For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక మంచి ఫేస్ వాష్ ఉపయోగించి ముఖం కడుక్కోవడం వలన ఒనగూరే ఆరు ప్రయోజనాలు!

ఒక మంచి ఫేస్ వాష్ ఉపయోగించి ముఖం కడుక్కోవడం వలన ఒనగూరే ఆరు ప్రయోజనాలు!

|

మనం ప్రతి రోజు ఉదయం లేవగానే ముఖం కడుక్కోవడంతోనే మన రోజును ప్రారంభిస్తాం. ఒక మంచి స్నానం, ఒక కప్పు వెచ్చని కాఫీ / టీ, మరియు ఒక అద్భుతమైన అల్పాహారం ఏదైనా సరే, దాని తరువాతే వస్తాయి.. కానీ మీ అందరికి మేమొక ప్రశ్న వేస్తున్నాం. నిజంగానే మీరంతా మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడంపై శ్రద్ధ కనబరుస్తున్నారా?

మీ అందరికి యవ్వనంతో మిలమిల మెరిసే ఆరోగ్యకరమైన చర్మం సొంతమవ్వాలంటే కనుక, ఒక పద్ధతి ప్రకారం ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవలసి ఉంటుంది. మీరు దీనిని పాటించకపోతే కనుక, మీకు తెలియకుండానే మీ చర్మానికి నష్టం కలిగించిన వారవుతారు.

సున్నితమైన చర్మం ఉన్న వ్యక్తులకు, ముఖం కడుక్కునేటప్పుడు, చర్మానికి కొంచెం అసౌకర్యం కలుగవచ్చు. దీనిని అరికట్టేందుకు ఒక ఉపాయం ఉంది. ఇంట్లో దొరికే పదార్ధాలతో తయారు చేసుకునే వివధ రకాల సహజమయిన పేస్ వాష్ లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఎటువంటి రసాయనాలు కలిగి ఉండని ఈ పదార్ధాలను, మీ చర్మ తత్వాన్ని అనుసరించి తయారు చేయవచ్చు.

6 Benefits Of Using A Face Wash For Clean Face

మన ముఖ చర్మం కాలుష్యం, ధూళి,దుమ్ము , సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాలు మొదలైన వాటి ప్రభావానికి లోనవుతుంది కనుక తగిన శ్రద్ధ తీసుకోకపోతే, అకాల వయసు మీద పడిన లక్షణాలు కనపడటం, ముడుతలు, నల్లని వలయాలు, బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్, చర్మం పొడిబారడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి.

కనుక , చర్మం సంరక్షణలో మొదటి అడుగైన ముఖం కడుక్కోవడం అనే పనిని అత్యంత శ్రద్ధ వహించి చేయాలి. నేడు, ఈ వ్యాసం ద్వారా , ఒక మంచి ఫేస్వాష్ ను ఉపయోగించి ముఖాన్ని కడుక్కోవటం వలన కలిగే ఆరు ప్రయోజనాలను వివరిస్తున్నాము. చదివేయండి ఇక!

ఒక మంచి ఫేస్ వాష్ ఉపయోగించి ముఖం కడుక్కోవడం వలన ఒనగూరే ఆరు ప్రయోజనాలు:

1. ముఖంపై పేరుకున్న మలినాలని తొలగిస్తుంది:

1. ముఖంపై పేరుకున్న మలినాలని తొలగిస్తుంది:

ప్రతి రోజు ముఖం కాలుష్యం, ధూళి, చెమట వంటి వివిధ మలినాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి, 8-9 గంటల ఇంటి బయట గడిపిన తర్వాత, మీ చర్మం యొక్క పరిస్థితిని ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి, ఉత్త నీటితో మాత్రమే కాక, మంచి పేస్ వాష్ ను కూడా ఉపయోగించి ముఖాన్ని కడుక్కుంటే, నూనె, ధూళి మరియు ఇతర కాలుష్య పదార్ధాలు మన ముఖంపై నుండి తొలగిపోతాయి.

 2. చర్మం తేమగా ఉంచడానికి సహాయపడుతుంది:

2. చర్మం తేమగా ఉంచడానికి సహాయపడుతుంది:

క్రమం తప్పకుండా చర్మాన్ని సరిగా శుభ్రపరచుకోడం వలన చర్మం యొక్క pH స్థాయిని సమతులంగా ఉండి, సహాయపడుతుంది, మృదువైన మరియు యవ్వన కాంతులతో మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. పేస్ వాష్ మీ ముఖం పై పేరుకున్న మృతచర్మకణాలను తొలగించడానికి సహాయపడుతుంది. అప్పుడు మీ ముఖం తేమ మరియు ఇతర ఉత్పత్తులను గ్రహించడానికి సంసిద్ధమవుతుంది..

 ౩. మృతచర్మకణాలను తొలగించడానికి సహాయపడుతుంది:

౩. మృతచర్మకణాలను తొలగించడానికి సహాయపడుతుంది:

ఫేస్ వాష్ కేవలం చర్మం పైన పేరుకున్నజిడ్డు మరియు ధూళిని మాత్రమే కాక, మృతచర్మకణాలను కూడా తొలగిస్తుంది.దీని వలన చర్మం యొక్క తాజా పొర బయటపడి , ముఖం చూడటానికి మృదువుగా, యవ్వన కాంతితో మెరుస్తుంది.

4. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది:

4. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది:

ముఖ చర్మాన్ని మర్దన చేసుకోవడం మరియు కడుక్కోవడం వలన, మీ ముఖంలో రక్త ప్రసరణ పెరిగి, కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. ఇది మనకు విశ్రాంతిని చేకూరుస్త్రుంది. కనుక మీ చర్మంను గ్రాన్యులేటెడ్ ఫేస్ వాష్ తో మర్దన చేసుకుని,కడుక్కుంటే తాజాదనం మరియు మైమరపించే మెరుపు మీ సొంతమవుతాయి.

5. చర్మాన్ని యవ్వనవంతంగా మారుస్తుంది :

5. చర్మాన్ని యవ్వనవంతంగా మారుస్తుంది :

మృతచర్మకణాల తొలగింపు వలన బయటపడ్డ నూతన చర్మ కణాలు ఊపిరి తీసుకోగాలవు కనుక , మీ చర్మం తేమతో, తాజాగా,యవ్వనంగా కనిపిస్తుంది. వృద్ధాప్య సంకేతాలను మనం ఆపలేము కానీ ఖచ్చితంగా ఆలస్యం చేయగలము. కనుక రోజు మీ ముఖం కడుక్కుని, మర్దన చేసుకోండి.

6. చర్మ సంరక్షణ ఉత్పత్తులు మెరుగ్గా చర్మంలోనికి శోషించుకోబడతాయి:

6. చర్మ సంరక్షణ ఉత్పత్తులు మెరుగ్గా చర్మంలోనికి శోషించుకోబడతాయి:

మీరు యాంటీ ఏజింగ్ క్రీమ్ వాడేతట్లయితే, తప్పనిసరిగా పడుకోబోయే ముందు ముఖాన్ని కడుక్కుని రాసుకోవాలి. అలా అయితేనే చర్మ సంరక్షణ ఉత్పత్తులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. కనుక రాత్రి పడుకోబోయే ముందు మరియు ఉదయం నిద్ర లేచాక మీ ముఖం తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి.రాత్రి పూట మీ చర్మం మ్రుతకనాలను బాగుచేయడం లేదా తొలగించడంలో నిమగ్నమై ఉంటుంది. కనుక వాటిని తప్పక లేవగానే తొలగించడానికి ముఖం కడుక్కోవాలి.

English summary

6 Benefits Of Using A Face Wash For Clean Face

Our face is exposed to pollution, dust, grime, UV rays of the sun, etc., and it really needs a lot of attention. Well, to attain a younger-looking, healthy and clean face, you need to follow a good face washing routine. If you do not know how to do it right, then you can actually cause harm to your skin.
Desktop Bottom Promotion