For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు నుదుటి పై ఉంటే ఏమర్థం, బుగ్గపై ఉంటే మని అర్థం..

By Y. Bharat Kumar Reddy
|

ఆడవారికి త్వరగా అంతగా ఏవి నచ్చవు. వారు వేసుకునే దుస్తుల దగ్గర నుంచి మేకప్ కిట్ వరకు ప్రతి విషయంలో పేర్లు పెడుతూనే ఉంటారు. అలాగే పురుషులు విషయంలో వారికి అంతగా నచ్చే వ్యక్తులు చాలా తక్కువే. ఇలా చెప్పుకుంటే పోతే ఈ జాబితా చాలానే ఉందండోయ్. మరి ఇంతగా పక్కవారిని విసిగించే ఆడవారిని వేధించే సమస్యలు ఏమి లేవనుకుంటున్నారా? ఉన్నాయి... అవే మొటిమలు.

15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై 15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై

ఈ విషయంలో మాత్రం వనితలు కాస్త ఇబ్బందిపడుతుంటారు. మొటిమలను తొలగించుకోవడానికి మహిళలు పడే అగచాట్లు అన్నీఇన్నీ కావు. వాటి నుంచి బయటపడడానికి చాలా విధానాలను అవలంభిస్తారు. అయితే కొన్ని సార్లు అవి వర్కవుట్ అవ్వొచ్చు. మరికొన్ని సార్లు ఫెయిల్ కావొచ్చు. అయితే ముఖంపై పలుచోట్ల మొటిమలు రావడానిక ప్రత్యేక కారణాలున్నాయి. మరి అవి ఏమిటో తెలుసుకుందామా.

నుదుటి పైభాగంలో..

నుదుటి పైభాగంలో..

నుదుటి పై భాగంలో మొటిమలు ఉంటే జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నాయని అర్థమట. ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల అక్కడ మొటిమలు వస్తాయంట. అయితే అక్కడ వచ్చే మొటిమలను పరిష్కరించుకునేందకు చిట్కాలున్నాయి. నీరు బాగా తాగాలి.

యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాలు (బెర్రీలు, గింజలు) వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. కెఫెన్, ఫిజ్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండండి.

నుదుటి కింది భాగంలో..

నుదుటి కింది భాగంలో..

ఈ ప్రాంతంలో మొటిమలు రావడానికి కొన్ని కారణాలున్నాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం, డిప్రెషన్, ఒత్తిడికి గురవడం, చెడు రక్త ప్రసరణ వంటి కారణాల వల్ల ఇక్కడ మొటిమలు వస్తుంటాయి. మన శరీరానికి కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్రకు మించింది శరీరానికి ఇంకేది లేదు. కాబట్టి నిద్రకు ఎట్టిపరిస్థితుల్లో మీరు దూరంకాకండి.

రోజూ సరైన సమయానికి నిద్రకు ఉపక్రమిస్తూ... సక్రమంగా నిద్రపోతే మీకు ఆ ప్రాంతంలో మొటిమలు తగ్గే అవకాశం ఉంటుంది.

కనుబొమ్మల మధ్యలో మొటిమలు

కనుబొమ్మల మధ్యలో మొటిమలు

కనుబొమ్మల మధ్యలో వచ్చే మొటిమలు లివర్ పనితీరు బాగా లేదని తెలియజేస్తాయి. ఆల్కాహాల్స్ బాగా తీసుకునేవారిలో లేదా కొవ్వు పదార్ధాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునేవారిలో ఈ ప్రాంతంలో మొటిమలు వస్తుంటాయి. అలాగే అలర్జీ ఫుడ్స్ తీసుకునే వారిలో కూడా కనుబొమ్మల మధ్య కూడా మొటిమలు వస్తాయి. వీలైనంత వరకు ఆల్కహాల్స్ తీసుకోవడం తగ్గించడం మంచిది. అలాగే, పండ్లు, కూరగాయాలు ఎక్కువగా తినాలి. పాల ఉత్పత్తులు, పిజ్జా, బర్గర్, చిప్స్ వంటివి మానేస్తే ఫలితం ఉంటుంది.

కళ్ల కింద

కళ్ల కింద

ఈ ప్రాంతంలోని మొటిమలు తక్కువగా వస్తుంటాయి. ఎక్కవగా నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. మూత్రపిండాలకు సంబంధించి వ్యాధులతో మీరు బాధపడుతున్నట్లయితే ఈ విధంగా అవుతుంది. అందువల్ల మీరు నీటిని తాగడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. రోజుకు కనీసం 8 నుంచి 12 గ్లాసుల నీటిని తీసుకోవాలి.

ముక్కు

ముక్కు

మీ ముక్కుపై మొటిమ వస్తే మీతో ఎవరో ఒకరు ప్రేమలో పడే అవకాశం ఉంది అనే మాటను మీరు ఎప్పుడైనా విన్నారా ? ఒకే మీరు ఎప్పడైనా ఇలా వినే ఉంటారు. అయితే ముక్కుపై వచ్చే మొటిమ మన గుండెలో ఉండే బంధాన్ని తెలుపుదంటారు. అలాగే గుండె, రక్తపోటు సమస్యలను కూడా సూచిస్తుంది. అందువల్ల వీలైనంత మరకు మీరు ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే మీ రక్తపోటు స్థాయిలను కూడా పరిశీలించుకోండి. మసాలాలు, కారం ఎక్కువగా వేసి వండిన ఆహారం, కొవ్వు పదార్థాలను వెంటనే మానేసి వాటికి బదులుగా నట్స్‌ను తీసుకోవాలి.

ముఖంలో మొటిమలు పోవాలంటే సింపుల్ టిప్స్ !ముఖంలో మొటిమలు పోవాలంటే సింపుల్ టిప్స్ !

బుగ్గల కింది, పై భాగంలో

బుగ్గల కింది, పై భాగంలో

బుగ్గల పై భాగంలో మొటిమలు వస్తే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో మీరు ఇబ్బందులుపడుతున్నట్లు సూచన. అలాగే ధూమపానం ఎక్కువ చేయడం లేదా గాలిలో కాలుష్యాన్ని పీల్చుకున్నా కూడా బుగ్గలపై భాగంలో మొటిమలు వస్తాయి. అందువల్ల వీలైనన్నీ జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

బుగ్గల కింది భాగంలో మొటిమలు ఉంటే నోటిలో ఇన్‌ఫెక్షన్లు, దంత సంబంధ వ్యాధులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.

దీంతో మీరు వెంటనే మీ దంతవైద్యుడి దగ్గరకు వెళ్లాలి.

గడ్డం పక్క వైపులా

గడ్డం పక్క వైపులా

మన ఫేస్ లోని ఈ ప్లేస్ పునరుత్పత్తి అవయవాలకు అనుగుణంగా ఉంటుంది. హార్మోన్ల విషయంలో ఏదైనా మార్పులు చోటుచేసుకుంటే ఇక్కడ మొటిమలు వస్తాయి. ప్రధానంగా రుతు సంబంధ సమస్యలను ఎదుర్కొనే మహిళల్లో ఈ తరహా మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఎక్కువగా హార్మన్ల అసమతుల్యతే ఇందుకు కారణం.

గడ్డం కింద

గడ్డం కింద

గడ్డం కింద వచ్చే మొటిమలు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తెలుపుతాయి. ఫైబర్ కు సంబంధించిన ఆహారాపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తరుచుగా చేస్తే ఈ ప్రాంతంలో వచ్చే మొటిమలు తగ్గుతాయి.

చెవులు

చెవులు

ఎక్కువ ఉప్పు, కెఫిన్ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల చెవుల దగ్గర మొటిమలు వస్తాయి.అంతేకాకుండా డీ హైడ్రేషన్ కూడా ఇందుకు కారణం అవుతుంది. ఆహారపదార్థాల్లో ఉప్పు తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. అలాగే నీరు ఎక్కువగా తాగాలి. వ్యాయామం కూడా చాలా అవసరం. ఇలా చిన్నచిన్న చిట్కాలు పాటించండి. మీ చర్మంపై మొటిమలు లేకుండా చూసుకోండి.

English summary

What Your Facial Acne Is Telling You

What Your Facial Acne Is Telling You. Know more about read on...
Desktop Bottom Promotion