For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంటి కింద నల్లటి వలయాలను తొలగించటానికి ఆయుర్వేద పద్ధతులు

|

మన రోజువారీ జీవితంలో మనల్ని ఇబ్బందిపెట్టే చర్మసమస్యల్లో కళ్ళ కింద వచ్చే నల్లవలయాలు ఒకటి. ఈ నల్లవలయాల వలన ఎవరైనా అలసినట్లు, డల్ గా కన్పించవచ్చు.అందుకే, పరిస్థితి ఇంకా పాడయ్యేముందే మీ ముఖాన్ని సంరక్షించుకోండి.

మార్కెట్లో కంటి కింద నల్లటి వలయాలను తగ్గించడానికి అనేక కాస్మెటిక్ ఉత్పత్తులు మరియు లోషన్లు దొరుకుతున్నాయి.

కానీ, ఈ ఉత్పత్తులలో ఉండే కఠిన పదార్థాలు ఈ చర్మసమస్యను మరింత పెంచవచ్చు. అందుకే సహజ పదార్థాలతో నల్లటి కళ్ల వలయాలను తగ్గించవచ్చు.

ayurvedic ways to cure dark circles

నల్ల వలయాలు మరియు కళ్ళు వాపుకి ఆయుర్వేద చిట్కాలు బాగా పనిచేస్తాయి. దోసకాయ, టమాటా, రోజ్ వాటర్ వంటివి క్రమం తప్పకుండా వాడటం వలన కంటి వలయాలకి సానుకూల ఫలితాలు కలుగుతాయి.

ఇవేకాక, మరికొన్ని పదార్థాలు నల్ల వలయాలు తగ్గించటానికి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకని ఈ ఆర్టికల్, బోల్డ్ స్కైలో కొన్ని సులభమైన ఆయుర్వేద చిట్కాలను కళ్లకింద నల్ల వలయాలను తగ్గించుకోటానికి మీకోసం అందిస్తున్నాం. మరింత తెలుసుకోటానికి చదవండి...

దోసకాయ ;

దోసకాయ ;

నల్ల వలయాలను తగ్గించే పదార్థాలలో అన్నిటికన్నా పైన ఉండేది దోసకాయ. దోసకాయ ఎలాంటి చర్మపు మచ్చలనైనా, నల్లదనాన్ని తగ్గిస్తుంది. నల్ల వలయాలను తగ్గించటంలో దోసకాయ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రెండు దోసకాయ ముక్కలను కట్ చేసి, వాటిని ఫ్రిజ్ లో పెట్టండి. అవి చల్లబడ్డాక, వాటిని కళ్ళ కింద కొంత సమయం పెట్టి తీసేయండి.

బంగాళదుంప;

బంగాళదుంప;

ఆలూను తురమండి. ఈ తురిమిన ముక్కలను కళ్లకింద పెట్టి కొద్ది సమయం తర్వాత తీసేయండి. ఈ పద్ధతి కళ్ళ కింద వలయాలను వెంటనే తగ్గిస్తుంది. ఇలా కొన్నిరోజులు ఈ చిట్కాను పాటించి చూడండి, చాలా తేడా కన్పిస్తుంది.

రోజ్ వాటర్ ;

రోజ్ వాటర్ ;

రోజ్ వాటర్ కూడా కళ్ల కింద వలయాలను తగ్గిస్తుంది. అది చర్మాన్ని బాగుచేసి, ఉపశమించి, చర్మాన్ని టోన్ చేస్తుంది. ఇందులో ఉండే అధిక గులాబి రసం నల్ల వలయాలను పల్చన చేస్తుంది. రెండు దూదిముక్కలను రోజ్ వాటర్ లో నానబెట్టండి. కంటి కింద వాటిని పెట్టి కొద్ది సమయం తర్వాత తీసేయండి.

 టమాటా ;

టమాటా ;

టమాటాలో బ్లీచింగ్ గుణాలుంటాయి. అది చర్మంపై నల్లదనాన్ని తీసేసి చర్మాన్ని లేతరంగులోకి మార్చి టోన్ చేస్తుంది. ఒక టమాటా ముక్కను తీసుకుని కంటిపై రుద్దండి మరియు కొంతసమయం తర్వాత కడిగేయండి.

బాదం నూనె ;

బాదం నూనె ;

బాదం నూనెలో ఉండే అధిక విటమిన్ ఇ వలన నల్లవలయాలు తొలగిపోతాయి. కొన్ని చుక్కల బాదం నూనెను తీసుకుని, కంటిపై ప్రతి రాత్రి పడుకునేముందు రుద్దుకోండి.కొన్ని రోజుల్లోనే మీకు తేడా కన్పిస్తుంది.

English summary

ayurvedic ways to cure dark circles

ayurvedic ways to cure dark circles, in this article, we at Boldsky will be listing out some of the easy Ayurvedic remedies to treat and reduce the appearance of dark circles. Read on to know
Desktop Bottom Promotion