For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హీట్ బాయిల్స్ ను తగ్గించే బెస్ట్ నేచురల్ రెమెడీస్

హీట్ బాయిల్స్ ను తగ్గించే బెస్ట్ నేచురల్ రెమెడీస్

|

హ్యుమిడిటీ అనేది అనేక స్కిన్ ప్రాబ్లెమ్స్ కి దారితీస్తుంది. హీట్ బాయిల్స్ అనేవి హ్యుమిడిటీ వలన తలెత్తే కొన్ని రకాల సమస్యల్లో ఒకటి. బాక్టీరియా చేత ఇన్ఫెక్ట్ అవబడిన హెయిర్ ఫాలికల్ లేదా ఆయిల్ గ్లాండ్ అనేది చిన్న చిన్న జిట్స్ లా కనిపిస్తుంది. ఇది కొన్ని సార్లు నొప్పిని కూడా కలిగిస్తుంది.

హీట్ బాయిల్స్ అనేవి ముఖంపైన కనిపించడమే కాకుండా శరీరంలోని భుజాలు, కాళ్ళు, చేతులు అలాగే ప్రైవేట్ పార్ట్శ్ వంటి వివిధ భాగాలలో కూడా కనిపిస్తాయి. సెన్సిటివ్ ఏరియాస్ వీటి బారిన పడితే కెమికల్ క్రీమ్స్ అలాగే లోషన్స్ ను ఉపయోగించడం వలన సమస్య మరింత కష్టతరంగా మారుతుంది.

 Best Natural Remedies To Treat Heat Boils

దీన్ని అవాయిడ్ చేసేందుకు నేచురల్ రెమెడీస్ పై ఆధారపడటం మంచిది. ఈ ఆర్టికల్ లో వివిధ నేచురల్ రెమెడీస్ గురించి వివరించాము. వీటిని పాటించడం ఎంతో సులభం. వీటిని పాటించడం ద్వారా హీట్ బాయిల్స్ ను తగ్గించుకోవచ్చు.

జీలకర్ర:

జీలకర్ర:

జీలకర్ర లేదా జీరా అనే స్పైస్ ప్రతి కిచెన్ లో సాధారణంగా లభించే నేచురల్ ఇంగ్రిడియెంట్. ఇది బాయిల్స్ వద్ద పేరుకుపోయిన పస్ మరియు బాక్టీరియాను తొలగించేందుకు సమర్థవంతంగా తోడ్పడుతుంది.

ఎలా వాడాలి?

ఈ రెమెడీ కోసం నాలుగు టీస్పూన్ల జీలకర్ర పొడి అవసరపడుతుంది. జీలకర్రను వేయించి పొడిని చేసుకోవాలి. ఆ తరువాత కొన్ని చుక్కల నీటిని కలిపి చిక్కటి పేస్ట్ ను తయారుచేసుకోవాలి. దీన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. దీన్ని ప్రతి నాలుగైదు గంటలకు ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండాలి. మార్పు తెలిసే వరకు ఈ పద్దతిని కొనసాగించాలి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి కూడా ప్రతి కిచెన్ లో సాధారణంగా లభించే నేచురల్ ఇంగ్రిడియెంట్. ఇది హీట్ బాయిల్స్ ను తగ్గించేందుకు సమర్థవంతంగా తోడ్పడుతుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలవు. ఇవి అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను తొలగించేందుకు తోడ్పడతాయి.

ఎలా వాడాలి:

రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. వీటిని స్మూత్ పేస్ట్ గా మార్చుకోండి. ఈ పేస్ట్ ను హీట్ బాయిల్స్ పై అప్లై చేయండి. పది నిమిషాల పాటు వీటిని అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేయండి. ఈ రెమెడీను రోజుకొకసారి పాటిస్తే మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు.

ఆముదము నూనె:

ఆముదము నూనె:

ఆముదము నూనెలో యాంటీ ఇంఫ్లేమేటరీ పదార్థం లభిస్తుంది. దీన్ని రైసైనొలిక్ యాసిడ్ అంటారు. ఇది బాయిల్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంతో పాటు చర్మంపై అదనపు నూనె ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది.

ఎలా వాడాలి:

ఒక కాటన్ ప్యాడ్ ను తీసుకుని దాన్ని ఆముదము నూనెలో ముంచండి. ఆముదము నూనెలో ముంచబడిన కాటన్ ప్యాడ్ తో ప్రభావిత ప్రాంతంపై సున్నితంగా అద్దండి. ఇరవై నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేయండి. ఈ పద్దతిని రెండు నుంచి మూడు వారాల పాటు పాటించండి. మెరుగైన మార్పును గమనించి తీరతారు.

తమలపాకులు :

తమలపాకులు :

తమలపాకులు కూడా యాక్నే మరియు హీట్ బాయిల్స్ నుంచి రక్షణను అందిస్తాయి. ఇవి బాయిల్స్ నుంచి పస్ రిలీజ్ కు తోడ్పడతాయి.

ఎలా వాడాలి:

రెండు లేదా మూడు తాజా తమలపాకులను తీసుకోండి. వీటిని అరకప్పు నీటిలో లో ఫ్లేమ్ లో బాయిల్ చేయండి. తమలపాకులు సాఫ్ట్ గా మారే వరకు మరిగించండి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. తరువాత మిశ్రమాన్ని పేస్ట్ లా మార్చుకోండి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతం పై అప్లై చేయండి. ఈ పేస్ట్ ఆరిపోయాక ప్లెయిన్ వాటర్ తో రిన్స్ చేయండి. ఈ రెమెడీను వారానికి రెండు సార్లు పాటిస్తే వేగవంతమైన ఫలితాలను పొందగలుగుతారు.

వేపాకులు:

వేపాకులు:

వేపాకులలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి హీట్ బాయిల్స్ ను తగ్గించేందుకు బాగా తోడ్పడతాయి.

ఎలా వాడాలి:

గుప్పెడు వేపాకులను తీసుకుని కప్పుడు నీటిలో పది నిమిషాల పాటు మరిగించండి. ఈ సొల్యూషన్ ను చల్లారనివ్వండి. ఆ తరువాత దీన్ని వడగట్టి స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసుకోండి. ఈ సొల్యూషన్ ను ఫేస్ వాష్ లా వాడుకుంటూనే ప్రభావిత ప్రాంతంపై కూడా స్ప్రే చేసుకోవచ్చు. హీట్ బాయిల్స్ తగ్గిపోయేవరకూ ఈ పద్దతిని పాటించండి.

English summary

Best Natural Remedies To Treat Heat Boils

Humidity gives rise to many skin problems and heat boils are one among them. They are tiny zits that are infected by bacteria. Sometimes these can also cause pain. When it comes to sensitive areas, treating them with chemical creams and lotions will only worsen the condition. Natural remedies using neem leaves, garlic etc., can help.
Story first published:Monday, September 3, 2018, 15:50 [IST]
Desktop Bottom Promotion