For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మానికి రోజ్ వాటర్ ను ఉపయోగించడం వెనుక అసలు రహస్యం..!!

పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు... తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు. గులాబీల హంగామా

|

పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు... తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు. గులాబీల హంగామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ విధి తమే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు. కాబట్టి దీన్ని సౌదర్య సాధనాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Why You Should Stick To Using Rose Water For Your Skin?

రోజ్ వాటర్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ సువాసనభరితమైన ద్రవంలో ఔషధ మరియు సౌందర్య గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఈ రోజ్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో వివిధ రకాల విటమిన్స్ ఉన్నాయి. రోజ్ వాటర్ గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టిరియాలో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

జుట్టు సాప్ట్ గా ..సిల్కీగా మారడానికి గులాబీ రేకుల హెయిర్ మాస్క్ ..!!

రోజ్ వాటర్ లో ఇన్ని లక్షణాలుండటం వల్ల చాలా మంది చర్మ సౌందర్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జుట్టు సంరక్షణకు కూడా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. రోజ్ వాటర్ అన్ని రకాల చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. మీ చర్మం దురదగా ఉంటే ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు, ఇది ఆయిల్ స్కిన్ ను నివారిస్తుంది . ఇది చర్మాన్ని కాంతి వంతంగా మార్చుతుంది. కొంత మంది కళ్ళ ఉబ్బును నివారించడానికి కూడా రోజ్ వాటర్ ను ఉపయోగిస్తారు. రోజు వాటర్ లోని మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం...

స్కిన్ టోనర్ :

స్కిన్ టోనర్ :

చర్మానికి టోనింగ్ చాలా అవసరం. ముఖ్యంగా లేడీస్ టోనర్స్ కొనడంలో చాలా బిజీగా ఉంటారు. అయితే వీటి ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ టోనర్స్ కు బదులుగా కేవలం రోజ్ వాటర్ ను ఉపయోగించండి చాలా...ఇది చాలా చీప్ గా ఉంటుంది. మరియు చర్మంలో మార్పులు తీసుకొస్తుంది. చర్మానికి కావల్సిన పోషణను అందిస్తుంది.

ఫేస్ ప్యాక్స్ లో :

ఫేస్ ప్యాక్స్ లో :

అన్ని రకాల చర్మ తత్వాలకు ఇది ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. కాబట్టి, ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి రోజ్ వాటర్ ను ఉపయోగించవచ్చు. ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఈ సింపుల్ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంలో ఆయిల్ బ్యాలెన్స్ అవుతుంది. ఫేస్ నార్మల్ గా క్లియర్ గా ఉంటుంది.

మేకప్ సెట్టింగ్స్ :

మేకప్ సెట్టింగ్స్ :

ఫ్యాన్సీ మేకప్ సెట్టింగ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మేకప్ సూపర్ గ్లాసీగా కనబడేలా చేస్తుంది. మేకప్ వేసుకోవడం పూర్తి అయ్యాక కొద్దిగా రోజ్ వాటర్ ను ముఖానికి చిలకరించుకోవడం మంచిది. డ్రైగా మారిన తర్వాత గమనించండి మంచి గ్లోయింగ్ స్కిన్ కనబడుతుంది.

పెద్దగా ఉన్న చర్మ రంద్రాలను ష్రింక్ చేస్తుంది:

పెద్దగా ఉన్న చర్మ రంద్రాలను ష్రింక్ చేస్తుంది:

ఒక బాటిల్ రోజ్ వాటర్ ను రిఫ్రిజరేటర్ లో ఉంచాలి. తర్వాత కొద్దిగా తీసుకుని, అందులో కాటన్ బాల్ డిప్ చేసి, ముఖానికి మర్ధన చేయాలి. ఇది పెద్దగా ఉండే చర్మ రంద్రాలను ష్రింక్ చేస్తుంది.

మొటిమలు:

మొటిమలు:

చల్లగా ఉండే రోజ్ వాటర్ నొప్పితో బాధించే మొటిమల సమస్యను నివారిస్తుంది. నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే రోజ్ వాటర్ ను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది.

అవాంఛిత రోమాలు తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో స్మూత్ గా మార్చుతుంది:

అవాంఛిత రోమాలు తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో స్మూత్ గా మార్చుతుంది:

చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అవాంఛిత రోమాలు తొలగించినప్పుడు పెయిన్ ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా త్రెడ్డింగ్, వాక్సింగ్ వంటి సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. త్రెడ్డింగ్, వాక్సింగ్ చేసుకున్న తర్వాత వెంటనే ఆ ప్రదేశంలో కొద్దిగా రోజ్ వాటర్ ను అప్లై చేయాలి. గాట్లు, బుడిపెలు వంటివి కనబడకుండా చేస్తుంది.

స్కిన్ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేస్తుంది:

స్కిన్ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేస్తుంది:

డ్రైస్కిన్ నివారించి, చర్మాన్ని తేమగా ఉంచడంలో రోజ్ వాటర్ గొప్పగా సహాయపడుతుంది. రోజ్ వాటర్ ఆయిల్ స్కిన్ ఉన్న వారికి కూడా గొప్పగా సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉంటుంది.

English summary

Why You Should Stick To Using Rose Water For Your Skin?

Why You Should Stick To Using Rose Water For Your Skin? ,Rose water is one of the best things to gift your skin. Here's why you should use it for your regular skin care regimen.
Desktop Bottom Promotion