For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొజేషియా చికిత్సలో ఉపయోగపడే ఏడు ప్రకృతి సహజ పదార్థాలు

రొజేషియా చికిత్సలో ఉపయోగపడే ఏడు ప్రకృతి సహజ పదార్థాలు

|

కవులు ఆడవారిని వర్ణించినపుడు పాలబుగ్గల పడుచు అని వర్ణిస్తారు. ముక్కు ముఖం తీరుతో పాటుగా, మనం చర్మ ఆరోగ్యం కూడా మన అందాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ కొన్నిరకాల చర్మ సమస్యలు, మన చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి , తద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఇటీవలి అధ్యయనాలు గమనిస్తే, మన దేశంలో పది మిలియన్ల కన్నా ఎక్కువ మంది ప్రజలు రొజేషియా వ్యాధి కలిగి ఉన్నారు. ఇది ఒక చర్మ సమస్య. దీని వలన చర్మంపై ఎరుపుదనం, వాపు మరియు దురద కలుగుతాయి. ఇది మన ముఖంపై, ముక్కు మరియు చెక్కిళ్ళకు సోకుతుంది.

దీర్ఘకాలిక చర్మ అసౌకర్యాన్ని కలిగించే ఈ వ్యాధి, వ్యాధిగ్రస్తులను ఇబ్బంది మరియు విస్మయానికి గురి చేస్తుంది.

అయితే , శుభవార్త ఏమిటంటే, ఈ వ్యాధిని కొన్ని గృహవైద్య చిట్కాలు ద్వారా సహజ పద్ధతుల ద్వారా స్వాంతన కలిగేట్టు చేయవచ్చు.

7 Remedies You Can Use To Naturally Treat Rosacea

దశాబ్దాలుగా, ప్రపంచ వ్యాప్తంగా మహిళలు వివిధ సమర్ధవంతమైన తరుణోపాయాలతో, అద్భుతమైన ప్రయోజనాలు పొందారు. ఈ చిట్కాల ద్వారా చర్మంపై ఎరుపుదనం, వాపు మరియు దురద నుండి ఉపశమనం పొందారు.

అటువంటి కొన్ని సహజమైన చిట్కాలను, మీకోసం రొజేషియా నుండి ఉపశమనం పొందడం కొరకు ,మేమిక్కడ తెలియజేస్తున్నాం. చదివేయండి ఇక!

గమనిక: ఏ చిట్కానైనా మీ ముఖంపై ప్రయోగించే ముందుగా, అది మీకు నప్పుతుందో, లేదో ముందుగా చెవి వెనుక చర్మంపై అమలుపరచి చూడండి.

 1. ఓట్ మీల్

1. ఓట్ మీల్

యాంటీ-ఇన్ఫ్లమేటరీ తత్వాలకు ప్రసిద్ధి కలిగి ఉన్నందున, ఓట్ మీల్, రొజేషియా లక్షణాల చికిత్సకు అద్భుతమైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు.

వాడే విధానం:

ఒక గిన్నెలో, ఒక టీ స్పూన్ ఉడికించిన ఓట్ మీల్ కు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపండి. బాగా కలిపిన తరువాత తయారైన ముద్దను ప్రభావిత ప్రదేశంలో రాసుకోండి. పది నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

2. అవిసె గింజల నూనె:

2. అవిసె గింజల నూనె:

అవిసె గింజల నూనెలో, చర్మం పై దురద, మంట వాపులను తగ్గించే కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.

వాడే విధానం:

అర టీ స్పూన్ ఆలివ్ నూనెలో, 3-4 చుక్కల అవిసె గింజల నూనె కలపండి. ప్రభావిత ప్రదేశంలో ఈ నూనెల మిశ్రమంతో మర్దన చేసుకోండి. పది- పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

3. లికోరిస్ లేదా అతిమధురం:

3. లికోరిస్ లేదా అతిమధురం:

లికోరిస్ లో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ప్రభావవంతంగా రొజేషియా వలన కలిగే ఎర్రదనం మరియు వాపును తగ్గిస్తాయి.

వాడే విధానం:

చెరి ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ మరియు కలబంద గుజ్జులలో , అర టీ స్పూన్ అతిమధురంపొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో, దలసరిగా రాసుకుని పది పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

4. చామోమైల్ టీ:

4. చామోమైల్ టీ:

చామోమైల్ టీలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ తత్వాలు మంచి నివారిణిగా పనిచేయడానికి దోహదపడుతుంది. దీనిని వాడితే ముఖంపై ఎర్రదనం మరియు మంట నుండి విశ్రాంతి లభిస్తుంది.

వాడే విధానం:

ఒక కప్పు పంచదార కలిపని చామోమైల్ టీ తయారు చేయండి. దీనిలో ఒక దూది ఉండను ముంచి, ప్రభావిత ప్రదేశంలో అద్దండి. తరువాత ఇది చర్మంలో ఇంకేదాక సుమారుగా పది పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. లావెండర్ తైలం:

5. లావెండర్ తైలం:

లావెండర్ తైలంలో అద్భుతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇమిడి ఉన్నాయి. ఇవి రొజేషియా లక్షణాలైన దురద, మంట, వాపు మరియు ఎర్రదనం నుండి ఉపశమనం ఇస్తాయి.

వాడే విధానం:

అర టీ స్పూన్ బాదం నూనెలో, 3-4 చుక్కల లావెండర్ తైలం కలపండి. ప్రభావిత ప్రదేశంలో ఈ నూనెతో మర్దన చేసుకోండి. పది నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

6. గ్రీన్ టీ:

6. గ్రీన్ టీ:

అనేకమైన చర్మ సౌందర్య ప్రయోజనాలను కలిగించేదిగా,గ్రీన్ టీ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీనిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ-ఇన్ఫ్లమేటరీ తత్వాలు రొజేషియా లక్షణాలు నుండి ఉపశమనం కలిగించి, చర్మ pH ను సమతుల్యం చేస్తాయి.

వాడే విధానం:

ఒక కప్పు పంచదార కలిపని గ్రీన్ టీ తయారు చేయండి. దీనినిచల్లారనివ్వాలి. దీనిలో ఒక దూది ఉండను ముంచి, ప్రభావిత ప్రదేశంలో అద్దండి. పది నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

7. యాపిల్ సిడర్ వెనిగర్:

7. యాపిల్ సిడర్ వెనిగర్:

యాపిల్ సిడర్ వెనిగర్లో యాస్ట్రిజెంట్ లక్షణాలు మెండుగా ఉన్నందున, దీనిని శతాబ్దాలుగా రొజేషియా వలన కలిగే చర్మ సమస్యల నివారణకు వాడుతున్నారు. దీనిని రాసుకుంటే ఎర్రదనం మాయమయ్యి, దురద తగ్గుతుంది.

వాడే విధానం:

ఒక టీ స్పూన్ డిస్టిల్డ్ నీటిలో, 3-4 చుక్కల యాపిల్ సిడర్ వెనిగర్ కలపండి. దీనిలో ఒక దూది ఉండను ముంచి, ప్రభావిత ప్రదేశంలో అద్దండి. ఐదు నిమిషాల పాటు ఆరినాక, చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

విసుగు పుట్టించే రొజేషియా లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు, పైన తెలిపిన చిట్కాలను పాటించి చూడండి. ఇవి సురక్షితమైనవి మాత్రమే కాదు, ప్రభావవంతమైనవి కూడా.ఇవి వ్యాధి లక్షణాలను తగ్గుముఖం పట్టించి, చర్మం తేటుగా కనపడేటట్టు చేస్తాయి.

English summary

7 Remedies You Can Use To Naturally Treat Rosacea

As per a recent study, there are more than 10 million people in the country who suffer from rosacea. This is a skin condition that causes redness, swelling and itchiness on the skin. It mostly affects the nose and cheek area on the face.
Desktop Bottom Promotion