For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖానికి టమోటో ఫేస్ ప్యాక్ వేసి చూడండి, అద్భుతమైన మార్పు కనబడుతుంది.!

|

టమోటో అంటే తెలియని వారుండరు. అందులో మనకు తెలియని ఆరోగ్య పోషకాలు, మన సౌందర్యాన్ని పెంచే విటమిన్లు ఎన్నో ఉన్నాయి. పైగా టమోటాలో నీటిశాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎ, బి1, బి3, బి6. ఇ, కె వంటి విటమిన్‌లే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం ఫైబర్‌ లాంటివీ ఉన్నాయి.

టమోటోలను రోజూ తీసుకోవడం వల్ల, లేదావాటి జ్యూస్‌ను తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం అల్పహారానికి బదులు టమోటాలను తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఎందుకంటే వాటిలోని ఫైబర్‌ మనలోని బరువుతగ్గడానికి ఉపయోగపుడుతంది. వీటిలో ఎక్కువగా ఉండే పొటాషియం చెడు కొలస్ట్రాల్‌ తగ్గించి గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తాయి.

ముఖానికి టమోటో ఫేస్ ప్యాక్ వేసి చూడండి, అద్భుతమైన మార్పు కనబడుతుంది.!

వాటిలో ఉండే విటమిన్‌ ఎ, బికాంప్లెక్స్‌, థయామిన్‌, నియాసిన్‌ వంటి విటమిన్లు కంటి జబ్బులను తగ్గిస్తాయి. ఇంకా టమోటాలలో ఉండే మినరల్స్‌, పోషకాలు వల్ల రక్తపోటు, చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కాల్షియం ఎముకల పెరుగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా వీటిలో క్యానర్స్‌ నిరోధక కారకాలూ ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. వీటి జ్యూస్‌ తాగడం వల్ల రోధ నిరోధక శక్తి పెరుగుతుంది, మలబద్దకం తగ్గుతుంది. రక్తహీనత నుండి కాపాడుతుంది.

టమెటా ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని పెంచే ఔషధం కూడా...ఎర్రెర్రని టొమాటోలు అందాన్ని కాపాడుకోవడంలోనూ కీలకంగా పనిచేస్తాయి. మరి దాన్ని ఎలా ఉపయోగించాలి.. వాటితో ఎలాంటి సౌందర్య ప్రయోజనాలున్నాయి.. చూద్దాం రండి.

చర్మం మృతకణాలు తొలగి మృదువుగా:

చర్మం మృతకణాలు తొలగి మృదువుగా:

ఎండలో తిరగడం, దుమ్ము ధూళి వంటి కారణాల వల్ల పాతికేళ్ల అమ్మాయిలైనా అసలు వయసుకంటే పెద్దవారిలా కనిపిస్తుంటారు. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఇలా చేసి చూడండి. ఒక టొమాటోని గుజ్జుగా చేసుకుని దానికి రెండు చెంచాల పంచదార కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా మర్దన చేస్తే చర్మం మృతకణాలు తొలగి మృదువుగా కనిపిస్తుంది. తగిన ఆక్సిజన్‌ అంది ముడతలు పడకుండా కాపాడుతుంది.

చర్మం రంగును మార్చుతుంది:

చర్మం రంగును మార్చుతుంది:

కాస్త రంగు తక్కువగా ఉన్నామనుకుని బాధపడే అమ్మాయిలకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది టొమాటో. పావుకప్పు టొమాటో గుజ్జులో చెంచా తేనె కలిపి ముఖానికి సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా మర్దన చేయాలి. ఆపై ఒక టొమాటోని మెత్తగా చేసి దానికి ఒక గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టాలి. దీన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి పూతలా వేస్తే మీరు కోరుకున్న ఫలితం అందుతుంది.

సన్ టాన్ నివారిస్తుంది:

సన్ టాన్ నివారిస్తుంది:

టొమాటో గుజ్జుని ఐస్‌ట్రేలో వేసి ఉదయాన్నే ఫ్రీజర్‌లో పెట్టాలి. ఎండలోనుంచి ఇంటికి తిరిగిరాగానే ఐస్‌ క్యూబ్స్‌తో మృదువుగా మర్దన చేస్తే తక్షణ సాంత్వన లభిస్తుంది. టొమాటోలోని లైకోపీన్‌ సూర్యుడి నుంచి వెలువడే హానికారక కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

చర్మం కాంతివంతంగా తయారవుతుంది:

చర్మం కాంతివంతంగా తయారవుతుంది:

ఒక టొమాటోను మెత్తగా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆపై మునివేళ్లతో మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా పదినిమిషాలు చేశాక కాసేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో ముఖం కడిగేసుకుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది. పొడిచర్మ ఉన్నవారు కాస్త తేనె కూడా చేర్చుకుంటే సరి చక్కని ఫలితం ఉంటుంది.

స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది:

స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది:

టొమాటో గుజ్జు, కమలాఫలం, కీరదోస రసాల్ని సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి రాత్రిపూట రాసుకుని ఆరగంట ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల పిగ్మెంటేషన్‌ సమస్య దూరమవుతుంది. ఛాయ మెరుగవుతుంది. చర్మ గ్రంథులూ శుభ్రపడతాయి.

బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది:

బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది:

బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది: టమోటో జ్యూస్ ను మీ ముఖం మీద అప్లై చేసి శుభ్రం చేసుకోవడం ద్వారా బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. టమోటో రసంలో కొద్దిగా వాల్ నట్ పౌడర్ మిక్స్ చేసి అప్లై చేయడం ద్వారా బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా నివారిస్తుంది.

ఆయిల్ స్కిన్ నివారిస్తుంది:

ఆయిల్ స్కిన్ నివారిస్తుంది:

టమోటోలను కీరదోసకాయ రసంతో మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి . ఆయిల్ స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

టమోటోను స్లైస్ గా కట్ చేసి, ముఖం మీద అప్లై చేస్తూ గుండ్రంగా మర్దన చేయాలి. టమోటోల్లో ఉండే విటమిన్ సి మరియు ఎ మొటిమలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో 3,4 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

చర్మ రంద్రాలను మాయం చేస్తుంది:

చర్మ రంద్రాలను మాయం చేస్తుంది:

టమోటో రసంలో నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకొని 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కళ్లక్రింద నల్లని వలయాలు తొలగిపోతాయి :

కళ్లక్రింద నల్లని వలయాలు తొలగిపోతాయి :

చెంచా టమోటా రసం, చెంచా శనగ పిండి, అర చెంచా నిమ్మరసం తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి.

English summary

Tomato Face Packs To Get Healthy, Glowing Skin

Tomato Face Packs To Get Healthy, Glowing Skin, The main reason why using tomato for skin makes sense is because of lycopene in them. Also, when your diet contains tomatoes, you can slow down ageing as they help your skin absorb oxygen.
Desktop Bottom Promotion