Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
ముడుతలను నివారించుకోవడానికి ఈ ముఖ్యమైన నూనెలు అప్లై చేయండి
వయస్సైందని ఎలా కనుగొంటారు, శరీరంలో ఏదో ఒక మార్పు కనిపిస్తుంది కాదా? ముఖ్యంగా వయస్సైన లక్షణాల్లో మొదట కనిపించేది ముడుతలు . చర్మం వదులైనట్లు కనబడుట, ముడుతలు. ముడతల వల్ల వయస్సైన వారిలా కనబడుట మాత్రమే కాదు, కళ్ళు లోతుగా కనబడుట, కళ్ళ చుట్టూ ముడుతలు ఏర్పడుతాయి.
ముడుతలను నివారించుకోవడం కోసం ఎన్ని రకాల కాస్మోటిక్స్ ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉంటుంది. అందువల్ల వీటికి బదులుగా కొన్ని న్యాచురల్ రెమెడీస్ ను ఇన్ స్టాంట్ గా అందుబాటులో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు.
చర్మంలో ముఖ్యంగా కళ్ళ చుట్టూ ముడుతలను నివారించడానికి కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ సహాయపడుతాయి. ఈ నూనెలో కళ్ళ చుట్టూ ఉపయోగించే వివిధ రకాల క్రీమ్స్ లో కూడా వాడి ఉంటారు.
ఈ రోజు బోల్డ్ స్కై మీకోసం కొన్ని ప్రత్యేకమైన నూనెలు పరిచయం చేస్తున్నది. ఇవి కళ్ళ చుట్టు అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ గా ముడుతలను నివారిస్తుంది. అయితే వీటిని ఎలా ఉపయోగించాలి అన్న విషయం తెలుసుకోవాలి.
ఈ నూనెల్లో ఏజ్ డిఫైనింగ్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి కళ్ళ చుట్టూ ఉన్న ముడుతలను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. కళ్ళ చుట్టూ ఉన్న చర్మం యంగ్ గా యూత్ ఫుల్ గా కనబడేలా చేస్తుంది. అలాంటి ఎఫెక్టివ్ ఎన్షియన్స్ ఆయిల్స్ లో సాండిల్ వుడ్ నూనె, జర్మేనియం ఆయిల్ వంటి ప్రత్యేకమైన నూనెలు ఉపయోగపడుతాయి.
స్కిన్ ఫ్రెండ్లీ ఆయిల్స్ మరియు న్యాచురల్ పదార్థాల మిశ్రమంతో కంటికి ఉపయోగిస్తే చర్మంలో ముడుతలు ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి. మరి ఎసెన్షియల్ ఆయిల్ మరియు న్యాచురల్ పదార్థాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం...
గమనిక: వీటిలో ఏ రెమెడీ ఉపయోగించాలాన్నా ముందుగా స్కిన్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

1. ఫ్రాంకిన్సెస్ ఎసెన్షియల్ ఆయిల్
ఎలా ఉపయోగించాలి:
- కొబ్బరి నూనె 4-5 చుక్కల తో ఫ్రాంకిన్సెస్ ఆయిల్ 1 డ్రాప్ మిక్స్ చేయాలి.
- రెండూ బాగా మిక్స్ చేసి, ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయాలి
- ఇది 5-10 నిమిషాలు అలాగే ఉంచాలి స్థిరపడటానికి అనుమతించు.
- తర్వాత తడి గుడ్డతో తుడిచేయాలి.
- మంచి ఫలితాలు కోసం ఒక వారం తర్వాత అదే ప్రక్రియ తిరిగి ప్రయత్నించండి.

2. శాండల్‌వుడ్ ఎసెన్షియల్ ఆయిల్
ఎలా ఉపయోగించాలి:
- ½ టీస్పూన్ ఆలివ్ నూనె తో శాండల్‌వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ 2 చుక్కలు వేసి బాగా కలపాలి.
- ఈ నూనె మిశ్రమాన్నివేలికొనలతో ముడుతలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.
- ఈ నూనె చర్మంలో 5-10 నిమిషాలు అలాగా ఉంచాలి.
- 10 నిముషాల తర్వాత జాగ్రత్తగా గోరువెచ్చని నీటితో కడగాలి.
- మంచి ఫలితాల కోసం దీనిని వారానికి ఒకసారి ప్రయత్నించండి.

3. జరేనియం ఎసెన్షియల్ ఆయిల్
ఎలా ఉపయోగించాలి:
- మీ స్కిన్ మాయిశ్చరైజర్ తో జరేనియం ఎసెన్షియల్ ఆయిల్ ను 2 చుక్కలు కలపాలి.
- ఈ నూనె మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయాలి.
- ఇది 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత, తడి తడిగుడ్డతో తుడిచివేయండి.
- మీ కళ్ళ చుట్టూ ముడుతలను నివారించడానికి వారం రెండు మూడు సార్లు ప్రయత్నించవచ్చు.

4. మిర్హ్ ఎసెన్షియల్ ఆయిల్
ఎలా ఉపయోగించాలి:
- అర చెంచా తేనెలో రెండు చుక్కల మిర్హ్ ఎసెన్సియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి.
- ప్రభావిత ప్రాంతాల్లో మిశ్రమంను నిధానంగా అప్లై చేయాలి
- ఈ నూనెను చర్మం మీద కొన్ని నిమిషాలు తడి ఆరనివ్వండి
- వెచ్చని నీటితో శుభ్రపరచండి.
- మంచి ఫలితాలను పొందడానికి వారానికొకసారి ప్రయత్నించి చూడండి.

5. క్లారీ సేజ్ ఎస్సెన్షియల్ ఆయిల్
ఎలా ఉపయోగించాలి:
- ఫ్లాక్స్ సీడ్ ఆయిల్లో క్లారీ సేజ్ ఎస్సెన్షియల్ ఆయిల్ ను 3-4 చుక్కలను కలపాలి. బాగా మిక్స్ చేయాలి.
- ఈ మిశ్రమం నూనెను చర్మం ముడతల మీద అప్లై చేయాలి.
- 5 నిమిషాలు అలాగే ఉంచాలి
- జాగ్రత్తగా గోరువెచ్చని నీటితో కడగాలి
- మంచి ఫలితాలను పొందడానికి ఒక వారం తర్వాత అదే విధానాన్ని ఉపయోగించండి.

6. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్
ఎలా ఉపయోగించాలి:
- ½ టీస్పూన్ ఐక్రీమ్ లో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.
- ముడుతలతో ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతంలో ఈ మిశ్రమం అప్లై చేయాలి
- 10 నిమిషాలు అక్కడ వదిలివేయండి.
- తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి
- మళ్లీ 2 వారాల తర్వాత, ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితం పొందుతారు.

7. రోజ్మేరీ ఎస్సెన్షియల్ ఆయిల్
ఎలా ఉపయోగించాలి:
- పైన సూచించిన రోజ్మెరీ ఎస్సెన్షియల్ ఆయిల్ కు 4-5 చుక్కల బాదం నూనెను కలపాలి
- రెండూ బాగా కలిసే వరకూ కలిపి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి
- 5-10 నిమిషాలు అలాగే ఉంచితే కొన్ని అద్భుతాలను చేస్తాయి.
- 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- మళ్ళీ ఒక వారం తర్వాత, మంచి ఫలితం కోసం అదే ప్రక్రియ పునరావృతం చేయండి

8. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్
ఎలా ఉపయోగించాలి:
- పైన సూచించిన లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ 3చుక్కలు, ½ టీస్పూన్ పెరుగు మరియు కొబ్బరి నూనె 3 వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి ఉంచాలి
- ఇది 10 నిమిషాలు డ్రైగా మారే వరకూ అలాగే ఉండనివ్వండి.
- చల్లని నీటితో శుభ్రం చేయండి
- గొప్ప ఫలితాలు సాధించడానికి ప్రతివారం ఈ మిశ్రమాన్ని వర్తించండి.

9. అవోకాడో ఎసెన్షియల్ నూనెలు
ఎలా ఉపయోగించాలి:
- కలబంద ½ టీస్పూన్ కలబంద రసంలో రెండు మూడు చుక్కల అవొకాడో ఆయిల్ కలపాలి.
- జాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయాలి.
- 10 నిమిషాలు అలాగే ఉంచాలి
- 10 నిముసాల తర్వాత వెచ్చని నీటిలో ఒక తడిగుడ్డను ముంచి, తుడవాలి
- మళ్ళీ ఒక వారం తర్వాత, మంచి ఫలితం కోసం అదే ప్రక్రియ ప్రయత్నించండి.

10. నెరోలీ ఎసెన్షియల్ ఆయిల్
ఎలా ఉపయోగించాలి:
- అవెకాడో పేస్ట్ 2 టీస్పూన్లు తీసుకుని అందులో నెరోలీ ఎసెన్షియల్ ఆయిల్ 2-3 చుక్కల కలపాలి.
- ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయాలి
- మరొక 10 నిమిషాలు అలాగే ఉంచాలి.
- తడి తడిగుడ్డతో తుడవాలి.
- ఈ మిశ్రమం యొక్క చిట్కాను వారానికొకసారి అనుసరిస్తుంటే మంచి ఫలితం పొందుతారు



Click it and Unblock the Notifications
