For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ను కొబ్బరినూనె ద్వారా తొలగించుకోండి

మారుతున్న కాలానుగుణంగా కాలుష్యం దగ్గర నుండి కళ్ళప్పగించి చూసే గాడ్జెట్ స్క్రీన్ల వరకు అనేక అంశాలు కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు చేరడానికి కారకాలుగా ఉన్నాయి. ఇవి మీ మొత్తం ముఖాన్ని నిస్తేజంగా ..

|

మారుతున్న కాలానుగుణంగా కాలుష్యం దగ్గర నుండి కళ్ళప్పగించి చూసే గాడ్జెట్ స్క్రీన్ల వరకు అనేక అంశాలు కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు చేరడానికి కారకాలుగా ఉన్నాయి. ఇవి మీ మొత్తం ముఖాన్ని నిస్తేజంగా చేయడమే కాకుండా నిర్జీవంగా కనిపించేలా చేస్తుంది. కళ్ళ కింద రక్తనాళాలు కుంచించుకు పోవడం, క్రమంగా రక్తప్రసరణ తగ్గడం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. అధిక ఒత్తిడి, అధిక ధూమపానం మరియు మద్యపానం, నిద్ర లేకపోవడం, పర్యావరణ వినాశక కారకాలు, కాలుష్యం, కట్టెల పొయ్యి వాడకం లేదా ఇతర హార్మోన్ సమస్యలు వంటి వివిధ కారణాల వలన సహజంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.

కొబ్బరినూనె డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో సహాయం చేస్తుందా ?

కొబ్బరినూనె దాని ప్రభావవంతమైన వైద్య లక్షణాల కారణంగా కాస్మోటిక్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడుతూ ఉందని అందరికీ విదితమే. చర్మానికి ఉపశమనం కలిగించడంతో పాటు కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలను తొలగించడంలో ఎంతగానో సహాయ పడుతుందని అధ్యయనాల సారాంశం. ప్రధానంగా కొబ్బరినూనె, చర్మంలో తేమ స్థాయిలను పెంచడం ద్వారా రక్తనాళాలని ఉద్దీపన గావించి, రక్త ప్రసరణ సజావుగా జరగడంలో సహాయపడడం ద్వారా, కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించగలవు.

కొబ్బరినూనెలో ఉండే ఆరోగ్యకర కొవ్వు ఆమ్లాలు చర్మం లోపలి చొచ్చుకుపోయి వ్యాప్తి చెందడం ద్వారా, రక్తనాళాలకు పోషకాలను అందివ్వగలదని చెప్పబడింది. నిజానికి, డార్క్ సర్కిల్స్ చర్మంలో తేమ శాతం తగ్గి, అధికంగా పొడిబారడం కారణంగా ఏర్పడుతుంది. కొబ్బరినూనెలోని తేమ లక్షణాలు చర్మాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. క్రమంగా డార్క్ సర్కిల్స్ చికిత్సలో ఉత్తమంగా పనిచేస్తుంది.

కొబ్బరి నూనెలోని విటమిన్ - E, చర్మంపై ఫ్రీ రాడికల్స్ (స్వేచ్చారాశులు) ప్రభావాన్ని నిరోధిస్తుంది, మరియు ఎండవేడిమి నుండి చర్మాన్నిరక్షిస్తుంది.

కొబ్బరి నూనె మసాజ్ :

కొబ్బరి నూనె మసాజ్ :

కొబ్బరి నూనెతో కళ్ళ కింద సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా చర్మం డీహైడ్రేట్ సమస్యల నుండి బయటపడి, క్రమంగా తేమ స్థాయిలలో పెరుగుదలను చూస్తుంది. చర్మంలో తేమ స్థాయిలు పెరగడం కారణంగా, రక్తనాళాలు విచ్చుకునేలా చేయడంలో సహాయం చేస్తుంది, క్రమంగా రక్తప్రసరణ పెరిగి డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడుతాయి.

సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రపరచుకుని, ముఖంపై తడిని తొలగించిన పిదప, కొబ్బరి నూనెను కళ్ళ చుట్టూరా వర్తించి, ఒక రాత్రి అలాగే ఉండనివ్వండి. మరుసటి ఉదయం చల్లని, లేదా గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి.

కొబ్బరి నూనె మరియు పసుపు :

కొబ్బరి నూనె మరియు పసుపు :

ఈ మిశ్రమం కంటి కింద రక్త నాళాలలో, రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో, చిటికెడు పసుపును కలిపి మిశ్రమంగా చేయండి. ఈ మిశ్రమాన్ని, మీ కళ్ళ క్రింద వలయాలు ఏర్పడిన ప్రాంతంలో వర్తించి, కనీసం 15 నిముషాల పాటు వదిలివేయండి. 15 నిమిషాల తరువాత ఒక కాటన్ బాల్ తీసుకుని, ముఖంపై మిశ్రమాన్ని తొలగించుటకు ఉపయోగించండి.

పసుపును ఉపయోగించే క్రమంలో వీలైనంత తక్కువగా ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. లేకపోతే, చర్మం మీద పసుపు రంగు పేరుకునే అవకాశాలు ఉన్నాయి. యాంటి బయాటిక లక్షణాలు ఉన్నాకూడా, పసుపులో చర్మంతో మిళితమైపోయే లక్షణాలు కూడా ఉన్నాయి. కావున వీలైనంత తక్కువ వినియోగించడం మంచిది.

కొబ్బరినూనె మరియు బాదంనూనె :

కొబ్బరినూనె మరియు బాదంనూనె :

బాదం నూనెలో ఉండే విటమిన్ E చర్మంపై ఫ్రీ రాడికల్స్ కలిగించే నష్టాన్ని, నివారించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో పాటుగా దీనిని ఉపయోగించినప్పుడు, కంటి చుట్టూ ఏర్పడిన వలయాలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేయగలదని సూచించబడింది.

కొబ్బరి నూనె మరియు బాదం నూనెను సమాన భాగాలుగా తీసుకోండి. ఈ రెండింటిని కలపండి. కళ్ళ క్రింద ఈ మిశ్రమాన్ని వర్తించి, రాత్రిపూట దాన్ని వదిలివేయండి. మరుసటి ఉదయం సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోండి.

కొబ్బరి నూనె మరియు ఎసెన్షియల్ ఆయిల్ :

కొబ్బరి నూనె మరియు ఎసెన్షియల్ ఆయిల్ :

కొబ్బరి నూనెలో, ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలను జతచేసి వినియోగించినప్పుడు, అది చర్మంలోనికి పూర్తిగా చొచ్చుకుని పోయి, తేమను పెంచడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పబడింది.

ఒక గిన్నెలో, సమాన మోతాదులో కొబ్బరి నూనె, మరియు మీకు నచ్చిన ఫ్లేవర్లోని ఎసెన్షియల్ ఆయిల్ జతచేసి మిశ్రమంగా చేయండి. ఈ ఎసెన్షియల్ ఆయిల్, లావెండర్, శాండల్-వుడ్, జాస్మిన్, గ్రేప్-సీడ్ ఆయిల్ మొదలైన రూపాలలో మార్కెట్లో లభిస్తుంది.

ఒక కాటన్ బాల్ తీసుకుని, కొబ్బరినూనె మరియు ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమంలో ముంచి మీ కళ్ళ చుట్టూ మిశ్రమాన్ని వర్తించి, 2-3 గంటల పాటు వదిలివేయండి. లేదా మెరుగైన ఫలితాల కోసం ఒక రాత్రి పూర్తిగా వదిలివేయవచ్చు కూడా. మరుసటి ఉదయం చల్లని నీటితో శుభ్రం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

English summary

Does Coconut Oil Help In Treating Dark Circles?

Does Coconut Oil Help In Treating Dark Circles?
Story first published:Thursday, October 4, 2018, 15:16 [IST]
Desktop Bottom Promotion