For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయాణంలో ఉన్నప్పుడు పాటించవలసిన బ్యూటీ టిప్స్

ప్రయాణంలో ఉన్నప్పుడు పాటించవలసిన బ్యూటీ టిప్స్

|

వెకేషన్ ను ముగించుకుని ఇంటికి వస్తున్నా లేదా హాలిడే కోసం లేదా ఏదైనా బిజినెస్ ట్రిప్ కోసం మీరు ప్రయాణిస్తున్నా ఆ ప్రయాణపు అలసట మీ చర్మంపై కనిపిస్తుంది. ముఖ్యంగా, విమానాల్లో దూర ప్రయాణం చేసేవారు చర్మసంరక్షణకి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉష్ణోగ్రతలతో మార్పులు, ఆల్టిట్యుడ్, వాతావరణం అలాగే చర్మంలో తేమ అలాగే హైడ్రేషన్ తగ్గిపోవడం వంటివి చర్మాన్ని డ్రై గా అలాగే డల్ గా మారుస్తాయి.

7 Beauty Tips That Will Help You While Travelling

డెస్టినేషన్ కు చేరగానే అలసిన చర్మంతో మీరు వింతజీవిలా కనిపించనవసరం లేదు కదా? కాబట్టి, ఈ రోజు ఈ ఆర్టికల్ లో 8 చర్మసంరక్షణ చిట్కాలను తెలియచేస్తున్నాము. ఇవి మీ చర్మాన్ని తాజాగా అలాగే కాంతివంతంగా ఉంచుతాయి.

ఎక్కువసేపు ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రయాణపు అలసట వలన ఉబ్బిన కళ్ళు, అలాగే డ్రై త్రోట్ వంటి సమస్యల దర్శనమిస్తాయి. ఈ సమస్యలను అందరూ ఎదుర్కొంటారు. వీటి విషయంలో ఏమీ చేయలేమని అనుకోనవసరం లేదు. వీటికి కూడా పరిష్కారాలున్నాయి. అదే విధంగా చర్మ సంరక్షణ గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి.

కాబట్టి, ఇప్పుడు 8 ట్రావెలింగ్ రోటీన్స్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. వీటిని పాటించడం ద్వారా మీరు ఫ్రెష్ గా అలాగే అందంగా మారవచ్చు.

వీటిని పరిశీలించండి మరి:

1. చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం:

1. చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం:

చర్మాన్ని మరింత అందంగా మార్చేందుకు ఎక్స్ఫోలియేషన్ అనే ప్రొసీజర్ ను పాటించి తీరాలి. డెడ్ స్కిన్ సెల్స్ అనేవి చర్మాన్ని డల్ గా అలాగే నిస్తేజంగా మారుస్తాయి. కాబట్టి, ప్రయాణానికి ముందు చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేసుకోవాలి. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోగానే చర్మం సహజంగానే కాంతిని సంతరించుకుంటుంది. క్రీమ్స్ తో పాటు మాయిశ్చరైజర్స్ ను గ్రహిస్తుంది. చర్మం సరిగ్గా మాయిశ్చరైజ్ అవగానే మీ ముఖం కళకళలాడటం ప్రారంభిస్తుంది.

2. చర్మాన్ని హైడ్రేట్ చేయండి:

2. చర్మాన్ని హైడ్రేట్ చేయండి:

హైడ్రేట్ అయిన చర్మం తాజాగా అలాగే అందంగా మారుతుంది. కాబట్టి, నీటిని ఎక్కువగా తీసుకోండి. శరీరాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేయడం వలన చర్మం సహజంగా అందంగా తయారవుతుంది. కొబ్బరి నీటిలో విటమిన్స్ తో పాటు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి అలాగే శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరానికి తగినన్ని నీళ్లను అందించడం ద్వారా విమాన ప్రయాణాలలో పొడిబారిన చర్మం సమస్య నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. కాఫీ మరియు సోడాల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. నీళ్లను ఎక్కువగా తీసుకోవడం అలాగే కొబ్బరి నీళ్లను తాగడం వలన చర్మం హైడ్రేట్ అవుతుంది.

3. ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తీసుకోండి:

3. ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తీసుకోండి:

అనారోగ్యకరమైన స్నాక్స్ ను దూరంగా ఉంచండి. ఇవి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అలాగే చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. బ్లూ బెర్రీస్, డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ ను తీసుకోవడం ద్వారా ఎనర్జీతో పాటు శరీరానికి కావలసినంత ఎసెన్షియల్ విటమిన్స్ లభిస్తాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తీసుకోవడం వలన తక్కువగా అలసటకు గురవుతారు. ఎందుకంటే, ఈ ఫుడ్స్ ద్వారా మీ శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.

4. విశ్రాంతి తప్పనిసరి:

4. విశ్రాంతి తప్పనిసరి:

లాంగ్ జర్నీస్ సమయంలో సాధారణంగా బుక్స్ ని చదవడం, లేదా ఏదైనా మూవీను చూడడాన్ని ప్రిఫర్ చేస్తారు. ఇవన్నీ అలసటను మరింత పెంచుతాయి. వీటికి కూడా మధ్య మధ్య విరామాన్ని ఇవ్వాలి. కళ్ళు అలసటకు గురవకుండా చూసుకోవాలి. లేదంటే, కంటి కింద బ్యాగ్స్ ఏర్పడవచ్చు.

కాబట్టి, రిలాక్సేషన్ కు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. కళ్ళను మూసుకుని మెడిటేట్ చేయండి. వార్మ్ బ్లాంకెట్, సాఫ్ట్ పిల్లో, స్లీప్ మాస్క్, హెడ్ ఫోన్స్ తో పాటు మంచి మ్యూజిక్ కలక్షన్ ను వెంట తీసుకెళ్లండి. మంచి రిలాక్సింగ్ మ్యూజిక్ అనేది మీకు విశ్రాంతినిస్తుంది. మీరు ల్యాండ్ అయ్యే సమయానికి మీరు మరింత ఫ్రెష్ గా ఉంటారు.

5. హెయిర్ ఒత్తుగా కనిపించేటట్టు:

5. హెయిర్ ఒత్తుగా కనిపించేటట్టు:

లాంగ్ జర్నీస్ సమయంలో ముఖ్యంగా విమాన ప్రయాణాలలో జుట్టు ఫ్లాట్ గా కనిపించవచ్చు. కాబట్టి, హెయిర్ ఒత్తుగా కనిపించే ప్రోడక్ట్స్ ని వాడండి. హెయిర్ ను వాష్ చేసిన తరువాత ఈ ప్రోడక్ట్స్ ని అప్లై చేయండి. మీరు విమానంలోకి చేరగానే, పోనీటెయిల్ లా హెయిర్ ని టై చేయండి, ల్యాండ్ అవగానే లూజ్ హెయిర్ గా మార్చండి. ఇలా చేయడం ద్వారా హెయిర్ ఒత్తుగా కనిపిస్తుంది. మీరు అందంగా కనిపిస్తారు.

6. మెరిసే చర్మం:

6. మెరిసే చర్మం:

ఎక్కువ సేపు ప్రయాణించడం వలన కచ్చితంగా అలసటకు గురవుతారు. ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అవుతుంది. ఈ పరిస్థితిని మీరు మేకప్ తో కవర్ చేయవచ్చు. చీక్స్ వద్ద హైలైటర్ పాయింట్స్ ను అప్లై చేయండి. అలాగే, క్యుపైడ్స్ బో వద్ద, కంటి కింద అలాగే కంటిలోని లోపల కార్నర్స్ ను కూడా ఫోకస్ చేయండి. ఇలా చేస్తే ముఖం ఇన్స్టెంట్ గా కాంతిని సంతరించుకుంటుంది. చర్మం మెరుస్తుంది.

7. అలసిన కళ్ళ సమస్య నుంచి విముక్తి పొందండి:

7. అలసిన కళ్ళ సమస్య నుంచి విముక్తి పొందండి:

లాంగ్ జర్నీస్ వలన కళ్ళు అలసటకు గురవడం సహజం. కాబట్టి, ఈ సిట్యువేషన్ కు మీరు ముందుగానే సిద్ధంగా ఉండాలి. ఐ డ్రాప్ ను మీరు క్యారీ చేయాలి. కళ్ళలో రెండు చుక్కలను వేసుకోండి. ఇలా రెడ్ ఐ ఎఫెక్ట్ తొలగిపోతుంది. కళ్ళు కాంతివంతంగా మారతాయి.

అలాగే, ప్లేన్ ను వదిలే ముందు వాటర్ లైన్ వద్ద లైట్ టోన్డ్ ఐ పెన్సిల్ ను వాడవచ్చు. దీని వలన కళ్ళు కాంతివంతంగా మారతాయి. పఫీ ఐస్ సమస్యను తొలగించేందుకు ఐ జెల్ మాస్క్ ను వాడండి.

English summary

7 Beauty Tips That Will Help You While Travelling

Exfoliation is the initial step for a beautiful skin. Dead skin cells make the face look dull and lifeless. So always make sure that you exfoliate your skin before you travel. Hydrated skin looks fresh and nice, so always make sure that you drink plenty of water. Avoid eating unhealthy snacks. It's not good for the body and the skin.
Story first published:Saturday, July 14, 2018, 12:02 [IST]
Desktop Bottom Promotion