For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాస్టర్ ఆయిల్ ద్వారా ముఖసౌందర్యానికి అందే ప్రయోజనాలు

క్యాస్టర్ ఆయిల్ ద్వారా ముఖసౌందర్యానికి అందే ప్రయోజనాలు

|

క్యాస్టర్ ఆయిల్ ద్వారా అందే బ్యూటీ బెనిఫిట్స్ అనేవి అత్యంత ప్రజాదరణ పొందినవి. క్యాస్టర్ సీడ్స్ నుంచి క్యాస్టర్ ఆయిల్ ను సేకరిస్తారు. ఈ ఆయిల్ ను అనేక కాస్మటిక్స్ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.

ఈ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని అందంగా మారుస్తాయి. తరచూ క్యాస్టర్ ఆయిల్ ను స్కిన్ కేర్ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

 Benefits of Castor Oil For The Face

అయితే, క్యాస్టర్ ఆయిల్ ను ముఖానికి ఉపయోగించడం ద్వారా ముఖ సౌందర్యం మెరుగవుతుందా? అవును. ముఖసౌందర్యం మెరుగవడానికి క్యాస్టర్ ఆయిల్ అనేక విధాలుగా తోడ్పడుతుంది. క్యాస్టర్ ఆయిల్ యాక్నే, పొడిబారిన చర్మం, స్కార్స్, డార్క్ సర్కిల్స్ వంటి అనేక స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ పై పోరాటం జరుపుతుంది.

కాబట్టి, ఈ రోజు అనేక చర్మ సమస్యల నివారణ కోసం క్యాస్టర్ ఆయిల్ ను ఏ విధంగా వాడుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

స్కార్స్ ని లైటెన్ చేయడానికి:

స్కార్స్ ని లైటెన్ చేయడానికి:

క్యాస్టర్ ఆయిల్ లో లభ్యమయ్యే ఫ్యాటీ యాసిడ్ అనేది సెల్స్ పునరుత్పత్తికి తోడ్పడుతుంది. ఈ పద్దతి అనేది స్కార్స్ ని తగ్గించేందుకు సహకరిస్తుంది. ముఖంపై కట్స్ వలన అలాగే దెబ్బల వలన ఏర్పడిన మచ్చలు తొలగేందుకు క్యాస్టర్ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్

1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్

ఎలా వాడాలి:

క్యాస్టర్ ఆయిల్, కొబ్బరి నూనె మరియు అలోవెరా జెల్ ను ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలపి ఒక మిశ్రమాన్ని తయారుచేయండి. దీని స్ప్రే బాటిల్ లో స్టోర్ చేస్తే ఫ్యూచర్ యూజ్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోండి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్ని వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ రెమెడీని ప్రతి రోజు నిద్రపోయే ముందు పాటిస్తే మీరు మెరుగైన ఫలితాన్ని గుర్తిస్తారు.

డార్క్ సర్కిల్స్ ని తొలగిస్తుంది:

డార్క్ సర్కిల్స్ ని తొలగిస్తుంది:

కళ్ళు అలసటకు గురవడం వలన డార్క్ సర్కిల్స్ సమస్య ఎదురవుతుంది. ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్లలో అసమతుల్యం వంటివి డార్క్ సర్కిల్స్ సమస్యకు దారితీస్తాయి. క్యాస్టర్ ఆయిల్ ఈ సమస్యను నివారించేందుకు తోడ్పడుతుంది. అలోవెరా జెల్ చర్మాన్ని సూత్ చేస్తుంది. చర్మాన్ని లోలోపల నుంచి హైడ్రేట్ చేస్తుంది.

కావలసిన పదార్థాలు:

1 టీస్పూన్ క్యాస్టర్ ఆయిల్

1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్

ఎలా వాడాలి:

క్యాస్టర్ ఆయిల్ ను అలాగే అలోవెరా జెల్ ను ఒక పాత్రలోకి తీసుకోండి. ఈ మిశ్రమం సాలిడ్ గా మారే వరకు ఫ్రీజ్ చేయండి. ఒక క్యూబ్ ను తీసుకుని కంటి కింద సున్నితంగా మసాజ్ చేయండి. ఒక క్లాత్ ను చర్మంపై ఉన్న మిశ్రమాన్ని వైప్ చేసేందుకు వాడుకోవచ్చు. ఈ రెమెడీను రిపీట్ చేయండి. ప్రతి రోజూ సాయంత్రం ఈ రెమెడీను పాటిస్తే వేగవంతమైన అలాగే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

మాయిశ్చరైజర్ :

మాయిశ్చరైజర్ :

క్యాస్టర్ ఆయిల్ ను మాయిశ్చరైజర్ లా కూడా వాడవచ్చు. ఇందులో లభ్యమయ్యే విటమిన్ ఈ అనేది చర్మం యొక్క ఎలాస్టిసిటీను పెంపొందించేందుకు తోడ్పడుతుంది. కొలాజెన్ ఉత్పత్తి మెరుగవడం వలన చర్మంలోని ఎలాస్టిసిటీ పెరుగుతుంది.

వీటితో పాటు, చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం ద్వారా ముడతలు అలాగే ఫైన్ లైన్స్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

కావలసిన పదార్థాలు:

1 కప్పు నేచురల్ మాయిశ్చరైజర్

1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్

1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

ఎలా వాడాలి:

నేచురల్ మాయిశ్చర్ ని ఒక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి క్యాస్టర్ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్ ను జోడించండి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లోకి జోడించండి. ఈ క్యాస్టర్ ఆయిల్ మాయిశ్చరైజర్ ను ప్రతి రోజూ ఉదయం అలాగే సాయంత్రం అప్లై చేసుకోవడం వలన చర్మం స్మూత్ గా అలాగే మృదువుగా మారుతుంది.

యాక్నే కోసం:

యాక్నే కోసం:

క్యాస్టర్ ఆయిల్ అనేది ముఖంపై యాక్నేను తొలగించేందుకు తోడ్పడుతుంది. ఇప్పుడు,క్యాస్టర్ ఆయిల్ ను ఏ విధంగా వాడితే యాక్నే నుంచి ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

1 టీస్పూన్ క్యాస్టర్ ఆయిల్

ఎలా వాడాలి:

మొదటగా ముఖాన్ని వెచ్చటి నీటితో వాష్ చేసుకోవడం ద్వారా ముఖంపై డర్ట్ ను తొలగించుకోండి. ముఖాన్ని వాష్ చేసుకోవడం వలన డర్ట్ అనేది తొలగిపోవడంతో పాటు స్కిన్ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ తరువాత, కాస్తంత క్యాస్టర్ ఆయిల్ ను ముఖానికి అప్లై చేసుకోండి. రాత్రంతా అలాగే ఉండనివ్వండి. మరుసటి ఉదయాన్నే, ముఖాన్ని నార్మల్ వాటర్ మరియు సోప్ తో కడుక్కోండి.

English summary

Benefits of Castor Oil For The Face

We are all familiar with the beauty benefits that castor oil has by this time now. Castor oil is the oil extracted from castor seeds that is widely being used by a lot of cosmetic companies. Rich in antioxidants, castor oil can make your skin look flawless and amazing if used regularly. You can use it with olive oil, coconut oil, etc, for better results.
Desktop Bottom Promotion