For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిలియా చర్మ సంబంధిత సమస్య నుండి ఉపశమనం కలిగించే 7 సహజసిద్దమైన పద్దతులు

మిలియా చర్మ సంబంధిత సమస్య నుండి ఉపశమనం కలిగించే 7 సహజసిద్దమైన పద్దతులు

|

మిలియా చర్మ సంబంధిత సమస్య, చర్మం మీద కళ్ళు, ముక్కు మరియు బుగ్గల క్రింద భాగంలో చిన్నపాటి తెల్లని గడ్డల రూపంలో అభివృద్ధి చెందే రకానికి చెందిన ఒక సాధారణ చర్మ సమస్య. అనేకమంది ఇది కేవలం పిల్లలలోనే కనిపిస్తుంటుంది అని అపోహ పడుతుంటారు. కానీ ఇది అబద్దం, ఈ చర్మ సమస్యకు వయసు భేదం, లింగ బేధం లేదు. ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం కాలుష్యం, చర్మం నందు మృతకణాల మరియు మలినాల పెరుగుదల.

ఈ తెల్లటి గడ్డలను, మిలియం సిస్ట్స్(తిత్తి)గా వ్యవహరిస్తారు. మరియు ఇవి దురద లేదా నొప్పిని కలిగించకపోయినా అసౌకర్యానికి మూలంగా ఉంటుంది. వీటిని మేకప్ తో దాచడం కూడా కష్టమే. ఈ మిలియా సమస్య కారణంగా అనేకమంది, నలుగురిలో కాస్త ఇబ్బందికి గురవుతూ ఉంటారు.

7 Useful Natural Remedies To Get Rid Of Milia

కెరటిన్ అనే పదార్ధం చర్మంలో చిక్కుకున్నప్పుడు ఈ గడ్డలు ఏర్పడతాయి. రంధ్రాలలో చనిపోయిన మృత కణాలు మరియు మలిన పదార్ధాలతో కూడి ఈ చర్మ సమస్య తలెత్తవచ్చు.

ఈ చర్మ సమస్యని రూపుమాపే క్రమంలో కొన్ని సహజసిద్దమైన మార్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ, మనం అత్యంత సమర్థనీయమైన సహజ నివారణా పద్దతుల గురించి తెలుసుకోబోతున్నాము. ఇవి ఈ మిలియా సమస్యను వదిలించే క్రమంలో భాగంగా ఎంతగానో సహాయపడుతాయి.

మిలియా చర్మ సంబంధిత సమస్య నుండి ఉపశమనం కలిగించే 7 సహజసిద్దమైన పద్దతులు

1. కాస్టర్ ఆయిల్

1. కాస్టర్ ఆయిల్

రైసినస్ కమ్యూనిస్ అనే మొక్క యొక్క విత్తనాలు నుండి ఈ కాస్టర్ ఆయిల్ సంగ్రహిస్తారు. కాస్టర్ ఆయిల్ వైద్య లక్షణాలతో కూడుకుని ఉన్న సహజ సిద్దమైన చర్మ సంరక్షణ పదార్ధంగా చెప్పబడుతున్నది. ఈ లక్షణాలు మిలియా వంటి చర్మ సంబంధ సమస్యలను అడ్డుకునేందుకు సహాయపడతాయి.

ఎలా ఉపయోగించాలి:

కాస్టర్ ఆయిల్లో ఒక కాటన్ బాల్ ముంచి మిలియా ప్రభావిత ప్రాంతంలో సున్నితంగా మర్దన చేయాలి. 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

2. తేనె

2. తేనె

జీర్ణసంబంధ సమస్యల దగ్గర నుండి అనేక ఆరోగ్య సమస్యల నివారణా చికిత్సలో వినియోగించే తేనె, చర్మ సంబంధ సమస్యలకు కూడా అత్యంత ప్రభావశీలిగా పనిచేస్తుంది. గాయాలు తగిలినప్పుడు కూడా తేనెని వినియోగించవచ్చు. అదేవిధంగా మిలియా నివారణలో భాగంగా కూడా తేనె అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

సేంద్రీయ తేనెను కొద్దిగా తీసుకుని మిలియా ప్రభావిత ప్రాంతాలలో మర్దన చేయాలి, 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో సుతారంగా రుద్దుతూ శుభ్రపరచండి. మంచి ఫలితాలకోసం రోజులో కనీసం 2,3 సార్లు చేయవలసినదిగా సూచన.

3. ఆవిరి ఫేషియల్

3. ఆవిరి ఫేషియల్

ముఖం మీద ఆవిరిని పంపడం ద్వారా చనిపోయిన మృత కణాలను తొలగించడం మరియు చర్మ రంధ్రాల నుండి విష తుల్య పదార్ధాలను బయటకు తీయడం, ఒక గొప్ప మార్గంగా చెప్పబడింది. ఈ పద్దతి మిలియా చికిత్సలో ఎంతగానో సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

శుభ్రంగా ఉన్న టవల్ తీసుకొని వేడి నీటిలో పూర్తిగా ముంచి, అదనపు నీటిని పిండిన తర్వాత, మీ ముఖంపై ఉంచండి. 5-10 నిముషాల పాటు మీ ముఖం మీద అద్దుతూ ఉండండి. రోజులో కనీసం ఒకసారైనా ఈ పద్దతిని అనుసరించడం ద్వారా నెమ్మదిగా మిలియా తిత్తులు తగ్గుముఖం పడుతాయి.

4. గంధపు పొడి

4. గంధపు పొడి

చర్మాల్లో జిడ్డుతనాన్నితగ్గించి, రంధ్రాల నుండి మలినాలను తొలగించే సాంప్రదాయ చర్మ సంరక్షణ పదార్ధంగా గంధపు పొడి ఉంది. ఇది, మిలియా తిత్తులను వదిలించుకోవడానికి కూడా సహాయపడగలదు.

ఎలా ఉపయోగించాలి:

½ టీస్పూన్ గంధం పొడి మరియు రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుని మిశ్రమంగా చేసి, సమస్యాత్మక ప్రాంతంలో అప్లై చేయండి, 5-10 నిమిషాలు అలాగే ఉంచి, పొడిగా మారేంత వరకు ఉంచాలి. అవశేషాలను శుభ్రం చేయడానికి చల్లని నీటిని వినియోగించండి.

5. టీ ట్రీ-ఆయిల్

5. టీ ట్రీ-ఆయిల్

టీ ట్రీ-ఆయిల్, దాని బ్యాక్టీరియా హరించే తత్వాలతో మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో ఒక అద్భుతమైన చర్మ సంరక్షణ పదార్ధంగా అందుబాటులో ఉంది. ఇది చర్మంలోని నూనె ప్రభావాన్ని మరియు, మిలియా తిత్తులను తగ్గించుటలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

½ టీస్పూన్ ఆలివ్ నూనెతో టీ ట్రీ-ఆయిల్ 4-5 చుక్కలను కలిపి మిశ్రమంగా చేయండి. ఆ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ ముంచి, ప్రభావిత ప్రాంతంలోని సున్నితంగా మర్దన చేయండి. 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత అవశేషాలను తొలగించుటకు చల్లటి నీటితో శుభ్రపరచండి. వారానికి కనీసం రెండు సార్లు ఈ పద్దతిని అనుసరించడం ద్వారా, అద్భతమైన ఫలితాలను పొందవచ్చు.

6. దానిమ్మ తొక్క పొడి

6. దానిమ్మ తొక్క పొడి

దానిమ్మ తొక్క పొడి నందు సమృద్దిగా శక్తివంతమైన అనామ్లజనకాలు ఉంటాయి మరియు దీన్ని చర్మానికి ఉపయోగించడం ద్వారా, మిలియా లక్షణాలు నుండి ఉపశమనం ఇస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

1 టేబుల్ స్పూన్ దానిమ్మ తొక్క పొడిని 1 టీ స్పూన్ రోజ్ వాటర్లో కలిపి మిశ్రమంగా చేయండి. పేస్టులా వచ్చే వరకు కలపండి. చర్మానికి సున్నితంగా అప్లై చేశాక, 10 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి. చక్కని ఫలితాలకై వారంలో వీలైనన్ని మార్లు పాటించడం మంచిది.

7. కలబంద గుజ్జు

7. కలబంద గుజ్జు

కలబంద గుజ్జులో అనామ్లజనక సామర్ధ్యాలు మరియు శోథ నిరోధక లక్షణాలు ఉన్నకారణాన మిలియా వంటి చర్మ సంబంధిత సమస్య చికిత్సకు అసాధారణ పరిహారంగా చెప్పబడుతున్నది.

ఎలా ఉపయోగించాలి:

ఒక కలబంద మొక్క నుండి గుజ్జును బయటకు తీయండి, ప్రభావిత ప్రాంతం మీద సున్నితంగా మర్దన చేయండి. 15 నిముషాలు వదిలిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. సమర్థవంతమైన ఫలితాల కోసం రోజులో అనేకసార్లు పాటించండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య, సౌందర్య సంబంధిత విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ విలువైన అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

7 Useful Natural Remedies To Get Rid Of Milia

Milia is a common skin condition in which white bumps develop on the skin under the eyes, nose and cheeks. And contrary to common misbelief this skin condition does not just affect children but also adolescents and adults. The white bumps are also referred to as milium cysts and while they do not itch or cause discomfort, they can become a source of embarrassment and may be hard to conceal even with makeup.
Desktop Bottom Promotion