన పని అందంగా అలంకరించుకోవడం సహజం. అయితే వారు వేసుకునే మేకప్ ప్రొడక్ట్స్ కొన్ని సందర్భాల్లో స్కిన్ డ్యామేజ్ చేస్తాయి. అందుకే నేచురల్ పదార్థాలను ఎంపిక చేసుకోవాలి.

|

అందంగా కనపించడం కోసం మహిళలకు ఇష్టమైన పని అందంగా అలంకరించుకోవడం సహజం. అయితే వారు వేసుకునే మేకప్ ప్రొడక్ట్స్ కొన్ని సందర్భాల్లో స్కిన్ డ్యామేజ్ చేస్తాయి.

ఇదిలా ఉంటే కొంత మందికి వారి స్కిన్ ఏటైపో కూడా తెలుసుకోకుండా మేకప్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. వారికి చర్మ తత్వానికి సూట్ అయినా..కాకపోయినా వాడుతుంటారు.

అయితే మార్కెట్లో మనకు లభించే మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కువగా కెమికల్స్, మరియు హానికలిగించే పదార్థాలతో తయారుచేయడం వల్ల స్కిన్ టిష్యల గ్రోత్ ను అడ్డుకుంటుంది. స్కిన్ కు డ్యామేజ్ కలిగిస్తుంది. మేకప్ ప్రొడక్ట్స్ కాకుండా మరి ఇంకే ఉపయోగించాలి అన్నదే కదా మీ సందేహం..?

Natural Ingredients That Can Be Used On All Types Of Skin

అలాంటి వారికోసమే ఒక శుభవార్త చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం అనేక పద్దతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. చర్మంను కాంతివంతంగా మార్చుతాయి. వీటిని అన్ని రకాల చర్మ తత్వం కలవారు ఉపయోగించుకోవచ్చు. ఈ నేచురల్ రెమెడీస్ చర్మానికి చాలా ఉపయోగకరంగా మారుతాయి. మరి అవేంటో..ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం..

 కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె పురాతన కాలం నుండి బ్యూటికోసం కామన్ గా ఉపయోగిస్తున్నారు. ఇది అన్ని రకాల చర్మ తత్వాలకు ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెను చర్మానికి అప్లై చేయడం వల్ల సన్ డ్యామేజ్ ను నివారించడంతో పాటు, స్కిన్ హైడ్రేషన్ ను కలిగిస్తుంది. మొటిమలను నివారిస్తుంది. చర్మంలో మచ్చలను తొలగిస్తుంది. హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. మీ చర్మం నార్మల్ అయినా, డ్రై స్కిన్ అయినా కొబ్బరి నూనె మాత్రం చర్మానికి సురక్షితమైనది మరియు ఆరోగ్యకరమైనది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ ఈ మద్యకాలంలో బాగా పాపులర్ అయ్యింది. ఇందులో బెనిఫిట్స్ కు థ్యాంక్స్ చెప్పాల్సిందే...ఆపిల్ సైడర్ వెనిగర్ ను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. అన్ని రకాల చర్మ తత్వాలకు ఉపయోగించుకోవచ్చు. ఇది ప్యాథోజన్స్, క్రిములను నాశనం చేస్తుంది. దాంతో హెల్తీ స్కిన్ ను పొందవచ్చు. గాయలను మాన్పుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ లో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

తేనె:

తేనె:

తేనెలో వివిధ రకాల విటమిన్స్, ప్రోటీన్స్ ఏంజైమ్స్ మరియు స్కిన్ బూస్టింగ్ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. తేనెను చర్మానికి వివిధ రకాలుగా అప్లై చేసుకోవచ్చు. మొటిమలను నివారిస్తుంది. స్కిన్ మాయిశ్చరైజ్ గా మార్చుతుంది. చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. తేనెను ముఖానికి ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది.

 సీ సాల్ట్ :

సీ సాల్ట్ :

మరో వర్సిటైల్ పదార్థం సీ సాల్ట్ . దీన్ని అన్ని రకాల చర్మ తత్వాలకు ఉపయోగించుకోవచ్చు. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అనేక చర్మ సమస్యలను సులభంగా నివారిస్తుంది. సీసాల్ట్ ను చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మానికి కావా్లసిన హైడ్రేషన్ అందుతుంది. ఇది స్కిన్ లో పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. సీసాల్ట్ కు కొబ్బరి నూనె చేర్చి ఉపయోగించుకోవచ్చు. డైలీ స్కిన్ కేర్ కోసం సీసాల్ట్ స్ర్కబ్ ను ఉపయోగించుకోవచ్చు. హెల్తీ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.

అలోవెర:

అలోవెర:

కలబంద ఇది నేచురల్ పదార్థం, అన్ని రకాల చర్మ తత్వాలకు సహాయపడుతుంది. ఇది అవసరమైనన్ని బ్యూటి బెనిఫిట్స్ ను అందిస్తుంది. అలోవెరలో న్యూట్రీషియన్ అధికంగా ఉండటం వల్ల చర్మానికి చాలా మేలు చేస్తుంది. మొటిమలను, మచ్చలను తొలగిస్తుంది. ఇన్ఫ్లమేషన్ , స్కిన్ రెడ్ నెస్ తగ్గిస్తుంది. ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్నవారు అలోవెరను ఉపయోగించుకోవచ్చు.

దానిమ్మ :

దానిమ్మ :

దానిమ్మలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. దానిమ్మ ఫేస్ మాస్క్ ఖచ్చితంగా చర్మసౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఫ్యాక్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించబడి, కాంతివంతమైన చర్మాన్ని అందిస్తాయి. దానిమ్మ విత్తనాలు 3 టీస్పూన్లు తీసుకుని, అందులో ఉడికించిన ఓట్స్ కొద్దిగా , రెండు స్పూన్ల పాలు మిక్స్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా పేస్ట్ లా తయారయ్యాక ఫేస్ కు ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత ముఖాన్నిచల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటితో

అరటితో

అరటిపండులో ఫైబర్ , యాంటీఆక్సిడెంట్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంను యంగ్ గా మార్చుతుంది. ఫ్రెష్ గా ఉంచుతుంది. చర్మానికి అరటిపండును వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. బాగా పండిన అరటి పండు తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా తేనె, ఫ్రెష్ క్రీమ్ ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ లో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు ఏజింగ్ లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

బొప్పాయి

బొప్పాయి

బొప్పాయి మరియు పెరుగులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు టానిన్స్ చర్మానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. ఇది క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందివ్వడం మాత్రమే కాదు, చర్మంలోని మెటిమలను, మచ్చలను మరియు ఇతర ఏజింగ్ లక్షణాలను తొలగిస్తుంది.బొప్పాయి, పెరుగు ఫేస్ మాస్క్ ను ఉపయోగించడంలో ఇది నేచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. ఈ మాస్క్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Natural Ingredients That Can Be Used On All Types Of Skin

Natural Ingredients That Can Be Used On All Types Of Skin,The natural ingredients, which we have listed in this article, work their best in providing you with a beautiful and healthy skin that would suit all skin types.
Story first published: Tuesday, May 9, 2017, 13:29 [IST]
Desktop Bottom Promotion