For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అయిదు చిట్కాలు ఇన్స్టెంట్ స్కిన్ వైటనింగ్ కి తోడ్పడతాయి

|

కాంతివంతమైన చర్మాన్ని అలాగే ఈవెన్ టోన్డ్ మరియు అద్భుతమైన చర్మ సౌందర్యాన్ని వర్ణించేందుకు ఫెయిర్, వైట్ అనే పదాలను తరచూ ఉపయోగిస్తూ ఉండటం మనకు తెలిసిన విషయమే. స్కిన్ వైటనింగ్ ద్వారా చర్మంలో దాగున్న సహజసిద్ధమైన కాంతిని వెలికితీయవచ్చు. వివిధ విధాలుగా చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ 5 స్కిన్ వైటనింగ్ చిట్కాలను పాటించడం ద్వారా మీ చర్మాన్ని మరింత కాంతివంతంగా తయారుచేసుకోవచ్చు.

1. నిమ్మరసం:

1. నిమ్మరసం:

నిమ్మరసంలో ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలతో పాటు చర్మ సౌందర్యాన్ని సంరక్షించే సామర్థ్యాలు కూడా అధికంగా లభిస్తాయి. ఆరోగ్యమైన పళ్ళు, చిగుళ్లకోసం అలాగే తక్షణ శక్తిని అందించడం కోసం, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం కోసం నిమ్మరసాన్ని కొన్నేళ్లుగా వాడటమనేది ప్రాచుర్యం పొందిన విషయమే. వీటితో పాటు నిమ్మరసంలో తేలికపాటి బ్లీచింగ్ ప్రాపర్టీస్ కూడా లభిస్తాయి. చర్మం టాప్ లేయర్ ని ఎక్స్ఫోలియెట్ చేసేందుకు నిమ్మరసం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్యూర్ నిమ్మరసం అనేది చర్మంపై ఘాటుగా ఉంటుంది. కాబట్టి కాస్తంత నీటిలో నిమ్మరసాన్ని డైల్యూట్ చేయడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. నిమ్మరసాన్ని నీటిలో డైల్యూట్ చేసి ఒక కాటన్ ప్యాడ్ తో ఆ మిశ్రమాన్ని తీసుకుని ముఖాన్ని రబ్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే వాడుకోవాలి. ఈ పద్దతిని పాటించిన ప్రతి సారి ముఖాన్ని మాయిశ్చర్ చేసుకోవడం మరచిపోకూడదు. ఎండలోకి వెళ్లేముందు ముఖాన్ని బాగా శుభ్రపరచుకోవాలి.

2. టమాటో:

2. టమాటో:

ట్యాన్, సన్ బర్న్ ల సైన్స్ ను నిర్మూలించడానికి టమాటో ఉపయోగకరంగా ఉంటుంది. టమాటో ప్యాక్ అనేది మీ స్కిన్ టోన్ ని లైటెన్ చేయడానికి తోడ్పడుతుంది. అలాగే, ముఖంపైన డెడ్ సెల్స్ ను పూర్తిగా తొలగించేందుకు దోహదపడుతుంది. ఈ ప్యాక్ ను చేసుకునేందుకు మీకు ఒకటి లేదా రెండు టొమాటోలు అవసరపడతాయి. అలాగే, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం తో పాటు గ్రామ్ ఫ్లోర్ కూడా అవసరం అవుతుంది. గ్రామ్ ఫ్లోర్ ని మీకు ఇష్టమైతే కలపవచ్చు లేదా ఇగ్నోర్ చేయవచ్చు. ఈ పదార్థాలన్నిటినీ బ్లెండర్ లో వేసి పేస్ట్ ను తయారుచేసుకోండి. ఈ ప్యాక్ ని షవర్ చేసుకోవడానికి ముందు అప్లై చేసుకోవాలి.

3. మిల్క్ అండ్ లెమన్:

3. మిల్క్ అండ్ లెమన్:

మిల్క్ లో వైటనర్ లక్షణాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే, మాయిశ్చరైజింగ్ సామర్థ్యం కూడా ఎక్కువే. అందువలన, మిల్క్ ను లెమన్ లో కలపడం వలన లెమన్ లోని అస్ట్రింజెంట్ లక్షణాలను బాలన్స్ చేయవచ్చు. తద్వారా, చర్మానికి తగిన పోషణని అందివ్వవచ్చు. ఒక టబ్ లో బాత్ వాటర్ ని తీసుకుని. అందులో ఒక కప్ మిల్క్ ని జోడించండి (ఫ్యాట్ ఫ్రీ మిల్క్ కాదు).

ఇప్పుడు ఒక నిమ్మకాయ నుంచి నిమ్మరసాన్ని ఈ బాత్ వాటర్ లోకి జోడించండి. ఈ మిశ్రమంలో కనీసం 20 నిమిషాల పాటు సోక్ అవ్వండి. ఆ తరువాత రిన్స్ చేయండి. ఈ రెమెడీని వారానికి ఒకసారి పాటించండి.

4. ఎక్స్ఫోలియేషన్:

4. ఎక్స్ఫోలియేషన్:

వైట్ స్కిన్ ను పొందేందుకు ఈ రెమెడీస్ ను పాటించడంతో పాటు వివిధ ఎక్స్ఫోలియేటింగ్ మెథడ్స్ ని కూడా ప్రయత్నించవచ్చు. ఎక్స్ఫోలియేషన్ వలన చర్మంపై నుంచి డెడ్ సెల్స్ అనేవి తొలగిపోతాయి. తద్వారా, చర్మం నుంచి నిస్తేజంగా అలాగే అలసిన లుక్ అనేది తొలగిపోయి చర్మం మరింత రెఫ్రెషింగ్ గా అలాగే గ్లోయింగ్ గా మారుతుంది. బాడీ స్క్రబ్స్ గా షుగర్ మరియు సాల్ట్ స్క్రబ్ తో ఎక్స్ఫోలియేటింగ్ మిక్స్ ను తయారుచేసుకోవచ్చు. అదే ముఖంపైన డెలికేట్ స్కిన్ కోసం క్రష్డ్ ఆల్మండ్స్ లేదా ఓట్ మీల్ ను వాడవచ్చు. ఎక్స్ఫోలియేటర్ ను సర్క్యూలర్ మోషన్ లో వెట్ స్కిన్ పై సున్నితంగా అప్లై చేయాలి. ఈ పద్దతిని వారానికి ఒకసారి పాటిస్తే పాలిష్డ్ లుక్ మీ సొంతం అవుతుంది.

5. మాయిశ్చరైజర్:

5. మాయిశ్చరైజర్:

మీ చర్మాన్ని ఎల్లప్పుడూ మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా, డెడ్ సెల్స్ అనేవి పేరుకుపోవు. బ్రైటెనింగ్ మాయిశ్చరైజర్ ని వాడండి. ఓలే స్కిన్ కేర్ వంటి ప్రోడక్ట్స్ ని డైలీ బ్రైటెనింగ్ మరియు మాయిశ్చరైజింగ్ నీడ్స్ కి వినియోగించవచ్చు. నేచురల్ విధానాల్ని పాటించాలని అనుకుంటే స్నానం చేసిన తరువాత కొంత కొబ్బరి నూనెను లైట్ గా శరీరంపై రాయవచ్చు. పది నిమిషాలలో మీ చర్మంలోకి నూనె ఇంకిపోయి చర్మం కాంతివంతంగా మారి రోజంతా తాజాగా అలాగే ఫ్రెష్ గా ఉంటుంది.

సో, స్కిన్ వైటనింగ్ హోమ్ రెమెడీస్ ను ఈ ఆర్టికల్ లో తెలుసుకున్నారు కదా? ఈ సూచనలలో మీకు బాగా నచ్చిన వాటి గురించి మాకు తెలియచేయండి.

English summary

5 Instant Skin Whitening Tips

Pale, white, fair - these are just some of the words that are used to describe glowing, even toned and gorgeous skin. While instant skin whitening is certainly possible, there are several different ways to achieve that glow. We present to you, 5 different skin whitening tips, which will light up your skin like never before.
Desktop Bottom Promotion