For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు వలన కలిగే సౌందర్య ప్రయోజనాలు

పసుపు వలన కలిగే సౌందర్య ప్రయోజనాలు

|

పస్సుపు వలన కలిగే ప్రయోజనాలన్నిటిని గురించి మీకు తెలుసా? పసుపును హిందీలో హల్దీ అని పిలుస్తారు. ఇది వంట దినుసుగా ఆహార పదార్ధాల తయారీలో వినియోగిస్తారు.ఇది పొడి రూపంలో లభిస్తుంది. ఇది భారతీయ ఆహార పదార్ధాలకు రుచిని చేకూరుస్తుంది. అంతేకాక ఇది బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలని కూడా కలిగిస్తుంది.

కాని, పసుపు వలన సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? మీరు విన్నది నిజమే ! పసుపును ఉపయోగించి వివిధ చర్మ సమస్యలు తొలగించుకోవచ్చు.అవేమిటో ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం.

Beauty Benefits Of Turmeric Powder

కొన్ని సంస్కృతీ సాంప్రదాయాలను నిశితంగా పరిశీలిస్తే, అనాదిగా పసుపును యాంటి సెప్టిక్ గా వాడటంను మనం గమనించవచ్చు. పైపూతగా చర్మ సౌందర్య పోషణకు, ఆహారంతో పాటుగా అంతర్గత ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పసుపును వాడతారు.

పసుపును ఎటువంటి చర్మ తత్త్వం ఉన్నవారైనా ఉపయోగించవచ్చు.కాని సున్నితమైన చర్మం ఉన్నవారు మాత్రం దీనిని ఉపయోగించే ముందు చర్మవైద్యులను సంప్రదించడం మంచిది. ఇలా చేస్తే చర్మ సమస్యలను అరికట్టవచ్చు.

పసుపు వలన కలిగే వివిధ ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

మొటిమలను తొలగిస్తుంది:

మొటిమలను తొలగిస్తుంది:

మనలో చాలామందికి పస్సుపు మొటిమలను తగ్గించడానికి పనికివస్తుందని తెలియదు. ఇది పసుపు వలన కలిగే అనేక ప్రయోజనాల్లో ఒకటి. పసుపులో యాంటి సెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ తత్వాలు, మొటిమలను పోగొట్టడంలో సహాయపడతాయి. భారతదేశంలో చాలామంది స్త్రీలు మెరిసే చర్మం కొరకు పసుపును ఫేస్ ప్యాక్ గా వాడతారు.

పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది:

పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది:

పసుపులో బ్లీచింగ్ లక్షణాలు ఉన్నందున ఇది చర్మం పై పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనికొరకు మీకు కొంచం పసుపు మరియు కొన్ని చుక్కల నిమ్మరసం అవసరమవుతుంది. పైన చెప్పిన పదార్ధాలను బాగా కలిపి పిగ్మెంటేషన్ ప్రభావిత ప్రదేశంలో రాయండి. ఇరవై నిమిషాలు ఆరనిచ్చిన తరువాత నీటితోకడిగేయండి.ఇలా ప్రతిరోజూ మీరు స్నానం చేసే ముందు చేయండి.

కాలిన గాయాలను చల్లబరుస్తుంది:

కాలిన గాయాలను చల్లబరుస్తుంది:

పసుపులో నొప్పి నివారణ తత్వాలు మరియు యాంటీ బాక్టీరియల్ తత్వాలు ఉంటాయి. ఇవి కాలిన గాయాలకు వాపు రాకుండా చూస్తాయి. పసుపును కొబ్బరినూనె, ఆముదం, ఆలివ్ ఆయిల్ వంటి నూనెలతో కలిపి కాలిన గాయాలపై పూస్తే మంచి ఫలితముంటుంది.

ముడుతలను పోగొడుతుంది:

ముడుతలను పోగొడుతుంది:

పసుపు ముడుతలను పోగొట్టడంలో ప్రసిద్ధి చెందింది. ఒక చెంచాడు పసుపును, వరిపిండిని కలపండి. దీనిలో టమాటో రసం మరియు పాలు కలిపి పేస్టు తయారు చెయ్యండి. ఈ పేస్టును ముడుతలపై పూయండి. ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది పసుపు వలన కలిగే ఒక సౌందర్య ప్రయోజనం.

జిడ్డు చర్మాన్ని నివారిస్తుంది:

జిడ్డు చర్మాన్ని నివారిస్తుంది:

పసుపు జిడ్డు చర్మం కలిగిన వారికి మంచి చేస్తుంది. దీనికి పసుపుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఒక టీ స్పూన్ గంధం పొడికి, కొంచం పసుపు కలపండి. దీనికి కొన్ని చుక్కల నారింజ రసం కలిపి ముఖానికి రాయండి, పదిహేను నిమిషాలు ఆరనిచ్చి నీటితో శుభ్రంగా కడిగేయండి.

స్ట్రెచ్ మార్కులను తొలగిస్తుంది:

స్ట్రెచ్ మార్కులను తొలగిస్తుంది:

పసుపు స్ట్రెచ్ మార్కులను తెలికపరచడానికి అమోఘంగా పని చేస్తుందని చెప్తారు. పసుపును శనగపిండి మరియు పాలతో కలిపి ముద్దగా చేసి, ఆ ముద్దను ముఖానికి నలుగులా పెట్టుకుంటే స్ట్రెచ్ మార్కులు తొలగిపోతాయి.

English summary

Beauty Benefits Of Turmeric Powder

We all are aware of the various benefits of turmeric. You'd be surprised to know the beauty benefits it possesses. Some of the beauty benefits of turmeric are it helps in healing cracked heals, cures acne, treats dandruff, helps in soothing burns, etc.However, you'd be surprised to know of the beauty benefits it possesses.
Story first published:Tuesday, May 8, 2018, 13:58 [IST]
Desktop Bottom Promotion