For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఐదు సులువైన దశలను పాటించడం ద్వారా ఇంట్లోనే అత్యద్భుతమైన ఫేషియల్ చేసుకోవచ్చు

By R Vishnu Vardhan Reddy
|

ఫేషియల్ ద్వారా ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవచ్చు. క్రమం తప్పకుండా ముఖాన్ని మర్దన చేయడం ద్వారా ముఖం ఎంతో ఆరోగ్యవంతంగా వెలిగిపోతూ ఉంటుంది మరియు చర్మం యొక్క అసలైన నిర్మాణం కూడా దెబ్బ తినదు.

అయితే సాధారణంగా ఫేషియల్ చేయించుకోవాలి అని భావించినట్లైతే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి లేదా ఇంట్లోనే తయారుచేసుకోవాలి అని భావిస్తే, దానిని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇందుమూలంగానే చాలామంది మహిళలు ఫేషియల్ చేయించుకోరు. ఫేషియల్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అనే విషయం మహిళలకు తెలిసినా కూడా ఇంట్లో దీనిని తయారుచేసుకోవాలంటే చాలా భయపడిపోతుంటారు. అందుచేత ఫేషియల్ చేసుకోవడాన్ని మానేస్తుంటారు.

ఈ సమస్యను సరళీకృతం చేయడానికి మరియు క్రమం తప్పకుండా ఫేషియల్ ని చేసుకుంటూ అందాన్ని ప్రతి ఒక్క మహిళా పెంపొందించుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి సంబంధించి మొత్తం ప్రక్రియను ఐదు సులువైన దశల్లో ఎలా చేసుకోవచ్చో సవివరంగా ఇక్కడ వివరించబడింది.

Diy Home Facial |Facial At Home | At Home Facial | Diy Facial | Facial In Five Steps

ఈ క్రింద చెప్పబడ్డ ఐదు దశల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇంట్లో చేయడం ద్వారా ఇంట్లోనే మంచి ఫేషియల్ ని మీ అంతట మీరే చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన ఫలితాలను ఫేషియల్ చేసుకున్న 24 గంటలలోపే మీరు చూడగలరు.

ఈ ప్రక్రియను మొదలుపెట్టబోయే ముందు మీరు చేయవల్సిన పని ఏమిటంటే, ఫేషియల్ కు కావాల్సిన వస్తువులన్నింటిని ముందుగానే సమకూర్చుకోవాలి. ఇలా సమకూర్చుకున్న వెంటనే మీరు ఫేషియల్ చేసుకోవడాన్ని మొదలు పెట్టవచ్చు.

మొదట మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి :

మొదట మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి :

  • మొదట మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఇంట్లో ఫేషియల్ చేసుకొనే ప్రక్రియలో భాగంగా మీ ముఖాన్ని ఎలా కడుక్కుంటారు అనే విషయానికి సంబంధించి, మీ ముఖం ఆ పరిస్థితుల్లో ఎలా ఉంది అనే విషయం పై ఆధారపడి ఉంటుంది.
  • మీ ముఖానికి మేక్ అప్ గనుక ఉంటే దానిని ముందుగా కొబ్బరి నూనెని ఉపయోగించి తీసివేయాలి. ఆ తర్వాత సాధారణ నీటిని ఉపయోగించి కడుక్కోవాలి.
  • మీ ముఖం అత్యుత్తమంగా శుభ్రపడాలి అని మీరు గనుక భావిస్తే మీ ముఖాన్ని కొబ్బరి నీళ్లతో కడుక్కోవచ్చు. ప్రకృతిసిద్ధంగా ముఖాన్ని శుభ్రపరుచుకోవాలంటే తేనే కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
  • మీరు దేనినైతే ఉపయోగించి మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి అనుకుంటున్నారో, దానిని మొదట బుగ్గల పై చంద్రాకారంలో రుద్దండి. ఆ తర్వాత నుదురు మరియు ముఖానికి అంతా రాసుకొని పది నిముషాలు వదిలివేయండి.
  • ఆ తర్వాత ముఖాన్ని టిష్యూ పేపర్ ని ఉపయోగించి శుభ్రంగా తుడుచుకోండి. ఈ టిష్యూ ని మళ్ళీ ఫేషియల్ చేసే సమయంలో అస్సలు వాడకండి. ఇది మీ మొదటి దశ.
  • మీ పొరలను సుతిమెత్తగా రుద్దండి :

    మీ పొరలను సుతిమెత్తగా రుద్దండి :

    • ఇంట్లో ఫేషియల్ చేసుకొనే ప్రక్రియలో రెండవ దశలో భాగంగా, మీరు మీ ముఖం పై ఉన్న చర్మాన్ని ఒక స్క్రబ్బర్ తో రుద్దండి. ఇందుకోసం మార్కెట్ నుండి మంచి స్క్రబ్బర్ ను ఎంచి తెచ్చుకోండి.
    • ఈ రుద్దడం అనే ప్రక్రియను అవసరానికి మించి చేయకండి. ఆలా గనుక చేస్తే మీ చర్మం హానికలిగే అవకాశం ఉంది.
    • బాగా ఎక్కువ మోతాదులో స్క్రబ్బర్ ని తీసుకొని మీ ముఖానికి మర్దన చేయండి. ముఖ్యంగా ముక్కు చుట్టూ మరియు పెదాల క్రింద బాగా రుద్దడం ముఖ్యం.
    • ఇలా ఎనిమిది నుండి పది నిమిషాలు రుద్దిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి.
    • ఆవిరితో కొంత సమయాన్ని గడపండి :

      ఆవిరితో కొంత సమయాన్ని గడపండి :

      • ఇంట్లో ఫేషియల్ చేసుకొనే ప్రక్రియలో భాగంగా మూడవ దశలో, ఆవిరి అవసరం ఉంటుంది. ఇది చేయడానికి కొద్దిగా కష్టం అని అనిపించవచ్చు గాని, మీకు ఎంతో విశ్రాంతి మరియు స్వాంతనను చేకూరుస్తుంది.
      • ఆవిరి పెట్టడడం అనేది ఫేషియల్ చేసే క్రమంలో అతిముఖ్యమైన దశ. దీనిని ఎట్టి పరిస్థితుల్లో మరచిపోకూడదు.
      • ఒక బాండీ నిండా వేడి నీటిని మరియు ఒక టవల్ ని తీసుకోండి. టవల్ తో మీ తలకు కప్పుకుని ఆ వేడి ఆవిరిని పీల్చండి.
      • ఇలా చేయడం ద్వారా మీకు కొద్దిగా చెమటలు పట్టే అవకాశం ఉంది కానీ, అది కూడా మీకు మంచి చేస్తుంది.
      • ఇలా ఆరు నుండి ఎనిమిది నిమిషాల పాటు ఆవిరిలో ఉన్న తర్వాత హోమ్ ఫేషియల్ ప్రక్రియలో తదుపరి దశను ఆచరించవలసిన అవసరం ఉంది అదే టోనింగ్.
      • టోనింగ్ తో పాటు మరిన్ని పనులు చేయవలసి ఉంది :

        టోనింగ్ తో పాటు మరిన్ని పనులు చేయవలసి ఉంది :

        • ఇప్పుడు బ్లాక్ హెడ్స్ ని తీసివేసే పరికరం తీసుకొని మీ ముఖం మొత్తంపై అలా అదిమి ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ముఖం మొత్తం పై ఉన్న వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
        • దీనిని మొటిమలు లేదా చర్మం చిట్లిన ప్రదేశాల్లో చేయకూడదు.
        • ఈ బ్లాక్ హెడ్ తీసివేసే పరికరాన్ని పరిశుభ్రతలో భాగంగా వినియోగించిన తర్వాత మీ ముఖాన్ని టవల్ తో శుభ్రంగా తుడుచుకోండి.
        • ఇక ఇప్పుడు మీకు ఇష్టమైన ఫ్రూట్ టోనర్ ని దూదితో మీ ముఖంపై రాసుకోండి.
        • ఇక చివరిగా ముఖానికి మాస్క్ వేసుకోవాలి :

          ఇక చివరిగా ముఖానికి మాస్క్ వేసుకోవాలి :

          • ముఖానికి టోనింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇంట్లో చేసుకునే ఫేషియల్ చివరిది మరియు చివరాఖరిది అయిన దశ ఏమిటంటే, పేస్ మాస్క్ ను రాసుకోవడం.
          • ఫేస్ మాస్క్ ను రాసుకోవడానికి మీకు ఇష్టమైన బ్రాండ్ ను ఎంచుకోవచ్చు లేదా మీ చర్మానికి సరిపడే ఏదైనా గుజ్జు తో కూడిన పండుని ఎంచుకోవచ్చు.
          • బాగా మందమైన ఫేస్ ప్యాక్ ని తయారుచేసుకొని మీ ముఖానికి బాగా రాసుకోండి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉండండి.
          • ఈ మాస్క్ ఏదైతే మీ ముఖం పై రాసుకుంటారో దానిని మీరు కడిగివేసే ముందు అది పూర్తిగా ఎండిపోవాల్సి ఉంది.
          • పూర్తిగా అది ఎండిన తర్వాత నీటి తో శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ ని మీ ముఖం పై చిలకరించండి. ఈ దశలన్నింటిని చేయడం ద్వారా ఇంట్లో ఫేషియల్ చేసుకోవడం అనే ప్రక్రియను సఫలీకృతం చేయవచ్చు. ఇలా చేసిన తర్వాత 24 గంటల సమయం వేచి ఉండండి, ఆ తర్వాత ఫలితాన్ని మీరే చూస్తారు.

English summary

Diy Home Facial |Facial At Home | At Home Facial | Diy Facial | Facial In Five Steps

Facial either requires a salon visit or long preparation, which ultimately makes women too lazy to do it. So that women don't skip on their facial plans, here is an at-home DIY facial that can be done in five steps. This facial is quick and yet very beneficial for the skin.
Story first published:Monday, November 27, 2017, 17:48 [IST]
Desktop Bottom Promotion