For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సంరక్షణకు ఆవనూనెతో ఐదు అద్భుతమైన పరిష్కారాలు!

చర్మ సంరక్షణకు ఆవనూనెతో ఐదు అద్భుతమైన పరిష్కాఅరాలు!

|

మనలో చాలా తక్కువమందికి మాత్రమే, సౌందర్య పోషణ రహస్య పదార్థాలను గురించి చెప్పే బామ్మ ఉంటుంది. మీరు అలాంటి బామ్మని కలిగి ఉంటే చాలా అదృష్టవంతులు. ఆమె సలహాలను విస్మరించకుండా, తప్పక పాటించండి.

మీ బామ్మగారికి, మీరు తలపడుతున్న అన్ని రకాల చర్మ సమస్యల చికిత్స కొరకు ఉపయోగపడే రహస్య పదార్థం గురించి తెలుసు. మీ జుట్టును అధికంగా కోల్పోతున్నపుడు, వెచ్చబెట్టిన ఆవనూనెతో, మీ తలను మర్దన చేసుకోవచ్చని ఆమె మీకు చెప్పవచ్చు.

5 Ways To Use Mustard Oil For Skin Care


మీరు ఆవనూనెను (దాదాపు అన్ని భారతీయ గృహాల్లో)కేవలం వంట కోసం మాత్రమే వాడవచ్చని ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ ఇది వివిధ రకాల చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా? మీరు నమ్మకం కుదరకపోతే, ఈ రోజు నుండి , ఈ అద్భుతమైన నూనెను, రోజు సౌందర్య పోషణ నిమిత్తం ఉపయోగించడం ప్రారంభించండి.

ఆననూనెలో మాంసకృత్తులు, విటమిన్ ఈ, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఆవ నూనె చర్మ సమస్యల చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కమిలిన చర్మం లేదా మచ్చలు కలిగివున్నా, కొన్ని రకాల ఆవనూనె మాస్కులు వాడటం ద్వారా, కొన్ని రోజుల్లోనే మీ చర్మ సమస్యలన్నిటికి వీడ్కోలు పలకవచ్చు.

మీరు పగిలిన పెదాలను కలిగి ఉంటే, ఆవ నూనె వాడకంతో దానిని నయం చేయవచ్చు. ఈ క్రింద మేము తెలుపబోయే మాస్కులన్నింటిలో ఆవనూనె ప్రధాన పదార్ధం. మీకున్న అన్ని రకాల చర్మ సమస్యలకు ఆవనూనె ద్వారా పరిష్కారానికి ప్రయత్నించండి.

■ ఆవనూనెతో ఎందుకు కమిలిన మీ చర్మానికి స్వస్థత

■ ఆవనూనెతో ఎందుకు కమిలిన మీ చర్మానికి స్వస్థత

మీరు కఠినమైన సూర్యకిరణాలకు భయపడుతున్నారా? మీరు దాని గురించి అస్సలు చింతించవలసిన అవసరం లేదు. మీరు బయటకు వెళ్ళినప్పుడు నీడలో దాక్కునే అవసరం లేదు. ఆవనూనె ఉపయోగించి సులభంగా ఎండ ప్రభావం వలన కమిలిన చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు.

ఎలా?

కేవలం1 టీ స్పూన్ ఆవనూనె తీసుకొని మీ ముఖాన్ని 10-12 నిముషాల పాటు రుద్దండి. తరువాత నీటిలో తడిపిన ఒక దూది ఉండతో మీ ముఖాన్ని తుడుచుకోండి. ఇదే ప్రక్రియను కొన్ని రోజులకు ఒకసారి పునరావృతం చేయడం వలన అద్భుతమైన ఫలితం ఉంటుంది.

■ ఆవనూనెతో నల్ల మచ్చలకు చికిత్స

■ ఆవనూనెతో నల్ల మచ్చలకు చికిత్స

నల్ల మచ్చలు నిస్సందేహంగా మీ చర్మానికి నష్టం కలిగించేవే! ఈ మొండి మచ్చలు మీ ముఖాన్ని నిస్తేజంగా కనిపించేలా చేస్తాయి. వీటి ఫలితంగా మీ ముఖం నల్లగా కనిపిస్తుంది. ఆవనూనెతో నల్లని మచ్చలను పూర్తిగా మాయం చేయవచ్చు.

ఎలా?

ఒక గిన్నెలో, 2 టేబుల్ స్పూన్లు ఆవ నూనె, 1 టేబుల్ స్పూన్ శనగ పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు మరియు 1 టీస్పూన్ నిమ్మరసం కలపండి. ఇది ఒక చిక్కని పేస్ట్ గా మారే వరకు అన్ని పదార్ధాలను చక్కగా కలపండి.ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంలో రాసుకోండి.

ఈ ప్యాక్ ను మీ చర్మంపై 15 నిముషాల పాటు ఆరనిచ్చిన తరువాత, సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

రోజు విడిచి రోజు, ఏ ప్యాకును మీ ముఖానికి వేసుకుంటే, కొద్దీ రోజులలోనే మీ ముఖం పై మచ్చలన్నీ తొలగిపోతాయి.

■ ఆవనూనెను ఉపయోగించి మీ మేనిఛాయను మెరుగుపరచుకోండి

■ ఆవనూనెను ఉపయోగించి మీ మేనిఛాయను మెరుగుపరచుకోండి

మచ్చలేని చర్మం కేవలం కలలలో మాత్రమే సాధ్యమవుతుంది. అయితే, ఆవనూనె మీ కలను నిజం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీనికై మీకు కావలసిందల్లా రెండే రెండు పదార్థాలు.

ఎలా?

ఒక గిన్నె తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూను ఆవనూనె వేయండి. ఇప్పుడు దానిలో 1 టేబుల్ స్పూను కొబ్బరి నూనె కూడా వేయండి. రెండింటిని బాగా కలపి, రాత్రి పడుకోబోయే ముందు 15 నిమిషాలు పాటు మీ ముఖానికి మర్దన చేసుకోండి.

తరువాత సున్నితమైన ఫేస్ వాష్ తో మీ ముఖం శుభ్రపరచుకోండి. కొద్ది రోజులలోనే మృదువైన, ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుంది.

■ మొటిమల చికిత్సకు ఆవనూనె

■ మొటిమల చికిత్సకు ఆవనూనె

ఆవనూనెలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, మొండి మోటిమలను కూడా నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆవనూనెలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను నిరోధించడానికి సహాయపడతాయి. దీనికై మీకు కావలసిందల్లా ఆవ గింజలు మరియు1 లీటరు కొబ్బరి నూనె.

ఎలా?

ఒక బాణలిలో కొబ్బరి నూనె పోయాలి.

దీనిలో కొన్ని ఆవపిండి గింజలను వేసి, ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి.

తరువాత చల్లబడేవరకు ఈ మిశ్రమాన్ని వదిలివేయండి. చల్లారాక, ఈ మిశ్రమాన్ని వడగట్టి ఒక సీసాలో నిల్వ చేయండి.

ప్రతి రోజు రాత్రి, పడుకోబోయే ముందు ఈ నూనెతో మీ ముఖం మర్దన చేసుకోండి. ఇలా కొద్ది వారాలపాటు చేస్తే, మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. ఈ పరిష్కారం ద్వారా మొటిమల సమస్యకు వీడ్కోలు పలకండి.

■ ఆవనూనెతో చర్మ ఇన్ఫెక్షన్లకు నివారించండి.

■ ఆవనూనెతో చర్మ ఇన్ఫెక్షన్లకు నివారించండి.

కుంకుమ, ఆవాలు, పసుపు పొడి, శనగపిండి మరియు గంధం - ఈ పదార్ధాలను ఉపయోగించి నలుగు తయారు చేయండి.

ఎలా?ఒక గిన్నెలో, 2-3 కుంకుమపువ్వు రేకులు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ పసుపు, 1 టేబుల్ శనగపిండి మరియు 1 టీస్పూన్ గంధపు పొడి (లేదా తాజా గంధపు పేస్ట్) తీసుకోండి. అన్ని పదార్ధాలను చక్కగా కలిపి పేస్ట్ చేయండి.

ఈ పేస్ట్ లో 2 టేబుల్ స్పూన్ల ఆవనూనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి నలుగులా వారానికి రెండుసార్లు పెట్టుకుంటే, మీ చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగి మెరుపు సంతరించుకోవడమే కాక , చర్మ వ్యాధులు కూడా పారద్రోలడానికి పనికివస్తుంది.

పైన తెలిపిన పరిష్కార మార్గాలు మాత్రమే కాక, మీ చర్మం పొడిబారి, మచ్చలు కలిగి ఉంటే, మీరు విటమిన్ ఇతో సమృద్ధిగా కలిగి ఉన్న ఆవ నూనెపై ఆధారపడవచ్చు. ఈ అద్భుత తైలం కొన్ని చుక్కలు తీసుకుని, వలయాకార కదలికలలో మీ చర్మాన్ని మర్దన చేసుకోండి. పొడిబారిన మీ చర్మం తేమ సంతరించుకుని, ప్రకాశవంతంగా మెరిసిపోయేట్టు చేయడానికి ఇది ఒక సులభమైన మార్గం.

English summary

5 Ways To Use Mustard Oil For Skin Care

Very few of us have a grandmother who keeps telling us stories of the secret home ingredients to enhance our beauty. If you are lucky to have one such granny, then it is high time you should stop ignoring her advises and listen to her seriously.
Story first published:Sunday, July 15, 2018, 11:37 [IST]
Desktop Bottom Promotion