For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్ లో పింపుల్స్, డార్క్ స్పాట్స్ నివారించే కొత్తిమీర ఫేస్ ప్యాక్ ...!!

చర్మ సమస్యలనగానే ముందుగా మొటిమలు, మచ్చలు గుర్తొస్తాయి. ఎందుకంటే చాలా మంది ఈ సమస్యలతోనే బాధపడుతుంటారు.వీటి వల్ల చర్మంలో డార్క్ స్పాట్స్ ఏర్పడుతాయి. డార్క్ స్పాట్స్ ను నివారించుకోవడానికి కొత్తిమీరప్యాక్

By Lekhaka
|

చర్మ సమస్యలనగానే ముందుగా మొటిమలు, మచ్చలు గుర్తొస్తాయి. ఎందుకంటే చాలా మంది ఈ సమస్యలతోనే బాధపడుతుంటారు. వీటి వల్ల చర్మంలో డార్క్ స్పాట్స్ ఏర్పడుతాయి. అందుకే డార్క్ స్పాట్స్ ను నివారించుకోవడానికి మనందరికీ ఫేస్ మాస్క్ ల అవసరం ఉంటుంది.ఫేస్ మాస్క్ లను వివిధ రకాలుగా ఉపయోగించి ఉంటాము. కొత్తిమీర ఫేస్ మాస్క్ గురించి మీకు తెలుసా?

కొత్తిమీరాః? నల్లమచ్చలను తొలగిస్తుందా..? వినడానికి కొంచె ఆశ్చర్యం కలిగినా, అక్షరాల ఇది నిజం అంటున్నారు బ్యూటిషియన్స్ . మన ఇంట్లో ఉండే ఈ నేచురల్ హెర్బ్స్ లో చర్మానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా, ఫ్రెష్ గా కనబడుతుంది.

Parsley Leaves Face Mask Recipe To Remove Dark Spots From Skin!

చర్మం ఆరోగ్యానికి విటమిన్ సి ముఖ్య పాత్రను పోషిస్తుంది, అటువంటి విటమిన్ సి ఫుడ్స్ లో కొత్తిమరీ ఒకటి. కొత్తిమీరలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది డ్యామేజ్ స్కిన్ ను రిపేర్ చేస్తుంది. కొత్తకణాల ఉత్పత్తిని ప్రోత్సమిస్తుంది.

కొత్తిమీరలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది విటమిన్ ఎగా మార్పు చెందుతుంది. ఈ విటమిన్ ఎ స్కిన్ ఎలాసిటిని మెరుగుపరిచి, ముడుతలను మాయం చేస్తుంది.

ఇంకా, కొత్తిమీరలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది చర్మ రంద్రాలను మరియు ముడతలను మాయం చేస్తుంది. అలాగే యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మంలో డార్క్ స్పాట్స్ ఇతర మచ్చలను తొలగిస్తుంది. ఇలా చెప్పకుంటూ పోతే, కొత్తమీరలో అనేక అద్భుతమైన బెనిఫిట్స్ దాగున్నాయి. అయితే ఇది చర్మంలోని డార్క్ స్పాట్స్ (నల్ల మచ్చల)ను ఎలా తొలగిస్తుందో తెలుసుకుందాం..

స్టెప్ : 1

స్టెప్ : 1

మొదటగా ఒక కట్ట కొత్తిమీర తీసుకుని, కట్ చేసి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు నీళ్ళను వేడి చేసి, ఆ నీటిలో కొత్తిమీర కూడా వేసి 15 నిముషాలు ఉడికించి , స్టౌ ఆఫ్ చేసి, చల్లార్చి వడగట్టి పక్కన పెట్టుకోవాలి.

స్టెఫ్ : 2

స్టెఫ్ : 2

ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను జోడించాలి. యాపిల్ సైడర్ వెనిగర్ డెడ్ స్కిన్ లేయర్స్ ను తొలగిస్తుంది. చర్మంలో మలినాలిను తొలగించి చర్మ రంగును మార్చుతుంది. ఈ వాటర్ ను గాలి చొరబడని డబ్బాలో పోసిన నిల్వచేసుకోవాలి.

స్టెప్ : 3

స్టెప్ : 3

ఈ ద్రవాన్ని ఉపయోగించడానికి ముందు, ముఖం శుభ్రంగా కడిగి, చల్లటి పాలలో కాటన్ బాల్ ను డిప్ చేయాలి. ఎక్సెస్ మిల్క్ ను పిండేసి, కాటన్ తో ముఖం మొత్తం తుడవాలి. మెడకూడా తుడవాలి. చర్మం నుండి మురికి , డస్ట్ కాటన్ కు అంటుకోవడం మీరు గమనిస్తారు.

స్టెప్ : 4

స్టెప్ : 4

తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత సాప్ట్ టవల్ తో ముఖం తేమ లేకుండా తుడవాలి. కొద్దిగా తడిగా ఉంచితే చాలు, మాస్క్ త్వరగా గ్రహిస్తుంది.

స్టెప్ : 5

స్టెప్ : 5

ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, కొత్తిమీర వాటర్ వేసి రెండూ బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి, తర్వాత దీన్ని ముఖం, మెడకు పూర్తిగా అప్లై చేయాలి.

స్టెప్ : 6

స్టెప్ : 6

కొత్తిమీర ఫేస్ మాస్క్ ను వేసుకున్న అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముకం శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో మరోసారి శుభ్రం చేసుకోవాలి.

స్టెప్ :7

స్టెప్ :7

ఇప్పుడు మరో కాటన్ ప్యాడ్ తీసుకుని, కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి, ముఖానికి మర్దన చేయాలి. రోజ్ వాటర్ స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది.

స్టెప్ :8

స్టెప్ :8

తర్వాత లైట్ మాయిశ్చరైూజన్ ను ముఖానికి అప్లైచేి మసాజ్ చేయాలి. 10నిముషాలు సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపుడుతుంది. చర్మంలో గ్లో వస్తుంది.

English summary

Parsley Leaves Face Mask Recipe To Remove Dark Spots From Skin!

Clear your face from dark spots with this parsley leaves face mask!We are never without skin problems. If it is a pimple this time, it is blackheads the other! While most of these problems fade with time, they all leave tell-trail marks - dark spots! That's why we need face masks to remove dark spots, for example this parsley leaves face mask!
Desktop Bottom Promotion