For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంను కాంతివంతంగా మెరిపించే స్ట్రాబెర్రీస్..!!

పండ్లులో అత్యంత రుచికరమైన, రసాలను వడ్డించే జ్యూసీ ఫ్రూట్ స్ట్రాబెర్రీ. ఈ టేస్టీ కలర్ ఫుల్ ఫ్రూట్ పిల్లలతో పాటు పెద్దలకు కూడా నోరూరిస్తుంది. స్ట్రాబెర్రీ టేస్ట్ మాత్రమే కాదు, చర్మ మరియు జుట్టు ఆరోగ్యాన

By Lekhaka
|

పండ్లులో అత్యంత రుచికరమైన, రసాలను వడ్డించే జ్యూసీ ఫ్రూట్ స్ట్రాబెర్రీ. ఈ టేస్టీ కలర్ ఫుల్ ఫ్రూట్ పిల్లలతో పాటు పెద్దలకు కూడా నోరూరిస్తుంది. స్ట్రాబెర్రీ టేస్ట్ మాత్రమే కాదు, చర్మ మరియు జుట్టు ఆరోగ్యానికి ..అందానికి అద్భుతంగా సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలోని అద్భుతమైన బ్యూటి బెనిఫిట్స్ ను ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది.

This Is What Happens When You Apply Strawberry On Skin!

స్ట్రాబెర్రీస్ 600 రకాలకు పైగా ఉన్నాయి. వాటిలో వేటికవే ఒక్కొక్కటి ఒక్కో విధమైన రుచి, రంగు, ఆకారం, సైజ్ కలిగి ఉంటాయి. వీటిని స్కిన్ బ్యూటీకి ఉపయోగించడం నిజంగా ప్రయోజనకరమైనవి.

స్ట్రాబెర్రీస్ లోని కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ ను ఈ క్రింది విదంగా తెలపడం జరిగింది..

1.ఇది ముఖంలో ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది:

1.ఇది ముఖంలో ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది:

బెర్రీస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది. శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది. స్కిన్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్ లో ఉండే లికోపిన్ ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. ఫైన్ లైన్స్, ముడుతలను నివారిస్తుంది. అందుకు చేయాల్సిందల్లా కొన్ని స్ట్రాబెర్రీస్ తీసుకుని మొత్తగా చేయాలి. అందులో ఒక స్పూన్ తేనె మిక్స్ చేయాలి. అందులోనే పాల క్రీమ్ కూడా జోడించి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హెర్బల్ స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్ చర్మఆరోగ్యాన్ని మెరుగుపరిచే అందంగా మార్చుతుంది.

2. స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపరుస్తుంది:

2. స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపరుస్తుంది:

స్ట్రాబెర్రీస్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం రంగులో అద్బుత మార్పు తీసుకొస్తుంది. డల్ గా , డ్రైగా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతంగా, కాంతివంతంగా మార్చుతుంది. స్ట్రాబెర్రీస్ లో ఉండే ఎలా్జిక్ లక్షణాలు చర్మంలో డార్క్ స్పాట్స్, లైన్స్ ను తొలగిస్తుంది. స్ట్రాబెర్రీస్ తీసుకుని జ్యూస్ తియ్యాలి. ఈ జ్యూస్ ను ముఖం, మెడ మొత్తానికి అప్లై చేసి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

3. మొటిమలను నివారిస్తుంది:

3. మొటిమలను నివారిస్తుంది:

చర్మంలో ఎక్కువ మొటిమలు బాధిస్తుంటే, స్ట్రాబెర్రీస్ బెస్ట్ ట్రీట్మెంట్ . స్ట్రాబెర్రీస్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంలో , శరీరంలో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మొటిమలు, మచ్చలు కనబడకుండా తొలగిస్తుంది. స్ట్రాబెర్రీస్ తీసుకుని, పెరుగుతో మిక్స్ చేసి, బ్లెండ్ చేయాలి. రెండూ పేస్ట్ లా తయారైన తర్వాత ముఖానికి అప్లై చేసి, ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

4. స్కిన్ ఎక్సఫ్లోయేషన్ :

4. స్కిన్ ఎక్సఫ్లోయేషన్ :

స్ట్రాబెర్రీస్ పండ్లు మాత్రమే కాదు, విత్తనాలు కూడా అద్భుతమైన ఎక్స్ ఫోయేటర్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, సాలిసిలక్ యాసిడ్ కంటెంట్ డెడ్ స్కిన్ సెల్స్ , సెబమ్ చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. కొన్ని స్ట్రాబెర్రీస్ తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, పంచదార మిక్స్ చేయాలి. వీటిని మొత్తగా పేస్ట్ చేసి, ముఖం, శరీరానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత స్నానం చేసుకోవాలి.

5. డార్క్ లిప్స్ ను నివారిస్తుంది:

5. డార్క్ లిప్స్ ను నివారిస్తుంది:

చాలా మందిలో పెదాలు నల్టా ఇబ్బందిపెడుతుంటాయి. స్ట్రాబెర్రీసలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఈ సమస్యను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. స్ట్రాబెర్రీస్ హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. స్ట్రాబెర్రీస్ తీసుకుని రెండు ముక్కలుగా కట్ చేసి, లోపలి గుజ్జు ముఖం, మెడకు అప్లై చేయాలి. అలాగే పెదాలకు కూడా అప్లై చేయాలి.పూర్తిగా డ్రైగా మారిన తర్వాత రెండో సారి తిరిగి స్ట్రాబెర్రీ జ్యూస్ అప్లై చేసి, రెండో సారి పూర్తిగా డ్రూగా మారిన తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా చర్మ రంగులో మార్పు వస్తుంది.

English summary

This Is What Happens When You Apply Strawberry On Skin!

One of the tastiest and luscious-looking fruits in the kingdom is strawberries. They are delicious, tempting and are equally loved by kids and adults. Strawberries are not only good to taste but they also prove to be extremely beneficial for the skin and hair. Listed here are skin benefits of strawberries.
Story first published: Thursday, January 5, 2017, 7:24 [IST]
Desktop Bottom Promotion