For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోలియం జెల్లీ ఎందుకు వాడరాదో తెలియజేసే మూడు కారణాలు!

పెట్రోలియం జెల్లీ ఎందుకు వాడరాదో తెలియజేసే మూడు కారణాలు!

|

పెట్రోలియం జెల్లీ దాదాపుగా ప్రతి ఇంటిలో ఖచ్చితంగా ఉంటుంది. అనేక దశాబ్దాలుగా దీనిని ఉపయోగిస్తూ వస్తున్నాం. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేటప్పుడు, పెట్రోలియం జెల్లీని పెట్రోలాటం లేదా ఖనిజ నూనెగా పిలుస్తారు. ఇది ఒక సౌందర్య సాధనం కాదు, ఒక రకమైన ఆయింట్మెంటు యొక్క రూపం.

మనం దాదాపు ప్రతి చర్మసమస్యకు పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తాము. - పొడి, పగిలిన చర్మం నుండి చర్మపు దద్దుర్లు మరియు పూతల వరకు, పెట్రోలియం జెల్లీని ప్రతిచోటా వాడతారు. ముక్కు నుండి రక్తస్రావం జరిగినా, జలుబు చేసినా కూడా, దీనిని చికిత్సకు ఉపయోగిస్తారు.

3 Reasons Why You Should Not Use Petroleum Jelly

అయితే, అన్ని వయసుల ప్రజలలో అత్యంత ప్రజాదరణ పొందినందున, దీనిని విస్తృతంగా విక్రయించినప్పటికిని, కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు, పెట్రోలియం జెల్లీ ఎందుకు దానికి ఉన్న ప్రజాదరణకు తగ్గట్టు ,వాడుకకు అంత ఉత్తమమైనది కాదో తెలుపుతున్నాయి.

అసలు, చర్మంపై పెట్రోలియం జెల్లీను ఉపయోగించడం ఎందుకు హానికరమైనదిగా పరిగణిస్తున్నారో తెలియజేసే మూడు కారణాలను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. తెలుసుకోండి మరి!

మీ చర్మంపై పెట్రోలియం జెల్లీని ఎందుకు ఉపయోగించకూడదు?

3 Reasons Why You Should Not Use Petroleum Jelly

1.ఇది మీ చర్మానికి పోషణ అందివ్వదు:

ఒక ఔషధం గా పరిగణింపబడుతున్నప్పటికీ, పెట్రోలియం జెల్లీ చర్మానికి ఎటువంటి పోషణను అందించదు. దీనికి ఎటువంటి ఔషధ లక్షణాలు లేవు. మీ చర్మం శుభ్రం లేదా తేమగా ఉండకపోతే, మీరు ఎంత పెట్రోలియం జెల్లీని వినియోగించినా, అది పొడిదనాన్ని పోగొట్టదు.

మీరు పెట్రోలియం జెల్లీని తరచూ ఉపయోగిస్తున్నట్లయితే, మీరు చర్మాన్ని సహజ తేమను ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తున్నట్లే లెక్క.

పెట్రోలియం జెల్లీ తేమ నశించకుండా అడ్డుకునేది అయినప్పటికీ, దీనిని ఒక తేమనందించే పదార్ధంతో జత చేయవలసి ఉంటుంది. అప్పుడు చర్మం గాలిలోని తేమను పొంది, చర్మంను రీహైడ్రేట్ చేసి మృదువుగా మారుస్తుంది. ఇలా చేసినప్పుడు మాత్రమే పెట్రోలియం జెల్లీ చర్మంపై ప్రభావం చూపుతుంది.

3 Reasons Why You Should Not Use Petroleum Jelly

2. ఇది ఆయిల్ యొక్క ఉప ఉత్పత్తి

పెట్రోలియం జెల్లీ ఇప్పటికీ, చమురు ఉత్పత్తి సమయంలో ఏర్పడే ఉప ఉత్పత్తులలో భాగంగా ఏర్పడుతుంది. కొన్ని ప్రక్రియల ద్వారా దీనికి రంగు మరియు వాసన లేకుండా చేస్తారు. కనుక మీరు పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తున్నప్పుడు, పరోక్షంగా మీ చర్మంపై పెట్రోలియం యొక్క ఉప ఉత్పత్తిని పూసుకుంటున్నట్లే!

3 Reasons Why You Should Not Use Petroleum Jelly

3. ఇది చర్మంలోనికి ఏ పదార్థాన్ని చొచ్చుకుపోనివ్వన్ని అడ్డంకిని ఏర్పరుస్తుంది.

ఇది ఒక నిరోధక ఏజెంట్ లా పనిచేయడంతో, పొడిబారిన మరియు పగిలిన చర్మం యొక్క చికిత్సకు పెట్రోలియం జెల్లీని విస్తృతంగా వినియోగిస్తున్నారు. చర్మంపై రాసుకున్నప్పుడు, ఒక అవరోధం సృష్టించడం ద్వారా చర్మంలోని తేమను బంధిస్తుంది. కనుక,ఇది నీరు, బ్యాక్టీరియా మరియు గాలి వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

పెట్రోలియం జెల్లీ ఒక హైడ్రోఫోబిక్ అడ్డంకిగా పనిచేసి , చర్మం కోల్పోయే నీటిని 90 శాతం వరకు తగ్గించగలదు. ఇది నిరోధక లక్షణాలను చూపడంలో అత్యంత ప్రభావవంతమైనది. ఏదేమైనప్పటికి,దీని వలన కలిగే ప్రతికూల ప్రభావం ఏమిటంటే, ఇది చర్మాన్ని శ్వాస తీసుకోవడానికి అడ్డుగా దట్టమైన అవరోధం కల్పిస్తుంది.

2000 లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, కాండిడియసిస్ (శిలీంధ్ర సంక్రమణ) కలిగి ఉన్న పిల్లల చర్మంపై, దానిని నియంత్రించటానికి పెట్రోలియం జెల్లీని ఉపయోగించినపుడు, ఆ వ్యాధి మరీంత పెరిగింది.

పెట్రోలియం జెల్లీ, ఈస్ట్ లో సంతానోత్పత్తికి అనుకూలంగా వుండే పరిస్థితులను సృష్టింస్తున్నట్లు కనుగొనబడింది. పెట్రోలియం జెల్లీ వాడుకను నిలుపుదల చేసిన తరువాత మాత్రమే, ఈ లక్షణాలు తగ్గాయి.

మార్కెట్లో పుష్కలంగా లభించే ఆరోగ్యకరమైన ఉత్పత్తులును మరియు ఇంటిలో తయారు చేసుకోగలిగే కొన్ని పదార్థాలను, పెట్రోలియం జెల్లీకి ప్రత్యామ్నాయాలుగా వాడుకోవచ్చు. పెట్రోలియం జెల్లీని మాత్రమే వాడలనుకోరాదు. మీరు ఇతర మంచి ఇతర సమర్ధవంతమైన ప్రత్యామ్నాయ పదార్థాలను వాడుకోవటం శ్రేయస్కరం. .

English summary

3 Reasons Why You Should Not Use Petroleum Jelly

Petroleum jelly is something that you are almost sure to find in every household. It has been in use since several decades. Petroleum jelly, for commercial purpose, is also sometimes referred to as petrolatum or mineral oil. It is not a cosmetic but a form of topical ointment.
Story first published:Tuesday, July 17, 2018, 13:01 [IST]
Desktop Bottom Promotion