For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ ను రోజువారి బ్యూటీ రొటీన్ లో వాడటం వలన కలిగే ప్రయోజనాలు

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. చర్మ సంరక్షణకు ఇవి అత్యంత సహకారం అందిస్తాయి. చిన్నపాటి చర్మ సమస్యలను తగ్గించి చర్మానికి తగిన పోషణను అందించడానికి గ్రీన్ టీ ను ప్రపంచవ్యాప్తంగా వా

|

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. చర్మ సంరక్షణకు ఇవి అత్యంత సహకారం అందిస్తాయి. చిన్నపాటి చర్మ సమస్యలను తగ్గించి చర్మానికి తగిన పోషణను అందించడానికి గ్రీన్ టీ ను ప్రపంచవ్యాప్తంగా వాడటం జరుగుతోంది.

చర్మ సంరక్షణ ఎంజైమ్స్ తో పాటు ఫైటో కెమికల్స్ మరియు ఎమినో యాసిడ్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ సుగుణాల వలన గ్రీన్ టీ చర్మ సంరక్షణకు తోడ్పడే ముఖ్యమైన పదార్థంగా స్థానం సంపాదించింది.


గ్రీన్ టీ ను స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా వాడేందుకు అనేక మార్గాలున్నాయి. అయితే, గ్రీన్ టీ ద్వారా అత్యంత ప్రయోజనాన్ని పొందేందుకు ఒక విధానం మీకు అమితంగా తోడ్పడుతుంది. ఇప్పుడు, మనం గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ గురించి చర్చించుకోవాలి.

8 Benefits Of Using Green Tea Ice Cubes In Your Everyday Beauty Routine,

వీటిని తయారుచేసుకోవడం సులభం అలాగే రోజులో ఎప్పుడైనా వీటిని వాడవచ్చు. గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ చర్మస్థితిని మెరుగుపరుస్తాయి. అందువలన, వీటిని రోజువారి బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకోవాలి.

ఇక్కడ మనం గ్రీన్ టీను డైలీ బేసిస్ లో చర్మసంరక్షణకై ఉపయోగించేందుకుపాటించడం వలన పొందే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. అలసిన చర్మాన్ని ఉత్తేజపరుస్తుంది:

1. అలసిన చర్మాన్ని ఉత్తేజపరుస్తుంది:

నిద్రలేవగానే మీ చర్మం అలసటకు గురైందని గుర్తించారా? అలాగైతే, గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఇవి మీ చర్మానికి రిఫ్రెషింగ్ లుక్ ని ఇవ్వడంతో పాటు చర్మానికి డ్యూవీ గ్లో ను అందించేందుకు తోడ్పడతాయి. చర్మంపై గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ తో సున్నితంగా రబ్ చేసుకోండి. తద్వారా, అలసిన చర్మం నుంచి ఉపశమనం పొందండి.

2. ఫేషియల్ పఫీనెస్ ను తగ్గిస్తుంది:

2. ఫేషియల్ పఫీనెస్ ను తగ్గిస్తుంది:

పఫీ ఫేస్ తో మేల్కోవడం అనేది జీవితంలో అందరికీ ఎదో ఒక సమయంలో జరుగుతుంది. చర్మ సౌందర్యంపై పఫీనెస్ అనేది దుష్ప్రభావం చూపుతుంది. అయితే, గ్రీన్ టీ క్యూబ్స్ సహాయంతో ఈ సమస్య నుంచి మీరు తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ క్యూబ్స్ అనేవి ఫేస్ పఫీనెస్ ను తగ్గించడంతో పాటు తిరిగి ఆ సమస్య ఉత్పన్నమవకుండా కాపాడతాయి. గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ రెమెడీని పాటించడం ద్వారా ఫేస్ పఫీనెస్ సమస్య నుంచి సహజమైన రీతిలో ఉపశమనం పొందవచ్చు.

3. కంటి కింద వాపును తగ్గిస్తుంది:

3. కంటి కింద వాపును తగ్గిస్తుంది:

ఐస్ క్యూబ్స్ లో లభ్యమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కంటి కింద చర్మంపై దర్శనమిచ్చే పఫీనెస్ ను తొలగించేందుకు తోడ్పడతాయి. చర్మంలో వాటర్ రిటెన్షన్ జరగడం వలన ఈ పఫీనెస్ సమస్య తలెత్తుతుంది. కంటి కింద బ్యాగ్స్ ఉన్నట్టు అనిపిస్తే గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ రెమెడీని పాటించి రిలీఫ్ ను పొందండి.

4. ఇబ్బందికరమైన మొటిమల నుంచి ఉపశమనం:

4. ఇబ్బందికరమైన మొటిమల నుంచి ఉపశమనం:

గ్రీన్ టీ లో లభ్యమయ్యే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ద్వారా చర్మంపై దర్శనమిచ్చే ఇబ్బందికర మొటిమల నుంచి విముక్తి పొందవచ్చు. పోర్స్ క్లాగ్ అవటం వలన లేదా ఇన్ఫెక్షన్ వలన మొటిమలు ఏర్పడతాయి. వీటిని డీల్ చేయడం కష్టతరమే. అందువలన, గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ తో వీటిపై రుద్దడం ద్వారా ఇంఫ్లేమేషన్ తో పాటు రెడ్ నెస్ ను తగ్గించుకోవచ్చు. ఈ రెమెడీని వారంలో అనేకసార్లు పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలను గమనించగలుగుతారు.

5. ఓపెన్ స్కిన్ పోర్స్ చిన్నవిగా మారతాయి:

5. ఓపెన్ స్కిన్ పోర్స్ చిన్నవిగా మారతాయి:

చర్మంపై స్కిన్ పోర్స్ పెద్దవిగా ఉండడం వలన సౌందర్యం దెబ్బతింటుంది. కాస్మెటిక్స్ తో ఈ సమస్యను కనిపించకుండా చేయడం కూడా సాధ్యం కానిదే. అయితే, గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ ఈ సమస్య నుంచి మీకు రిలీఫ్ ని అందించేందుకు తోడ్పడతాయి. ఓపెన్ పోర్స్ సమస్యను ట్రీట్ చేయడానికి గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ తోడ్పడతాయి. ఈ ఐస్ క్యూబ్స్ అస్ట్రింజెంట్ నేచర్ కలిగి ఉండటం వలన ఇవి ఓపెన్ పోర్స్ ను ప్రభావవంతంగా చిన్నవిగా మార్చగలవు. తద్వారా, పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ మరియు మలినాలను తొలగించగలవు.

6. చర్మకాంతిని మెరుగుపరుస్తాయి:

6. చర్మకాంతిని మెరుగుపరుస్తాయి:

చర్మకాంతిపై అనేక ఫ్యాక్టర్స్ దుష్ప్రభావం చూపుతాయి. అందువలన, చర్మం కాంతివంతంగా కనిపించేందుకు అనేక బ్యూటీ ప్రోడక్ట్స్ పై మీరు ఆధారపడవలసి వస్తుంది. మరి సహజంగా చర్మ కాంతిని మెరుగుపరచుకునే అవకాశం ఉంటే ఎంత బాగుటుంది కదూ? గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ ను చర్మంపై రబ్ చేయడం వలన చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది.

7. యాక్నే బ్రేకవుట్స్ ని తగ్గిస్తుంది:

7. యాక్నే బ్రేకవుట్స్ ని తగ్గిస్తుంది:

మీ చర్మం యాక్నే బ్రేకవుట్స్ కి గురవుతోందా? అయితే, ఖరీదైన యాంటీ యాక్నే క్రీమ్స్ పై ఆధారపడే బదులు గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ ని ప్రయత్నించండి. ఈ ఐస్ క్యూబ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. యాక్నేకు దారితీసే బాక్టీరియాతో పోరాడుతాయి. తద్వారా, బ్రేకవుట్స్ సమస్యను తగ్గించేందుకు తోడ్పడతాయి.

8. డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తుంది:

8. డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తుంది:

ఇబ్బందులకు గురవుతున్నారు. నిద్రలేమి వలన ఫ్లూయిడ్ రిటెన్షన్ సమస్య ఎదురవడంతో ఇలా జరుగుతుంది. ఈ సమస్య అఫియరెన్స్ ను దెబ్బతీస్తుంది. అయితే, గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ ను తరచూ వాడటం ద్వారా డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఐస్ క్యూబ్స్ వలన చర్మానికి బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగవుతుంది. తద్వారా, డిస్కలరేషన్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఈపాటికి, రోజువారి స్కిన్ కేర్ రొటీన్ లో గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ ను భాగంగా చేసుకోవడం వలన ఎటువంటి సౌందర్య ప్రయోజనాలను పొందగలుగుతారో తెలుసుకునే ఉండుంటారు కదా? ఇప్పుడు, గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ ను ఏ విధంగా వాడాలో తెలియచేస్తాము. ఈ ప్రాసెస్ ని పాటించడం ద్వారా మీరు మీ చర్మ సౌందర్యాన్ని సహజమైన రీతిలో సంరక్షించుకోగలుగుతారు.

తయారు చేసే విధానం:

- ఒక కప్పుడు తీపిలేని గ్రీన్ టీ ను తయారుచేసుకోండి.

- ఫ్యాన్ కింద కాసేపు చల్లార్చండి.

- ఈ టీను ఐస్ ట్రేలో పోసి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి.

ఎలా వాడాలి:

- తేలికపాటి క్లీన్సర్ తో ఆలాగే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోండి.

- ముఖంపై తడిని ఆరబెట్టుకుని గ్రీన్ టీ ఐస్ క్యూబ్ తో ముఖాన్ని తేలికగా రబ్ చేయండి.

- ఆ తరువాత, కాసేపు కూర్చుని ఉంటే చర్మంలోకి గ్రీన్ టీ సుగుణాలు ఇంకడం ప్రారంభిస్తాయి.

- ఇప్పుడు గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రంగా రిన్స్ చేసుకోండి.

- ఇప్పుడు తేలికపాటి టోనర్ ను లేదా మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

English summary

8 Benefits Of Using Green Tea Ice Cubes In Your Everyday Beauty Routine

Antioxidant-packed green tea is touted as one of the best skin care ingredients. It is used worldwide for treating a myriad of unsightly skin problems and promoting the skin's overall health. It is packed with skin-benefiting enzymes, phytochemicals and amino acids. All these compounds can make green tea an incredible skin care remedy.
Desktop Bottom Promotion