For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరోమాథెరపీ ఫేషియల్ ద్వారా చర్మసౌందర్యానికి కలిగే ప్రయోజనాలు

|

చర్మ సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయా? అయితే ఆరోమాథెరపీ ఫేషియల్ ను ప్రయత్నించండి. మొక్కలు అలాగే పూల నుంచి సేకరించబడిన ఎసెన్షియల్ ఆయిల్స్ ల ద్వారా లభ్యమయ్యే సౌందర్య ప్రయోజనాలను పొందండి.

అందం గురించి ఎక్కువగా తాపత్రయపడేవారు ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో అందానికి ప్రాముఖ్యత ఉంది. అందంగా ఉండకూడదని ఎవరూ కోరుకోరు. అందంగా కనిపించడానికి అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటారు. పార్లర్ లో ఎక్కువ సమయం గడిపడం ద్వారా అందాన్ని సంరక్షించుకోవడం ఒక పద్దతి. దీనిని, కొన్ని దశాబ్దాలుగా చాలా మంది అనుసరిస్తూ వస్తున్నారు. పార్లర్ వారు ప్రొవైడ్ చేసే సర్వీస్ లలో ఫేషియల్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.

ఫేషియల్ ప్రాముఖ్యత విపరీతంగా పెరుగుతోంది. పార్టీలు అలాగే ఫంక్షన్ లలో హైలైట్ అవ్వాలని పిల్లలకు కూడా ఫేషియల్ ను చేయిస్తున్నారు. ఫేషియల్ ద్వారా కలిగే బెనిఫిట్స్ మనందరికీ తెలిసినవే. అయితే, ఈ బెనిఫిట్స్ ఎంతకాలం నిలిచి ఉంటాయి. ఈ బెనిఫిట్స్ నిలిచి ఉండాలంటే మీరు తరచూ పార్లర్ ని సందర్శిస్తూ రావల్సి ఉంటుందా?

Aromatherapy Facial And Its Striking Benefits On The Skin

అవసరం లేదు. ముఖంలో కాంతిని వెలికి తీయడానికి ఫేషియల్ అనేది అత్యంత ఉపయోగకరంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ బెనిఫిట్స్ ఎక్కువ కాలం ఉండేందుకు అరోమాథెరపీ ఫేషియల్ మీకు సహాయకారిగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ లో అందానికి ప్రకృతి మెరుగులు దిద్దుతుంది. ఈ ఆర్టికల్ మొత్తం చదివితే అరోమాథెరపీ ఫేషియల్ గురించి మీకు అవగాహన లభిస్తుంది.
అరోమాథెరపీ ఫేషియల్ అంటే ఏంటి?

అరోమాథెరపీ ఫేషియల్ అంటే ఏంటి?

పేరుకు తగినట్టుగానే అరోమాథెరపీ ఫేషియల్ అంటే సువాసనల ద్వారా చర్మానికి ప్రయోజనాలు అందడమని అర్థం అవుతుంది. అవును, మొక్కలు అలాగే పూల నుంచి వెలికితీయబడిన ఎసెన్షియల్ ఆయిల్స్ ల గొప్పతనం అరోమాథెరపీ ఫేషియల్ లో వినియోగించబడుతుంది. ఈ ఆర్గానిక్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఎంతో సువాసనాభరితంగా ఉంటాయి. ఇవి, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. స్కిన్ కేర్ విషయంలో అరోమాథెరపీ ఫేషియల్ అనేది ఆల్టార్నేటివ్ మెడిసిన్ గా పనిచేస్తుంది.

ఇందులో ఇన్వాల్వ్ అయిన స్టెప్స్ ఏంటి?

ఇందులో ఇన్వాల్వ్ అయిన స్టెప్స్ ఏంటి?

ఈ ఫేషియల్ మెథడ్ లో రెగ్యులర్ ఫేషియల్ లో లాగానే స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. క్లీన్సింగ్, ఎక్స్ఫోలియేటింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ మరియు ఫేస్ ప్యాక్ స్టెప్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ ని స్కిన్ పై వాడే ప్రోడక్ట్స్ లో వాడటమే ఈ ఫేషియల్ యొక్క ప్రత్యేకత. ఈ చిన్నపాటి ప్రత్యేకత అన్నది గొప్ప ఫలితాలను అందిస్తుంది. అయితే, చర్మతత్వానికి తగిన ఎసెన్షియల్ ఆయిల్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. బ్యూటీ పార్లర్ లో నిపుణులు ఈ విషయంలో కేర్ తీసుకుంటారు. ఈ క్విక్ గైడ్ ని పరిశీలించండి.

 అరోమాథెరపీ

అరోమాథెరపీ

నార్మల్ స్కిన్ - ఆరెంజ్, జాస్మిన్, రోజ్, చమోమైల్

డ్రై స్కిన్ - సెడార్ వుడ్, మిర్హ్, గెరేనియం, శాండల్వుడ్, పాల్మరోజా, రోమన్ చమోమైల్

ఆయిలీ స్కిన్ - ఆరంజ్, లెమన్, లైమ్, గెరేనియం, సిప్రస్, బెర్గామోట్

సెన్సిటివ్ స్కిన్ - టీట్రీ, వేటివార్, ల్యావెండర్

అరోమాథెరపీ ఫేషియల్ ని ఇంటివద్ద ప్రయత్నించవచ్చా?

అరోమాథెరపీ ఫేషియల్ ని ఇంటివద్ద ప్రయత్నించవచ్చా?

కచ్చితంగా! సరైన విధంగా ఈ ఫేషియల్ ను చేసే విధానం మీకు తెలిస్తే ఈ ఫేషియల్ ను ఇంటివద్దే ప్రయత్నించవచ్చు. ఆ విధంగా మీరు పార్లర్ పై పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఇంటివద్దే కంఫర్ట్ ను పొందవచ్చు. అన్ని రకాల స్కిన్ టైప్స్ కోసం ఈ సింపుల్ DIY అరోమాథెరపీ ఫేషియల్ ను వివరించాము.

అలోవెరా జెల్ ను ఉపయోగించి స్కిన్ ను శుభ్రపరుచుకోండి.

అలోవెరా జెల్ ను ఉపయోగించి స్కిన్ ను శుభ్రపరుచుకోండి.

ముఖాన్ని గోరువెచ్చటి నీటితో స్టీమ్ చేసుకోండి. స్టీమ్ చేసే నీటిలో మీ చర్మతత్వానికి తగిన ఎసెన్షియల్ ఆయిల్ ను జోడించండి.

మీ ఫెవరెట్ మసాజ్ క్రీమ్ ను తీసుకోండి. అందులో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ ను కలపండి. సాధారణపద్ధతిలో మసాజ్ చేసుకోండి. ఆ తరువాత మిగిలిన క్రీమ్ ను తడి టవల్ తో తుడిచేయండి.

ఆఖరి స్టెప్ గా శాండల్వుడ్, ఆరెంజ్ లేదా రోజ్ ఫేస్ ప్యాక్ ను వాడండి.

ఏవైనా జాగ్రత్తలను తీసుకోవాలా?

ఏవైనా జాగ్రత్తలను తీసుకోవాలా?

మీరు తీసుకోబోయే ఒకే ఒక్క జాగ్రత్త ఏంటంటే మీ చర్మతత్వానికి తగిన ఎసెన్షియల్ ఆయిల్ ను ఎంచుకోవడం. గర్భిణీలు, ఆస్త్మా, ఎపిలెప్సీ మరియు హై బ్లడ్ ప్రెజర్ తో ఇబ్బంది పడేవారికి ఈ ఫేషియల్ అనేది సిఫార్సు చేయదగినది కాదు.

అరోమాథెరపీ ఫేషియల్ వలన కలిగే లాభాలు

అరోమాథెరపీ ఫేషియల్ వలన కలిగే లాభాలు

చర్మంపై వాడే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి చర్మరంధ్రాల లోకి చొచ్చుకుని వెళ్లి చర్మాన్ని లోపల నుండి శుద్ధి చేస్తాయి. అరోమాథెరపీ ఫేషియల్ అనేది చర్మాన్ని వెలుపల నుంచే కాకుండా లోపల నుంచి కూడా శుభ్రం చేయడానికి తోడ్పడుతుంది. ఆ విధంగా, చర్మంపై నున్న ఇంప్యూరిటీస్ తొలగిపోతాయి. చర్మం డీటాక్స్ అవుతుంది.

స్ట్రెస్ బస్టర్

స్ట్రెస్ బస్టర్

ఫేషియల్ అనేది రిలాక్స్ అవడానికి అలాగే టెన్షన్స్ ను తొలగించడానికి తోడ్పడుతుంది. ఎసెన్షియల్ ఆయిల్స్ ను ఫేషియల్ లో జోడించడం వలన మరింత ప్రయోజనం లభిస్తుంది. ల్యావెండర్ వంటి కొన్ని ఆయిల్స్ లో నెర్వ్స్ ని ప్రశాంతబరిచే లక్షణాలు కలవు.

రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది:

రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది:

అరోమాథెరపీ ఫేషియల్ వలన చర్మం ఆరోగ్యంగా ప్రకాశిస్తుంది. చర్మంలోని రక్తప్రసరణ మెరుగవడం వలన ఇది సాధ్యపడుతుంది. రక్తంలో లభించే పోషకాలు సెల్స్ వృద్ధికి తోడ్పడతాయి.

చర్మం పొడిబారటాన్ని అరికడుతుంది:

చర్మం పొడిబారటాన్ని అరికడుతుంది:

డ్రై స్కిన్ సమస్యతో మీరు ఇబ్బందిపడుతున్నారా? వింటర్ సీజన్ లో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తోందా? అయితే ఎసెన్షియల్ ఆయిల్ ని పీల్స్ లేదా స్క్రబ్స్ లో వినియోగించి మీరు ప్రయోజనం పొందవచ్చు. ఇలా చేస్తే మీ స్కిన్ టెక్స్చర్ అనేది స్మూత్ గా మారుతుంది.

చర్మం తేటగా మారుతుంది:

చర్మం తేటగా మారుతుంది:

ఈ ఫేషియల్ ట్రీట్మెంట్ లో వినియోగించిన ఆయిల్స్ వలన బ్లేమిషెస్, యాక్నే, డార్క్ స్పాట్స్ వంటి కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి. మెల్లగా మీ చర్మం ఇదివరకటిలా తేటగా మారుతుంది. కొంతవరకు, చర్మసమస్యల ద్వారా మళ్ళీ మళ్ళీ చర్మం ఇబ్బందిపడటం తగ్గుతుంది.

యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్:

యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్:

అరోమాథెరపీ ఫేషియల్స్ వలన చర్మంలోని కాంతిని అలాగే ప్రకాశాన్ని మీరు గమనించగలుగుతారు. ఏజింగ్ వలన చర్మంపైన కనిపించిన కొన్ని ముడతలతో పాటు కొన్ని ఏజింగ్ లక్షణాలు అదృశ్యమయిపోతాయి. చర్మం తాజాగా యవ్వనంగా మారుతుంది.

చర్మానికి అపాయకరం కాదు:

చర్మానికి అపాయకరం కాదు:

సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారికి ఈ ఫేషియల్ ఒక వరంలా పనిచేస్తుంది. ఈ ఫేషియల్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ సమస్య దరిచేరదు. ఈ ఆయిల్స్ ను ఆర్గానిక్ గా వెలికితీయడం వలన ఇవి కల్తీ అయ్యే ఆస్కారం లేదు. చర్మానికి ఇవి సురక్షితం.

English summary

Aromatherapy Facial And Its Striking Benefits On The Skin

It is very essential to keep one's skin beautiful and radiant at all times. And, many are easily able to do it easily due to their good skin texture. But for those who are not able to manage their skin easily, aromatherapy facial would work best. An aromatherapy facial Detoxes the skin, improves blood circulation, and acts as a stress-buster.
Story first published:Thursday, April 26, 2018, 18:01 [IST]
Desktop Bottom Promotion