For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేస్టర్ ఆయిల్ మరియు సెసేమ్ ఆయిల్ ను హెయిర్ లాస్ ను అరికట్టడానికి వాడటం వలన కలిగే లాభాలు

|

హెయిర్ ఫాల్ అనేది మీ హెయిర్ ని పలచన చేస్తూ మీకు నిద్రపట్టనివ్వటం లేదా? ఈ స్థితిని జీవితంలో ఎదో ఒక దశలో ఎదుర్కోవడం సహజమే. లైఫ్ లోని ఒత్తిళ్లు, తీరికలేని షెడ్యూల్స్ వలన హెయిర్ ఫాల్ అనే విజిటర్ ప్రతి ఒక్కరి జీవితంలోకి తొంగి చూస్తోంది.

కానీ, ఈ సమస్యకు పరిష్కారంగా నిపుణులు నేచురల్ రెమెడీని కనుగొన్నారు. ఈ రెమెడీని వాడటం ప్రారంభించిన మొదటి సారి నుంచి మీరు హెయిర్ ఫాల్ నుంచి ఉపశమనం పొందటం ప్రారంభిస్తారు. అవును, ఇది నిజం. ఈ సింపుల్ మరియు నేచురల్ రెమెడీలో కేస్టర్ ఆయిల్ మరియు సెసేమ్ ఆయిల్ యొక్క శిరోజాల సంరక్షణ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ రెండు ఆయిల్స్ తో స్కాల్ప్ ని సంరక్షిస్తే హెయిర్ లాస్ అనేది తగ్గుముఖం పడుతుంది.

Advantages of using Castor oil and Sesame Oil For treating hair loss.

వైట్ క్యాస్టర్ ఆయిల్ లో శిరోజాలను ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్ లభ్యమవుతుంది. మరోవైపు, సెసేమ్ ఆయిల్ లో శిరోజాల ఆరోగ్యాన్ని లోపల నుంచి పెంపొందించే గుణాలు లభ్యమవుతాయి. శిరోజాలకు బ్లడ్ సర్క్యూలేషన్ ని అందించడానికి తద్వారా వెంట్రుకలను దృఢంగా మార్చే గుణాలు ఈ సెసేమ్ ఆయిల్ లో కలవు.

ఈ ఆయిల్స్ ని కలిపి వాడితే హెయిర్ ఫాల్ సమస్యను అరికట్టవచ్చు. ఈ ఆయిల్స్ ను వాడటం ద్వారా కలిగే ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తుతాయి. కాబట్టి, వీటిని వాడి మీ శిరోజాల సౌందర్యాన్ని సంరక్షించుకోవాలని ఉందా? అయితే, ఇంకెందుకాలస్యం, ఈ ఆయిల్స్ ను శిరోజాల సంరక్షణకు ఏ విధంగా వాడాలో తెలుసుకుని మంచి ఫలితాన్ని పొందండి మరి.

Advantages of using Castor oil and Sesame Oil For treating hair loss.

1. కేస్టర్ ఆయిల్ వలన శిరోజాలకు కలిగే లాభాలు

కొన్నేళ్లుగా కేస్టర్ ఆయిల్ ను శిరోజాల సంరక్షణకు మహిళలు వాడుతూ ఉన్నారు. తద్వారా, వారంతా వివిధ స్కాల్ప్ సమస్యల నుంచి రక్షణ పొందుతున్నారు. ఈ ఆయిల్ ను వాడటం ద్వారా శిరోజాల ఆకృతి మెరుగవుతుంది. హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. కేస్టర్ ఆయిల్ లో దృఢమైన యాంటీవైరల్, యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. ఇవన్నీ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ను తొలగించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. హెయిర్ టెక్స్చర్ మెరుగవడానికి ఇది దోహదపడుతుంది. శిరోజాల పోషణకు తగినంత ప్రోటీన్ ను అందించేందుకు ఈ ఆయిల్ తోడ్పడుతుంది.

కేస్టర్ ఆయిల్ లో రిసినోలెయిక్ యాసిడ్ అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంపొందిస్తుంది. తద్వారా, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే, హెయిర్ గ్రోత్ ను పెంపొందిస్తుంది.

అదనంగా, కేస్టర్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి హెయిర్ కేరాటిన్ ను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. తద్వారా, మీ హెయిర్ ఫ్రిజ్ ఫ్రీ గా మారుతుంది. అలాగే షైనీగా అలాగే స్మూతర్ టెక్స్చర్ తో నిగనిగలాడుతోంది.

హెయిర్ కోసం బెస్ట్ కేస్టర్ ఆయిల్

Advantages of using Castor oil and Sesame Oil For treating hair loss.

2. సెసేమ్ ఆయిల్ వలన శిరోజాలకు కలిగే లాభాలు

నిర్జీవమైన డ్రై హెయిర్ కలిగిన వారికి సెసేమ్ ఆయిల్ వలన ప్రయోజనాలు అందుతాయి. మీ శిరోజాలకు జీవాన్ని అందిస్తుంది. శిరోజాలను నిగనిగలాడేలా చేస్తుంది. ఇందులో ప్రోటీన్ తగినంత లభిస్తుంది. అలాగే, విటమిన్స్ ఈ మరియు బిలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు కేల్షియం వంటి మినరల్స్ కలవు. ఇవి హెయిర్ గ్రోత్ కు తోడ్పడతాయి. ఇది స్కిన్ ద్వారా సులభంగా గ్రహింపబడుతుంది. అందువలన, డ్రై స్కాల్ప్ కలిగిన వారికి ఈ ఆయిల్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ ఆయిల్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ సమస్యను నివారిస్తుంది. తద్వారా, శిరోజాల సౌందర్యాన్ని సంరక్షిస్తుంది. శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుతూ హెయిర్ ఫాల్ ని అరికడుతుంది.

హెయిర్ కోసం బెస్ట్ కేస్టర్ ఆయిల్

Advantages of using Castor oil and Sesame Oil For treating hair loss.

3. కేస్టర్ ఆయిల్ మరియు సెసేమ్ ఆయిల్ ద్వారా హెయిర్ లాస్ ను అరికట్టడమెలా

సెసేమ్ తో పాటు కేస్టర్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ డ్రై హెయిర్ కు తగినంత తేమనిచ్చి శిరోజాలకు పోషణనివ్వడానికి ఉపయోగపడతాయి. విటమిన్ ఈ తో పాటు మెగ్నీషియం అలాగే ఫాస్ఫరస్ అనే మినరల్స్ వీటిలో సమృద్ధిగా లభించడం వలన ఇవి హెయిర్ ఫాల్ కు కారణమైన మినరల్ లోపాన్ని సరిచేస్తాయి. ఈ రెండిటినీ కలిపి ఎలా వాడాలో ఈ సింపుల్ టెక్నీక్ ద్వారా తెలుసుకోండి. హెయిర్ ఫాల్ నుంచి శిరోజాలను సంరక్షించుకోండి.

Advantages of using Castor oil and Sesame Oil For treating hair loss.

>> ఒక బౌల్ ని తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఆలివ్ మరియు కోకోనట్ ఆయిల్ ను జోడించండి. వీటిని కొన్ని సెకండ్ల పాటు మైక్రో వేవ్ చేయండి.

>> ఒక టీస్పూన్ సెసేమ్ మరియు కేస్టర్ ఆయిల్ ను వీటికి జోడించి ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.

>> అప్పుడే వాష్ చేసిన తడి జుట్టుపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. లేదా మీ జుట్టును తడి చేసైనా ఈ మిశ్రమాన్ని పట్టించొచ్చు.

>> ఈ మిశ్రమం వెచ్చగా ఉన్నప్పుడే స్కాల్ప్ కి అప్లై చేసి కొద్ది నిమిషాల పాటు సున్నితంగా సర్క్యూలర్ మోషన్స్ లో మసాజ్ చేయండి.

>> అయిదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసిన తరువాత వెచ్చటి టవల్ ని తలపై చుట్టండి.

>> ఇలా గంట నుండి రెండు గంటల పాటు ఉండండి. మీరు నిద్రపోయే ముందు ఇలా అప్లై చేసి రాత్రంతా ఇలా ఉంచినా శిరోజాలకు పోషణ అందుతుంది.

Advantages of using Castor oil and Sesame Oil For treating hair loss.

>> మీ హెయిర్ ను మైల్డ్ షాంపూ తో వాష్ చేసి చక్కగా రిన్స్ చేసుకోండి.

>> ఈ పద్దతిని వారానికి రెండు సార్లు పాటించండి.

>> కొన్ని వాష్ ల తరువాత మీరు మీ హెయిర్ టెక్స్చర్ లో ఇంప్రూవ్మెంట్ ని గమనించగలుగుతారు. శిరోజాల ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గుముఖం పడుతుంది. సెసేమ్ మరియు కేస్టర్ ఆయిల్స్ అనేవి రెండూ సమన్వితంగా పనిచేసి మీ శిరోజాలను ఆరోగ్యంగా అలాగే మృదువుగా ఉంచుతాయి.

English summary

Advantages of using Castor oil and Sesame Oil For treating hair loss.

Of late hair fall is a common problem for many. We may blame the reason for pollution, stress, etc. Finding a remedy for it is also important. One best solution for this is using castor oil and sesame oil combination. Application of these two oils can reduce hair loss to a great extent.
Desktop Bottom Promotion