For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెరిసే చర్మం కోసం నిమ్మతో కూడిన అందాల రహస్యాలు

|

మృదువైన మెరిసే చర్మం కావాలని అందరికీ ఉంటుంది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచటమే కాదు, ఆరోగ్యం పట్ల, ఆనందం పట్ల మీ శ్రద్ధ గురించి చాలా చెప్తుంది. మెరిసే చర్మం కోసం ఆరోగ్యకరమైన ఆహారం, సరైన విశ్రాంతి, నిద్ర, నీళ్ళు తాగటం ముఖ్యం కానీ, అందం విషయంలో నిమ్మకాయ పోషించే పాత్రను కూడా మర్చిపోలేము.

ఫేస్ మాస్కుల్లో, గోళ్ళ మాయిశ్చరైజర్ గా, పాదాల స్క్రబ్స్ లో ఇలా అన్ని బ్యూటీ ఉత్పత్తుల్లో వాడే నిమ్మ లేకుండా ఒక్క ఉత్పత్తి ఉండదంటే ఆశ్చర్యం లేదు.

10 Lemon Infused Beauty Hacks For Glowing Skin

సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయలు సులభంగా,చవకగా దొరుకుతాయి. చర్మసమస్యలైన టానింగ్, బ్లాక్ హెడ్స్, మొటిమలు, చారలు అన్నిటినీ తగ్గించగలిగే శక్తి నిమ్మకి ఉంది. ఈ ఆర్టికల్ లో నిమ్మకాయ ద్వారా కలిగే అలాంటి 10 లాభాలు ఏమిటో, వాటిని మీరు ఎలా వాడుకోవచ్చో వివరించబడింది. చదవండి.

1.నిమ్మ బాడీ స్క్రబ్

1.నిమ్మ బాడీ స్క్రబ్

దీన్ని తయారుచేయటానికి మీరు చేయాల్సిందల్లా ఒకటిన్నర కప్పు పంచదారను తీసుకుని, అరకప్పు ఆలివ్ నూనె, ఒక చెంచా తేనెతో కలపండి.అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుని ఈ మిశ్రమానికి కలపండి. మొత్తం శరీరమంతా దీనితో 5 నుంచి 10 నిమిషాలు రుద్దండి. ఈ స్క్రబ్ ను మామూలుగా కడిగేసి, వంటినిండా మాయిశ్చరైజర్ రాసుకోండి.

2.నిమ్మతో ముఖంలో జీవం

2.నిమ్మతో ముఖంలో జీవం

గుడ్డు తెల్లసొనను ఒక చెంచా నిమ్మరసంతో కలిపి, రెండు చెంచాల పెరుగును కూడా అందులో కలపండి. ఈ మిశ్రమాన్ని మొహానికి పట్టించి అరగంటపాటు అలా వదిలేయండి. కంటి చుట్టూ తగలకుండా,ప్రభావం పడకుండా చూసుకోండి. ఈ అరగంటలో మీకు గట్టిగా దగ్గరకి చర్మం లాగబడినట్లు అన్పిస్తుంది.అది సహజమే, మీ సాగిన చర్మం ఇప్పుడు దగ్గరకి లాగబడి,బలంగా మారుతోంది. నీళ్లతో కడిగేయండి. ఈ మాస్క్ ను ప్రతిరోజూ ప్రయత్నించటం వలన వయస్సు మీరే లక్షణాలు మీ మొహంపై నుండి తొలగిపోయి,ఇంకా కొన్నేళ్ళు యవ్వనంతోనే కన్పిస్తారు.

3.నిమ్మ ఫుట్ స్క్రబ్

3.నిమ్మ ఫుట్ స్క్రబ్

కప్పులో 2/3 వంతుల తెల్ల వెనిగర్ ను ఒక బౌల్ లో తీసుకోండి. కప్పులో 1/5వంతు కోకోనట్ బటర్ ను దీనిలో కలపండి. ఈ మిశ్రమం తయారయ్యాక, ఒక చెంచా చక్కెర, పాలీసార్బేట్ వేయండి. పాలీసార్బేట్ 80 ని ఆహారం, కాస్మెటిక్ పరిశ్రమల్లో ఎమల్సిఫైయర్ (పదార్థాలని చిక్కగా మార్చే ప్రక్రియలో) గా వాడతారు. అది పసుపుపచ్చ రంగులో జారుడుగా ఉంటుంది. అందుకని ఈ మిశ్రమం సరిగ్గా కన్పించటానికి, 3 నుంచి 4 చుక్కల ఆకుపచ్చని రంగుని, అంతే పరిమాణంలో పెప్పర్ మింట్ నూనె చుక్కలను కూడా వేయండి. ఇవన్నీ సరిగ్గా చక్కగా కలిపాక మీ ఫుట్ స్క్రబ్ వాడటానికి తయారవుతుంది.

4. నిమ్మ- చర్మకాంతిని పెంచే ఫేస్ మాస్క్

4. నిమ్మ- చర్మకాంతిని పెంచే ఫేస్ మాస్క్

ఒక చెంచా పెరుగును ఒక చెంచా తేనెతో కలపండి. చెంచా నిమ్మరసాన్ని దీనికి కలిపి మీ మొహానికి పట్టించండి. మెడకి, చేతులకి కూడా రాయవచ్చు. ఈ మాస్క్ ను 15 నిమిషాల పాటు ఉంచుకోండి, తర్వాత సరిగ్గా కడుక్కొని, మాయిశ్చరైజర్ రాసుకోండి.

5. నిమ్మ తేనె బ్లాక్ హెడ్ రిమూవర్

5. నిమ్మ తేనె బ్లాక్ హెడ్ రిమూవర్

దీనికోసం మీరు చేయాల్సిందల్లా నిమ్మకాయను మధ్యకి నాలుగుచెక్కలుగా కోయటం. ఈ చెక్కలను తేనెలో ముంచి మీ ముక్కు చివర్ల, బ్లాక్ హెడ్స్ వచ్చే చోట రుద్దండి. ఇలా 5 నిమిషాలపాటు చేసాక, గోరువెచ్చని నీటిలో ముంచిన గుడ్డతో కడిగేయండి. సాధారణంగా వారానికి మూడుసార్లు ఇలా చేయాలి.

6.నిమ్మ దోసకాయ టోనర్

6.నిమ్మ దోసకాయ టోనర్

ఇందులో మీరు అరకప్పు దోసకాయ ముక్కలను, మూడు కప్పుల చల్లనీరును, పావుకప్పు నిమ్మకాయ ముక్కలను, రెండు చెంచాల నిమ్మరసాన్ని తీసుకోవాలి. వీటన్నిటినీ మిక్సీలో వేసి మిక్సీ పట్టండి. దీన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయవచ్చు. వాడేటప్పుడు ఒక కాటన్ దూదిని తీసుకుని ఈ మిశ్రమంలో ముంచి ఫేస్ టోనర్ గా వాడవచ్చు. ఒకసారి చేసిన మిశ్రమాన్ని వారం వరకు వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ట్యాన్ కు గురైన లేదా నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.

7.నిమ్మ స్ట్రెచ్ మార్క్ రిమూవర్

7.నిమ్మ స్ట్రెచ్ మార్క్ రిమూవర్

స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోటను బాగా కడిగి, మృదువైన పొడిగుడ్డతో నెమ్మదిగా వత్తండి. నిమ్మకాయను మధ్యలోకి కోసి,రసాన్ని తీయండి. ఈ రసాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట రాసి గుండ్రంగా మర్దన చేయండి. అలా 5-10 నిమిషాలు వదిలేసి, తర్వాత కడిగేయండి.

English summary

7 Lemon Infused Beauty Hacks For Glowing Skin

A smooth, glowing skin is something that everyone wants. It not just boosts your self-confidence but also speaks of volumes about your generic health and well-being. Lemon is a magical beauty product that gives you immense benefits and can be used in face masks, moisturisers, or even scrubs.Lemon is a magical beauty product that gives you immense benefits
Desktop Bottom Promotion