For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిడ్డైన చర్మం కోసం, అద్భుతమైన చాక్లెట్ + తేనెల ఫేస్-ప్యాక్ !

జిడ్డైన చర్మం కోసం, అద్భుతమైన చాక్లెట్ + తేనెల ఫేస్-ప్యాక్ !

|

జిడ్డైన చర్మం కోసం ప్రత్యేకమైన శ్రద్ధను & జాగ్రత్తలను తీసుకోవడం చాలా అవసరం, లేకుంటే అది మొటిమలను & ఇతర చర్మ వ్యాధులను మరింతగా కలుగు చేసే అవకాశాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో, మీరు చాలా తీవ్రమైన చెమటను కలిగి, ఎల్లప్పుడూ మీరు హైడ్రేట్గా ఉండలేరు, అలా అది చర్మ సమస్యల వ్యాప్తికి దారితీస్తుంది.

మీ ముఖము బాగా జిడ్డుగా ఉన్నప్పుడు (లేదా) చికిత్స అవసరమని మీరు భావించినప్పుడు మీరు ఫేషియల్ పార్లర్ను సందర్శించడం వల్ల మీ జేబుకు రంధ్రాలు పడటమే కాకుండా, అది అంతగా ఆచరణాత్మకమైనది కాదు. అంతేకాకుండా, ఇలాంటి సెలూన్లు మీ చర్మంపై ఉపయోగించే రసాయన ఉత్పత్తులు మీ చర్మానికి మంచి కన్నా ఎక్కువ హానినే కలిగించవచ్చు. అందువల్ల మీరు సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగల ఫేషియల్ను ఎంచుకోవడమే ఉత్తమమైన మార్గం.

DIY Chocolate Honey Face Pack For Oily Skin

జిడ్డు గల చర్మంతోనూ (లేదా) మొటిమలతోనూ బాధపడేవారికి చాక్లెట్ & తేనెను కలిపి మీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ముఖ్యమైన పేస్-ప్యాక్ను గూర్చి ఈ వ్యాసంలో తెలియజేయబోతున్నాము.

ఆ పేస్-ప్యాక్ను ఎలా తయారుచేసుకోవాలో ఎక్కడ చూద్దాం !

కావలసిన పదార్థాలు :-

కావలసిన పదార్థాలు :-

• 1 టేబుల్ స్పూన్ తీపిలేని కోకో పౌడర్

• 1 టేబుల్ స్పూన్లు సేంద్రీయ తేనె

• చిటికెడు దాల్చినచెక్క

తయారుచేసే విధానం :-

• పైన తెలిపిన పదార్థాలన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం మరింత చిక్కగా రావాలంటే ఇంకాస్త తేనెను జోడించవచ్చు.

• ఈ విధంగా తయారైన పేస్-ప్యాక్ మిశ్రమాన్ని ముఖానికి & మెడకు సమానంగా అప్లై చేయాలి.

• ఈ ఫేస్-ప్యాక్ను 20 - 30 నిమిషాలు అలాగే వదిలేయాలి, ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.

• మెరుగైన ఫలితాల కోసం ఈ ఫేస్ ప్యాక్ను వారంలో రెండుసార్లు ఉపయోగించండి.

అది ఎలా పని చేస్తుంది:-

అది ఎలా పని చేస్తుంది:-

చాక్లెట్ & తేనెలో గల యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, మోటిమలను కలుగజేసే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి, మీ చర్మం పూర్తిగా ఎండిపోకుండా, మృదువుగా & కోమలంగా ఉంచడంలో సహాయపడుతుంది. దాల్చినచెక్క కూడా మోటిమలను, మచ్చలను తొలగించడంలో బాగా పనిచేస్తుంది, అలాగే ఇది అన్ని రకాల చర్మాలపై సహజసిద్ధమైన ఎక్స్ఫోలియేటర్గా కూడా పనిచేస్తుంది.

చాక్లెట్ వల్ల చర్మంపై కలిగే ప్రయోజనాలు (కోకో పౌడర్) :-

చాక్లెట్ వల్ల చర్మంపై కలిగే ప్రయోజనాలు (కోకో పౌడర్) :-

• డార్క్ చాక్లెట్లలో ఉండే ఫ్లవనాయిడ్స్, కాటెచిన్స్, పాలీఫెనోల్స్ వంటి కొన్ని రకాల శక్తివంతమైన పదార్థాలు యాంటీఆక్సిడెంట్లుగా కలిగి ఉన్నాయి.

• ఈ చాక్లెట్లలో ఉండే ఫ్లవనాయిడ్స్ సూర్యకాంతి నుంచి మీ చర్మం దెబ్బతినకుండా కాపాడటంలో బాగా సహాయపడుతుంది. మీ చర్మాన్ని హ్యాండెడ్గా ఉంచుతూ, మెరుగైన రక్తప్రసరణను కలిగి ఉండేలా చేయడంలో ఈ చాక్లెట్లు సహాయపడతాయి.

• ఈ డార్క్ చాక్లెట్లలో ఉండే కోకో పదార్థాలు అటోపిక్ డర్మటైటిస్ను నయం చేస్తాయి. ఈ చాక్లెట్లలో ఉన్న పాలీఫెనోల్స్, వివిధ చర్మ పరిస్థితులకు సంబంధించిన వాపులను & ఇతర అలెర్జీ లక్షణాలను తగ్గించవచ్చు.

• ఈ చాక్లెట్ ఫేస్-ప్యాక్లు మీకు సహజసిద్ధంగా ఉండే చర్మాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. ఇవి చర్మ కణాల పునరుత్పత్తిను ఉత్తేజపరచి & పిగ్మెంటేషన్ను తగ్గించవచ్చు.

• ఈ చాక్లెట్ ఫేస్-ప్యాక్లను రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మీ ముఖ చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉండేటట్లుగా తయారుచేస్తుంది.

• మీ చర్మానికి నష్టాన్ని కలుగజేసే బ్యాక్టీరియాలను తొలగించేందుకు ఇందులో ఉండే కెఫీన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల మీ చర్మం మరింత తాజాగా కనబడుతుంది.

మీ చర్మంపై తేనె వల్ల కలిగే ప్రయోజనాలు :-

మీ చర్మంపై తేనె వల్ల కలిగే ప్రయోజనాలు :-

• తేనెలో సహజసిద్ధంగా ఉండే యాంటీ బాక్టీరియా లక్షణాలు జిడ్డైన చర్మంపై మొటిమలను నిరోధించడానికి సహాయపడుతుంది.

• శరీర వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో పుష్కలంగా ఉంటాయి.

• మీ ముఖ చాయని కాపాడటంలో తేనె బాగా ఉపయోగపడుతుంది.

• తేనెలో మీ చర్మంపై అప్లై చేసినప్పుడు మెత్తని, మృదువైన భావనను కలుగజేస్తూ, మీకు సహజమైన ఛాయను అందజేస్తుంది.

• తేనే ఒక గొప్ప క్లెన్సర్గా పనిచేస్తుంది. మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేసి, మళ్లీ మూసుకుపోకుండా చేస్తోంది.

• తేనె మీకు యవ్వనమైన, ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది.

• సన్ బర్న్కు గురైన చర్మాన్ని చికిత్స చేయడంలో తేనె సహాయపడుతుంది.

దాల్చినచెక్క వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు :-

దాల్చినచెక్క వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు :-

• దాల్చిన చెక్క లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు, తేనెలో ఉన్న యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఒకటిగా కలవడం వల్ల మీ చర్మంపై ఏర్పడిన మొటిమలను తొలగించడంలో గొప్పగా ఉపయోగపడుతుంది.

• ఈ దాల్చినచెక్క మీ చర్మంపై ఏర్పడిన మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

• దాల్చినచెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మీ చర్మం పై ఏర్పడిన మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది.

• దాల్చినచెక్క సహజసిద్ధమైన ఎక్స్ఫాలియేటర్గా కూడా పని చేస్తుంది, అలాగే దీన్ని అన్నిరకాల చర్మలపై వాడేందుకు అనుకూలమైన ప్రభావాన్ని ఉంటుంది.

చాక్లెట్ ఫేస్-ప్యాక్ను ఉపయోగించినప్పుడు అనుసరించవలసిన కొన్ని చిట్కాలు:-

చాక్లెట్ ఫేస్-ప్యాక్ను ఉపయోగించినప్పుడు అనుసరించవలసిన కొన్ని చిట్కాలు:-

• మీరు ఈ ప్యాక్ను అప్లై చేసే ముందు, ముందుగా మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రపరచుకోవాలి.

• మీ ముఖానికి అప్లై చేసిన ఈ ప్యాక్ను తొలగించేటప్పుడు, ఈ ఫేస్-ప్యాక్ పూర్తిగా ఎండిపోకుండా ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఈ ఫేస్ప్యాక్ పూర్తిగా ఎండిపోయినట్లయితే, మీ ముఖంపై కొంచెం కొంచెంగా నీళ్లను జల్లి, కొన్ని నిమిషాలు వరకు వేచి ఉండండి. మీ ఫేస్-ప్యాక్ కాస్త తేమను కలిగి ఉన్న తర్వాత మాత్రమే మీ ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోండి.

• మీ ముఖానికి ఫేస్ మాస్క్ను తొలగిస్తున్నప్పుడు వృత్తాకార కదలికలో మీ చర్మాన్ని మసాజ్ చేస్తూ ఈ ప్యాక్ను తీసివేయండి.

• ముఖానికి ఈ ఫేస్-మాస్క్ను అప్లై చేసేటప్పుడు కళ్ళ ప్రదేశాన్ని పూర్తిగా వదిలేయండి.

English summary

DIY Chocolate Honey Face Pack For Oily Skin

Oily skin needs special care and attention, as it is more prone to acne and skin infections. Especially during the harsh summer months, when you sweat a lot, and do not hydrate well, it can lead to a host of skin troubles. To get rid of oily skin, try homemade face masks made of chocolate, honey, and cinnamon.
Story first published:Monday, May 21, 2018, 18:17 [IST]
Desktop Bottom Promotion