For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారిలో ఆయిల్ స్కిన్ వల్ల మొటిమలు మచ్చలు నివారించే స్కిన్ కేర్ టిప్స్

ఆయిల్ స్కిన్ సమస్య కేవలం ఆడవారికి మాత్రమే కాదు, మగవారికి కూడా ఉంది, అయితే వారిలో కొంచెం తక్కువగా ఉంటుంది. కొంత మంది పురుషుల్లో డార్క్ స్కిన్ సమస్య, కొంత మందికి డ్రై స్కిన్, మరికొందరి ఆయిల్ స్కిన్.

By Mallikarjuna
|

ఆయిల్ స్కిన్ సమస్య కేవలం ఆడవారికి మాత్రమే కాదు, మగవారికి కూడా ఉంది, అయితే వారిలో కొంచెం తక్కువగా ఉంటుంది. కొంత మంది పురుషుల్లో డార్క్ స్కిన్ సమస్య, కొంత మందికి డ్రై స్కిన్, మరికొందరి ఆయిల్ స్కిన్ కలిగి ఉంటారు.

పురుషుల్లో ఆయిల్ స్కిన్ ఒక్కటే సమస్య కాదు, వారి చర్మంలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ కారంగా చర్మంలో మొటిమలు, మచ్చలు ఇతర సమస్యలకు దారితీస్తుంది. వీటి కోసం సలూన్స్ కు వెళ్ళడం లేదా ఇతర స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తుంటారు.

అయితే పురుషులు కూడా ఇంట్లో కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి ఆయిల్ స్కిన్ ను సమస్యను నివారించుకోవచ్చు. అయితే అందుకోసం మగవారు కొంత సమయం గడపాల్సి ఉంటుంది.

Skincare Tips For Men With Oily Skin Problems Like Pimple & Acne,

ఆయిల్ స్కిన్ ఉన్న మగవారు ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల తప్పకుండా ఉపయోగపడుతాయి. అయితే వాటిని సరైన పరిమాణంలో ఎంపికచేసుకోవాలి. ఆయిల్ స్కిన్ తో పాటు ఇతర చర్మ సమస్యలను కూడా నివారించడంలో మరి ఈ హోం మేడ్ రెమెడీస్ ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం..

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ I : టోనర్

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ I : టోనర్

చర్మంలో అదనంగా నూనె స్రవించడం వల్ల చర్మం జిడ్డుగా కనబడుతుంది. అందుకోసం వాటర్ బేస్డ్ టోనర్స్ ను ఉపయోగించాలి. దీన్ని రోజులో రెండుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో స్వయంగా టోనర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

a) జిడ్డు గల చర్మం ఉన్న పురుషుల కోసం ఇంట్లో తయారు చేసే టోనర్ కోసం రెండు పదార్ధాల అవసరం అవుతాయి అవి - ఆపిల్ సైడర్ వెనీగర్ మరియు డిస్టిల్డ్ వాటర్ .

b) వీటిలో నీరు, యాపిల్ సైడర్ వెనిగర్ 1: 3 గా ఉండాలి.

c) ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి పగలు బయట వెళ్ళడానికి కాటన్ తో చర్మానికి అప్లై చేయాలి. అలాగే రాత్రి నిద్రించడానికి ముందు కూడా అప్లై చేయాలి.

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ II: టోనర్ 2

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ II: టోనర్ 2

ఆయిల్ స్కిన్ ఉన్నవారు, మరో ఎంపిక , కొద్దిగా కష్టమైనా, ఖచ్చితంగా ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

a) ఈ టోనర్ తయారీకి కావల్సినవి పచ్చి పాలు మరియు లావెండర్ నూనె.

బి) ఒక టేబుల్ స్పూన్ పచ్చి చల్లని పాలులో లావెండర్ నూనె ఐదు చుక్కలు కలపాలి.

c) ఒక కాటన్ ప్యాడ్ ను ఈ మిశ్రమంలో డిప్ చేసి, చర్మానికి అప్లై చేయాలి. న్యాచురల్ గా డ్రైగా మారిన తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ III : బ్లాట్టింగ్ పేపర్స్

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ III : బ్లాట్టింగ్ పేపర్స్

జిడ్డు చర్మతత్వం కలవారు హ్యాండ్ కర్చీఫ్ ను ఉపయోగించకూడదు, హ్యాండ్ కర్ఛీఫ్ రఫ్ గా ఉండటం వల్ల చర్మం మీద ఒత్తిడికి గురిచేసి, చర్మ రంద్రాలు తెరచుకుంటాయి. అది మరింత ఎక్కువ నూనెను ఉత్పత్తి చేసి, చర్మం మరింత జిడ్డుగా మార్చుతుంది. కర్చీఫ్ కు బదులుగా బ్లాట్టింగ్ పేపర్ ను ఉపయోగించడం ఉత్తమం.బ్లాట్టింగ్ పేపర్స్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ జిడ్డుగా అనిపించినప్పుడు ఈపేపర్ తో చర్మంను శుభ్రం చేసుకుంటే కొద్దిగా రిలాక్స్ గా ఫీలవుతారు. బ్లాట్టింగ్ పేపర్స్ క్యారీ చేయడం కూడా సులభమే.

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ IV : ఫేస్ ప్యాక్

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ IV : ఫేస్ ప్యాక్

స్కిన్ ట్రీట్మెంట్ కోసం ఏ ఒక్క మగాడు, ఎక్కువ సమయం గడపడు., అదీ ఇంట్లో అస్సలు గడపరు. కాబట్టి, ఒక సులభమైన త్వరగా రిఫ్లెక్ట్ అయ్యే ఒక హోం రెమెడీ ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ చర్మంలో రంద్రాలను మూసేస్తుంది. .జిడ్డును తొలగిస్తుంది.

a) ఈ ఫేస్ ప్యాక్ తయారుచేయాడానికి రోజ్ వాటర్ , బెంటోనైంట్ క్లే అవసరం అవుతుంది.

b) బెంటోనైట్ మంటిలో ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి.

c) ఈ రెండూ బాగా కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. స్నానానికి ముందు ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకోవాలి.

d) 15 నిమిషాల తరువాత వాష్ చేసుకోవాలి.

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ V: స్కిన్ స్క్రబ్

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ V: స్కిన్ స్క్రబ్

ఆయిల్ స్కిన్ ఉన్నవారు , వారంలో రెండు సార్లు స్కిన్ స్ర్కబ్ చేసుకోవడం వల్ల చర్మం రిఫ్రెష్ అవుతుంది. ఈ రిసిపి తయారుచేసుకోవడానికి కావల్సినవి..

a) పెరుగు, ఓట్ మీల్ పౌడర్, అలోవెరజెల్ తీసుకోవాలి.

b) పెరుగును వడగట్టి పక్కన పెట్టుకోవాలి.

c) ఒక టీస్పూన్ గట్టి పెరుగులో పెరుగులో ఒక స్పూన్ ఓట్ మీల్ పౌడర్, ఒక టీస్పూన్ అలోవెర జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి. స్ర్కబ్ రెడీ.

d) స్నానానికి వెళ్లడానికి ముందు ముఖం మరియు శరీరం మొత్తానికి అప్లై చేసి, స్ర్కబ్ చేయాలి. 15 నిముషాల తర్వాత స్నానం చేయాలి.

ఇ) దీనిని ఒక వారంలో రెండుసార్లు ఉపయోగించవచ్చు.

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ VI: ఫేస్ మాస్క్

జిడ్డుగల చర్మం గల మగవారికి కోసం హోం రెమిడీ VI: ఫేస్ మాస్క్

ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ రిసిపి గ్రేట్ గా పనిచేస్తుంది.

a) ఆయిల్ స్కిన్ తొలగించుకోవడానికి ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవడానికి కావల్సినవి గుడ్డు .

b) గుడ్డులోని తెల్ల సొనను నురుగు వచ్చేలా బాగా మిక్స్ చేయాలి. తర్వాత .

c) ఆయిల్ స్కిన్ కు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

d) మీరు వాసన నివారించడానికి ప్రత్యామ్నాయంగా లావెండర్ నూనెను జోడించవచ్చు.

English summary

Skincare Tips For Men With Oily Skin Problems Like Pimple & Acne

Here is a list of home remedies that men with oily skin can count on to battle their skin problems and get an assured relief from acne, scar, whitehead, blackheads or pimples on the skin. Read and do try these at home, dear men.
Desktop Bottom Promotion