For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మసంరక్షణలో క్యారట్ వాడటం వల్ల లాభాలు

|

క్యారట్లలో యాంటీఆక్సిడెంట్లు నిండి వుంటాయి, అలాగే క్యారట్లలో ఎక్కువగా బీటా- కెరోటిన్, ఖనిజలవణాలు, ఇతర విటమిన్లు ఉంటాయి.

కానీ ఈ ఆరోగ్య లాభాలతో పాటు క్యారట్లు మీ అందాన్ని కూడా పెంచుతాయని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. క్యారట్లు యవ్వనవంతమైన, అందమైన చర్మాన్ని పొందటానికి మాస్కులు, ప్యాక్ లలో వాడవచ్చు.

Benefits Of Carrot For Skin Care
మనందరికీ సాధారణ చర్మ సమస్యలైన ట్యాన్, మచ్చలు, పొడి చర్మం వంటివి వస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ ఒకే పరిష్కారంగా క్యారట్ ను వాడవచ్చు. సాధారణంగా దొరికే కాయగూర కాబట్టి, ప్రతిఇంట్లోనూ ఇది కన్పిస్తుంది. అందుకని ఈసారి వంటింట్లోకి వెళ్ళినప్పుడు, దాన్ని మీ చర్మం హాయిగా ఉండటానికి వాడటం మర్చిపోవద్దు.

ఎలా వాడాలని ఆశ్చర్యపోతున్నట్టున్నారు కదూ! ఏం ఆలోచించకండి. ఈ ఆర్టికల్ లో మీకు క్యారట్లు చర్మంకి ఎలా ఉపయోగపడతాయో ఆ లాభాల పూర్తి లిస్టు,అలాగే ప్యాక్ లు,మాస్క్ ల రూపంలో ఎలా వాడవచ్చో, అందమైన, ఏ సమస్యలు లేని చర్మం ఎలా పొందవచ్చో వివరించబడింది. ఆలస్యం ఎందుకు? చదవండి.

1.మెరిసే చర్మం కోసం

1.మెరిసే చర్మం కోసం

క్యారట్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉండి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. క్యారట్లు తినడం వలన చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది. క్యారట్ ను బయట ఎలా వాడితే చర్మం కాంతివంతంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం.

దీనికోసం, తురిమిన క్యారట్ ను కొంచెం తేనెతో కలపండి. దీన్ని ముఖంపై రాసుకోండి.15 నిమిషాలు అలానే ఉంచి కడిగేసి తువ్వాలుతో అద్దుకోండి. ఇలా మంచి ఫలితాలకోసం వారానికి రెండుసార్లు చేయండి.

2.ఎండిపోయిన చర్మాన్ని బాగుచేస్తుంది

2.ఎండిపోయిన చర్మాన్ని బాగుచేస్తుంది

మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, ఈ సులభమైన దోసకాయ క్యారట్ ఫేస్ మాస్క్ దాన్ని నయం చేయటంలో సాయం చేస్తుంది. దీన్ని యాంటీ ఏజింగ్ మాస్క్ గా కూడా వాడవచ్చు.

కావాల్సిన వస్తువులు ;

2-3 చెంచాల క్యారట్ రసం

1 చెంచా దోసకాయ పేస్టు

1 చెంచా పుల్లని క్రీమ్

ఎలా వాడాలి;

ఎలా వాడాలి;

అన్ని పదార్థాలు కలిపి పేస్టులా తయారుచేయండి. ఈ పేస్టును మీ మెడ, మొహంపై రాసుకుని 15 నిమిషాలు అలానే ఉంచండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ మాస్క్ మీ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది, అలా పొడిబారకుండా ఉంటుంది.

3.జిడ్డు చర్మానికి

3.జిడ్డు చర్మానికి

ఈ మాస్క్ చర్మాన్ని మృదువుగా, శుభ్రంగా మారుస్తుంది. జిడ్డు చర్మంపై ముఖ్యంగా మొటిమలు వస్తాయి. ఈ మాస్క్ మీ మొహంపై ఉన్న ఎక్కువ జిడ్డును తీసేస్తుంది.

కావాల్సిన వస్తువులు

3 చెంచాల క్యారట్ రసం

1 చెంచా మజ్జిగ

2 చెంచాల సెనగపిండి

1 చెంచా నిమ్మరసం

ఎలా వాడాలి;

ఎలా వాడాలి;

అన్ని పదార్థాలను కలిపి పేస్టులా తయారుచేయండి. దీన్ని మీ మొహం, మెడపై రాసుకోండి.30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగేసి తువ్వాలుతో తుడుచుకోండి. ఈ మాస్క్ జిడ్డు చర్మం ఉన్నవారికి బాగా పనిచేస్తుంది అలాగే మీ చర్మాన్ని యవ్వనంతో కన్పడేలా చేస్తుంది.

4.ట్యాన్ పోగొట్టడంలో సాయపడుతుంది

4.ట్యాన్ పోగొట్టడంలో సాయపడుతుంది

ఈ ప్యాక్ ఎండవల్ల వచ్చిన ట్యాన్ ను పోగొట్టి ఒకే రకమైన చర్మం రంగును ఇస్తుంది. ట్యాన్ చచ్చిపోయిన చర్మకణాల వలన వస్తుంది. ఈ ప్యాక్ మృతకణాలు తీసేసి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

కావాల్సిన వస్తువులు

1 చెంచా క్యారట్ రసం

1చెంచా గుడ్డు తెల్లసొన

1 చెంచా పెరుగు

ఎలా వాడాలి

ఎలా వాడాలి

అన్ని పదార్థాలను కలిపేసి మిశ్రమాన్ని మీ మొహం, మెడకి రాసుకోండి. 20 నిమిషాలు అలా ఉండనిచ్చి గోరువెచ్చని నీరుతో కడిగేయండి. ఈ మాస్క్ మీ మొహంపై సహజకాంతిని తిరిగితెస్తుంది. దీన్ని వారానికి రెండుసార్లు అయినా ప్రయత్నించండి.

5.మచ్చలను తొలగించటానికి

5.మచ్చలను తొలగించటానికి

ఈ మాస్క్ క్రమం తప్పకుండా వాడితే మచ్చలను తొలగించటంలో సాయపడుతుంది.

కావాల్సిన వస్తువులుః

2 తొక్కు తీసిన, ఉడికించి మెత్తని ముద్దలా చేసిన క్యారట్లు

1 చెంచా నిమ్మరసం

2చెంచాల తేనె

1 చెంచా ఆలివ్ నూనె

ఎలా వాడాలిః

పైన పదార్థాలన్నీ గట్టి పేస్టులా కలపండి. శుభ్రమైన మొహం మీద, మెడ మీదా పట్టించి 30 నిమిషాలపాటు వదిలేయండి. గోరువెచ్చని నీరుతో కడిగేసి తువ్వాలుతో వత్తండి. మీ చర్మం జిడ్డుదైతే ఆలివ్ నూనె వాడవద్దు.


English summary

Benefits Of Carrot For Skin Care

Benefits Of Carrot For Skin Care,We all have some common skin problems like skin tan, blemishes, dry skin, etc. For all these you have an all-in-one solution and that is, carrot. Being a common vegetable, it can be found in every household. So, the next time you go to the kitchen, don't forget to grab some and use it t
Story first published:Sunday, March 25, 2018, 10:54 [IST]
Desktop Bottom Promotion