For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సౌందర్యాన్ని పెంచే రెడ్ వైన్ ఫేస్ మాస్క్, రెడ్ వైన్ బెనిఫిట్స్!

By Mallikarjuna
|

మీరెప్పుడైనా రెడ్ వైన్ ఫేస్ ప్యాక్ గురించి విన్నారా? వినుంటే, ఆలస్యం చేయకుండా ఈ రెడ్ వైన్ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి.రెడ్డిష్, పర్పల్ కలర్ లో ఉండే.. రెడ్ వైన్ హెల్తీ డ్రింక్ అని నిరూపించబడింది. పూర్వకాలంలో రెడ్ వైన్ ను ఔషధాల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. రాస్బెర్రీస్, గూజ్ బెర్రీస్, ఎండుద్రాక్ష వంటి ఫ్లేవర్స్ లో వివిధ రకాల ఫ్లేవర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మార్కెట్లో దొరుకుతాయి.

రెడ్ వైన్ ఫేస్ ప్యాక్ వాడటం మొదటి సారి అయితే, ఈ ఫేస్ ప్యాక్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. త్వరగా తయారుచేసుకోవచ్చు. రెడ్ వైన్ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ముందు అందులోని ప్రయోజనాల గురించి తెలుసుకోవాలి. రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు, కానీ ఇది అందాన్ని కూడా పెంచుతుంది. రెడ్ వైన్ లో ఉండే పోషకాలే చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయని స్టడీస్ చెబుతున్నాయి.

చర్మ సౌందర్యాన్ని పెంచే రెడ్ వైన్ ఫేస్ మాస్క్, రెడ్ వైన్ బెనిఫిట్స్!

రెడ్ వైన్ కు వంటింట్లోని పదార్థాలను కూడా కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఉదాహరణకు పెరుగు, తేనె. ఇవి మన వంటింట్లో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. రెడ్ వైన్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వ్రుద్దాప్యంను, నిర్జీవమైన చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మానికి సహజమైన కాంతిని అందిస్తుంది.

ఒక్క గ్లాసు రెడ్ వైన్ తో మెండైన ఆరోగ్య ప్రయోజనాలు...ఒక్క గ్లాసు రెడ్ వైన్ తో మెండైన ఆరోగ్య ప్రయోజనాలు...

రెడ్ వైన్ ఫేస్ ప్యాక్ ను వారంలో ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు, శుభకార్యాలకు కూడా వేసుకోవచ్చు. పగటి పూటవేసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

రెడ్ వైన్ ముఖానికి మాత్రమే కాదు, శరీర భాగాలకు కూడా ప్యాక్ వేసుకోవచ్చు. రెడ్ వైన్ ఫేస్ ప్యాక్ లో ఉండే థెరఫిటిక్ గుణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది.

చర్మ సౌందర్యాన్ని పెంచే రెడ్ వైన్ ఫేస్ మాస్క్, రెడ్ వైన్ బెనిఫిట్స్!

రెడ్ వైన్ చర్మానికి పూత పూయడం వల్ల చర్మం రంద్రాలను శుభ్రం చేస్తుంది. చర్మంలో జిడ్డును తొలగిస్తుంది, మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న రెడ్ వైన్ తో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.

రోజూ రాత్రి ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు...రోజూ రాత్రి ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు...

రెడ్ వైన్- 1 కప్పు

తేనె - 2టేబుల్ స్పూన్లు

పెరుగు - 1/2కప్పు

గ్లాస్ బౌల్ - 1

ఎగ్ బీటర్ - 1 (గుడ్డు అవసరం లేదు)

చర్మ సౌందర్యాన్ని పెంచే రెడ్ వైన్ ఫేస్ మాస్క్, రెడ్ వైన్ బెనిఫిట్స్!

ఒక గాజు గ్లాసులో పెరుగు వేసి, ఎగ్ బీటర్ తో బాగా చిలకాలి. పెరుగు నురుగ్గా వచ్చిన తర్వాత, అందులో తేనె , రెడ్ వైన్ వేసి కలపాలి. పింక్ కలర్ ఫేస్ ప్యాక్ తయారైన తర్వాత బ్రష్ తోటి ఫేస్ కు ప్యాక్ వేసుకోవాలి. 20-30 నిముషాల తర్వాత పూర్తిగా ఎండిపోయినట్లు అనిపిస్తే చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. తర్వాత టోనర్ లేదా మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.. రెడ్ వైన్ ఫేస్ ప్యాక్ మిగిలితే ఫ్రిజ్ లో పెట్టి మరో సారి వాడుకోవచ్చు.

English summary

Red Wine Face Mask, Red Wine Based Face Mask, Red Wine Benefits in Telugu

Here is a recipe of a red wine based face mask that can be prepared at home with easily available ingredients that have long-lasting benefits on your skin.
Desktop Bottom Promotion