For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరి నూనెతో పాటు ఈ రెమెడీస్ ను పాటిస్తే కంటి కింద ముడతలు మటాష్

కొబ్బరి నూనెతో పాటు ఈ రెమెడీస్ ను పాటిస్తే కంటి కింద ముడతలు మటాష్

|

ఏజింగ్ లక్షణాలు ముందుగా చర్మంపై అలాగే కళ్ళ వద్ద కనిపిస్తాయన్న సంగతిని మనం ఖండించలేము. ఏజింగ్ ను అవాయిడ్ చేయడం సాధ్యం కాకపోయినా, ఏజింగ్ ను కొంత కాలం వరకు డిలే చేయడం మాత్రం సాధ్యమే. కంటి కింద ముడతలు కూడా ఏజింగ్ లక్షణం కిందకే వస్తాయి. ఈ సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని నేచురల్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం.

వయసుతో పాటు పొల్యూషన్, స్మోకింగ్, లైఫ్ స్టైల్, చర్మ సంరక్షణ లోపించడం వంటి కొన్ని ఇతర ఫ్యాక్టర్స్ వలన ఏజింగ్ యొక్క ఎర్లీ సైన్స్ ప్రారంభమవుతాయి. కారణమేదైనా, ఏజింగ్ ను మాత్రం దాచలేము.

Coconut Oil And Other Remedies For Treating Under-eye Wrinkles

కాబట్టి, ఇక్కడ కొన్ని హోంమేడ్ రెమెడీస్ గురించి వివరించాము. ఇవి కంటి కింద ముడతలను తగ్గించేందుకు తోడ్పడతాయి. కంటి కింద ముడతల సమస్యను అరికట్టడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.

మరి ఇక్కడ వివరించబడిన నేచురల్ రెమెడీస్ పై ఓ లుక్కేయండి.

కొబ్బరినూనె:

కొబ్బరినూనె:

కొబ్బరినూనెలో విటమిన్ ఈ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ లభ్యమవుతాయి. ఇవి కంటి కింద ముడతలను తగ్గించేందుకు తోడ్పడతాయి.

కావాల్సిన పదార్థాలు:

కొబ్బరి నూనె:

తయారుచేసే విధానం:

1. కాస్తంత కొబ్బరి నూనెను తీసుకుని నిద్రపోయే ముందు ఈ నూనెతో కంటి కింద మసాజ్ చేయడం కంటి కింద ముడతలను అరికట్టవచ్చు.

2. కొబ్బరి నూనె మరియు పసుపును అండర్ ఐ మాస్క్ గా ఉపయోగించడం మరొక విధానం.

3. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో చిటికెడు పసుపును కలపాలి.

4. ఈ మాస్క్ ను కంటి కింద అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. నార్మల్ వాటర్ తో ఈ మాస్క్ ను తొలగించాలి .

పెరుగు:

పెరుగు:

పెరుగులో లభించే ల్యాక్టిక్ యాసిడ్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని టైటన్ చేస్తుంది. పెరుగుని ప్రతి రోజూ పాటించే స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ పెరుగు

1 టేబుల్ స్పూన్ తేనె

కాస్తంత రోజ్ వాటర్

తయారుచేసే విధానం:

1. ఒక పాత్రలో, ఒక టేబుల్ స్పూన్ పెరుగును, ఒక టేబుల్ స్పూన్ తేనెను అలాగే కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను తీసుకోవాలి.

2. వీటిని బాగా కలిపి చక్కటి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. దీన్ని కంటి కింద ముడతలపై అప్లై చేయాలి.

3. పదిహేను నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో దీనిని తొలగించాలి.

అలోవెరా:

అలోవెరా:

అలోవెరాలో విటమిన్ సి మరియు విటమిన్ ఈ లభిస్తాయి. ఇవి చర్మం పటుత్వంగా ఉండేందుకు తోడ్పడతాయి. అలాగే, చర్మం హైడ్రేటెడ్ గా ఉండేందుకు తోడ్పడతాయి.

కావలసిన పదార్థాలు:

అలోవెరా

తయారుచేసే విధానం:

1. ఒక అలోవెరా ఆకును తెరచి అందులోంచి జెల్ ను సేకరించండి.

2. ఈ జెల్ ను ముడతలపై అప్లై చేసి అయిదు నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోండి.

బొప్పాయి:

బొప్పాయి:

ముడతలని తగ్గించే సామర్థ్యం బొప్పాయిలో కలదు. అలాగే ఫైన్ లైన్స్ ను కూడా తొలగిస్తుంది. ఈ రెమెడీ ముడతలను తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

కావాల్సిన పదార్థాలు:

బొప్పాయి

తయారుచేసే విధానం:

1. బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అందులోంచి గుజ్జును స్వీకరించాలి.

2. ఈ గుజ్జును ముడతలపై అప్లై చేసి పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచాలి.

3. పదిహేను నిమిషాల తరువాత ప్లెయిన్ వాటర్ తో చర్మాన్ని శుభ్రపరచుకుని తడిని టవల్ తో తుడుచుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో లభించే ఏజెంట్స్ కంటి కింద చర్మాన్ని టైటన్ చేయడానికి తోడ్పడతాయి. అలాగే, ఇందులో లభించే విటమిన్ సి అనేది ఫ్రీ రాడికల్స్ ను అరికడుతుంది.

కావాల్సిన పదార్థాలు:

నిమ్మరసం

తయారుచేసే విధానం:

1. కాస్తంత నిమ్మరసాన్ని ముడతలపై అప్లై చేయాలి.

2. లేదా అర నిమ్మచెక్కను తీసుకుని కంటి కింద ముడతలపై అప్లై చేయండి.

ఇది ఏజింగ్ వలన ఎదురయ్యే కంటి కింద ముడతలను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

తేనె:

తేనె:

తేనెలో చర్మాన్ని పటుత్వపరిచే గుణాలు కలవు. అలాగే, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే గుణాలు కూడా పుష్కలం. రా హనీను నేరుగా అప్లై చేసుకోవచ్చు. లేదా తేనెలో కాస్తంత రైస్ ఫ్లోర్ ను కలిపి ఆ మిక్స్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

రైస్ ఫ్లోర్

తేనె

తయారుచేసే విధానం:

1. రైస్ ఫ్లోర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కలవు. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.

2. ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ లో ఒక స్పూన్ తేనెను కలపాలి. ఈ మిశ్రమం మరీ టైట్ గా ఉన్నట్టనిపిస్తే, మరికొంత తేనెను జోడించవచ్చు.

3. ఈ మాస్క్ ను కంటి కింద ముడతలపై అప్లై చేసి ఆరనివ్వండి. ఆ తరువాత శుభ్రపరుచుకోండి. ఈ ప్రాసెస్ ను వారానికి రెండు సార్లు పాటించండి.

English summary

Coconut Oil And Other Remedies For Treating Under-eye Wrinkles

We cannot deny the fact that the signs of ageing occur first on the skin and eyes. Though it is not possible to avoid ageing, it is surely possible to delay it at least. Some home ingredients like coconut oil, honey, lemon juice, olive oil, etc., can be used in our daily skin care routine to cure under-eye wrinkles.
Story first published:Friday, June 8, 2018, 18:01 [IST]
Desktop Bottom Promotion