For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దోసకాయ వలన చర్మానికి చేకూరే లాభాలు

By Gayatri Devupalli
|

దోసకాయలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్లు కూడా దీనిలో లాభిస్తాయి.

కానీ మీకు తెలుసా, దోసకాయలతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా సౌందర్య పోషణ కూడా చేసుకోవచ్చని? మీరు చదివింది నిజమే! దోసకాయ తో తయారు చేసుకున్న మాస్కులు, ప్యాకులతో చర్మం యవ్వనకాంతితో వికసిస్తుంది.

చర్మంపై ట్యాన్, మచ్చలు, పొడిచర్మం వంటి అన్ని రకాల సమస్యలకు దోసకాయ మంచి పరిష్కారం చూపిస్తుంది. ఇది మామూలు కూరగాయే కనుక ప్రతి ఇంట్లో ఉంటుంది. మీరు ఈసారి వంటగదిలో అడుగు పెట్టేటప్పుడు కొన్ని దోసకాయలను మీ చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవడానికి వాడండి.

వాటిని ఏ విధంగా వాడాలి అని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి. ఈ వ్యాసం మీకు అందుకు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తుంది. మచ్చలేని చర్మం కొరకు వాటితో మాస్కులు, ప్యాకులు ఏ విధంగా తయారు చేసి వాడాలో విపులంగా తెలుసుకోండి.

మెరిసే చర్మం కొరకు:

మెరిసే చర్మం కొరకు:

దోసకాయలలో ఉండే విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేటట్టు చేస్తాయి. దోసకాయలను తింటే చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. చర్మకాంతి మెరుగవడానికి వీటిని ఎలా వాడాలో తెలుసుకుందాం.

తురిమిన దోసకాయను, తేనెను కలపండి. దీనిని ముఖానికి బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయండి. మెత్తని గుడ్డతో పొడిగా ఒత్తండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పొడిచర్మ నివారణకు:

పొడిచర్మ నివారణకు:

మీది కనుక పొడి చర్మం అయినట్లైతే, దోసకాయ ప్యాక్ మీకు బాగా సహాయపడుతుంది. దీనిని యాంటి- ఏజింగ్ మాస్కుగా కూడా వాడవచ్చు.

కావలసిన పదార్థాలు:

2-3 టేబుల్ స్పూన్ల దోసకాయ రసం

ఒక టేబుల్ స్పూన్ మీగడ

వాడే పద్ధతి:

పై పదార్థాలను బాగా కలిపి ముద్దగా చేయండి. ఈ ముద్దను ముఖానికి, మెడకు బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఈ మాస్కు మీ చర్మాన్ని మృదువుగా మార్చి, తేమను చేకూర్చి ,పొడిదనాన్ని నివారిస్తుంది.

3. జిడ్డు చర్మం కొరకు:

3. జిడ్డు చర్మం కొరకు:

ఈ మాస్కు మీ చర్మాన్ని నునుపుగా మార్చి, శుభ్రంగా ఉంచుతుంది. జిడ్డు చర్మం వారికి సాధారణంగా మొటిమలు అధికంగా ఉంటాయి. ఈ మాస్క్ మీ ముఖంపై అదనంగా పేరుకున్న జిడ్డుతో పాటు మొటిమలని కూడా తగ్గిస్తుంది.

కావలసిన పదార్థాలు:

3 టేబుల్ స్పూన్ల దోసకాయ రసం

1 టేబుల్ స్పూన్ మజ్జిగ

2 టేబుల్ స్పూన్ల శనగపిండి

1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

వాడే పద్ధతి:

పై పదార్థాలన్నిటిని బాగా కలిపి పేస్ట్ చేయండి. ముఖానికి, మెడకు బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసి పొడిగా తుడుచుకోండి. . ఈ మాస్క్ మీ ముఖంపై ఉన్న జిడ్డును తగ్గించి యవ్వనంగా కనపడేటట్టు చేస్తుంది.

4. చర్మంపై పెట్టుకున్న ట్యాన్ తొలగిస్తుంది:

4. చర్మంపై పెట్టుకున్న ట్యాన్ తొలగిస్తుంది:

ముఖంపై ట్యాన్ ను తొలగించి మీ మేని ఛాయను సమానంగా మలచుతుంది. మృతకణాల వలన చర్మంపై ట్యాన్ ఏర్పడుతుంది. ఈ ప్యాక్ మృతకణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ దోసకాయ రసం

1 టేబుల్ స్పూన గుడ్డు తెల్లసొన

1 టేబుల్ స్పూన్ పెరుగు

వాడే పద్ధతి:

పై పదార్థాలన్నిటిని బాగా కలిపి పేస్ట్ చేయండి. ముఖానికి, మెడకు బాగా పట్టించి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఈ మాస్క్ చర్మానికి సహజ కాంతిని చేకూరుస్తుంది. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5. మచ్చలను తొలగించడానికి:

5. మచ్చలను తొలగించడానికి:

క్రమం తప్పకుండా వాడితే, ఈ మాస్క్ మచ్చలను తొలగుస్తుంది.

కావలసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల దోసకాయ రసం

1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె

2 టేబుల్ స్పూన్ల తేనె

1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

వాడే పద్ధతి:

పై పదార్థాలన్నిటిని బాగా కలిపి చిక్కని పేస్ట్ చేయండి. దీనిని ముఖానికి, మెడకు బాగా పట్టించి ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసి పొడిగా తుడుచుకోండి. మీ చర్మం జిడ్డు చర్మం అయినట్లైతేనే ఆలివ్ నూనెను వాడండి.

English summary

Benefits Of Cucumber For Skin Care

Cucumbers are packed with antioxidants and cucumbers contain some important minerals and other vitamins. Cucumbers can be used in the form of masks and packs to gain a young and beautiful skin. It can be used with ingredients like honey, cucumber, yogurt, etc., to treat several skin-related issues. We all have some common skin problems like skin tan,
Desktop Bottom Promotion