హోలీ: రంగులతో చర్మ పాడవకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు

Posted By:
Subscribe to Boldsky

భారత దేశంలోని పండుగలలో దీపావళి రోజున దీపాలు,హోలీ రోజున రంగులతో ఉల్లాసంగా గడుపుతారు. దేశ వ్యాప్తంగా ఈ పండుగను ఒక అద్భుతమైన అనుభూతితో జరుపుకుంటారు.

దేశంలో ప్రతి రాష్ట్రానికి హోలీ పండుగ ఆచారాల్లో తేడాలు ఉంటాయి. కానీ సందర్భం మాత్రం ఒకటే. ఎవరైనా సరే ఈ పండుగ రోజున రంగులను ఉపయోగించవలసిందే. ఈ పండుగ రోజు ఆత్మీయులకు రంగులను పూస్తారు.

సాదారణంగా హోలీ రోజున ప్రజలు రంగులను పొడి మరియు ద్రవాల రూపంలో ఉపయోగిస్తారు. అయితే ఈ రంగులను చర్మం నుండి వదిలించుకోవటం చాలా కష్టం.

Skin Care Tips Before Holi Celebration

ముఖ్యంగా పొడి చర్మం వారికీ ఈ రంగుల కారణంగా చర్మం చికాకు, ఎరుపు, దురద మరియు అనేక ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖం మీద హోలీ రంగులను వదిలించుకోవటానికి కొన్ని సహజ మార్గాలను తెలుసుకుందాం. ఈ మార్గాల ద్వారా ముఖం మీద రంగులను సమర్ధవంతంగా తొలగించుకోవచ్చు.హోలి సందర్భంగా చర్మంను రక్షించుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను దూరం చేస్తాయి.

హోలీ సెలబ్రేషన్స్ కు తయారవ్వడానికి ముందుగా మీరు తీసుకోవల్సిన కొన్ని చర్మ సంరక్షణ జాగ్రత్తలు ఈ క్రింది విధంగా..

శరీరం మొత్తం కవర్ అయ్యేటట్లు ఉండే దుస్తులు ధరించాలి:

శరీరం మొత్తం కవర్ అయ్యేటట్లు ఉండే దుస్తులు ధరించాలి:

సాధ్యమైనంత వరకూ ఆ రోజున బాడీ మొత్తం కవర్ అయ్యేటట్లు ఉండే దుస్తులను ధరించాలి. చైనీస్ నెక్ లైన్ ఉన్నటువంటి లేదా 3 క్వాటర్ స్లీవ్స్ ఉన్న దుస్తులు ధరించాలి.

కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలి:

కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలి:

హోలీ సెలబ్రెషన్స్ చర్మం పాడవకుండా చర్మానికి కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలి. హోలీ కలర్ చర్మం మరింత డ్రైగా మరియు రఫ్ గా మారేట్లు చేస్తుంది. అందువల్ల చర్మం మొత్తానికి కొబ్బరి నూనెను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం జారుడు స్వభావం కలిగి కలర్స్ చర్మానికి అంటుకోకుండా ఉంటుంది.

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ:

కొబ్బరి నూనెను లేదా మస్టర్డ్ ఆయిల్ ను ఇష్టపడని వారు, బాడీ మొత్తానికి పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి కలర్స్ అంటుకోకుండా ఉంటాయి, ఇంకా ఆలివ్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు.

సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి:

సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి:

ఎస్ ఎఫ్ ఫి 15 కలిగిన సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి. ఎండకు స్కిన్ టాన్ అవ్వడం మాత్రమే కాదు, చర్మంను హోలీ కలర్స్ డ్రైగా మార్చుతాయి కాబట్టి, అలా జరగకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేసుకోవాలి.

లిప్ జెల్ లేదా లిప్ బామ్ :

లిప్ జెల్ లేదా లిప్ బామ్ :

హోలీ ఆడేటప్పుడు శరీరం మొత్తం కలర్స్ అంటుకోవడం పెదాల పగుళ్ళు, బ్లీడింగ్ సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి, ఈ రంగులు పెదాల మీద ప్రభావం చూపకూడదనుకుంటే, నేచురల్ మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

స్కిన్ హైడ్రేషన్ :

స్కిన్ హైడ్రేషన్ :

చర్మం హైడ్రేషన్ లో ఉండాలంటే , హోలీ రోజున ఎండలో ఆరుబయట ఎక్కువ ఆడుతుంటారు కాబట్టి, శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరం ఎనర్జింటిక్ గా ఉంచుకోవడానికి గ్లూకోజ్ ను ఎక్కువగా తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం తేమగా మరియు హైడ్రేషన్ లో ఉంటుంది.

వాజిలైన్ అప్లై చేయాలి:

వాజిలైన్ అప్లై చేయాలి:

కళ్ళ చుట్టు, బొడ్డు చుట్టు, చెవుల వెనుక బాగం, వంటి ప్రదేశాల్లో వాజిలైన్ ను అప్లై చేయాలి. ఈ ప్రదేశాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి, రంగులను తొలగించుకోవడం కష్టం అవుతుంది. అందుకని వాజిలైన్ అప్లై చేయడం వల్ల కాటన్ తో తుడిచేస్తే సులభంగా తొలగిపోతుంది కాబట్టి, సులభంగా వాజిలైన్ అప్లై చేసుకోవాలి.

English summary

Skin Care Tips Before Holi Celebration

The countdown for Holi has begun. Holi is a unique festival of this country, where people play with colours and those colours are the symbols of love, affection, friendship and blessing. Each and every corner of India celebrates Holi differently.
Story first published: Saturday, March 11, 2017, 14:36 [IST]
Subscribe Newsletter