For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైన పెదవుల కోసం దాల్చిన మరియు షుగర్ తో DIY లిప్ స్క్రబ్

|

బిజీ లైఫ్ స్టయిల్, పర్యావరణ కాలుష్యం, కఠినమైన వాతావరణ పరిస్థితులు మరియు కాస్మెటిక్స్ ను ఎక్కువగా వాడటం వంటివి పెదాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. పెదాలు డల్ గా డార్క్ గా అలాగే పగిలినట్టుగా మారతాయి. మాయిశ్చర్ కోల్పోతాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి. లేదంటే దీర్ఘకాల సమస్యలు వేధిస్తాయి.

మృదువైన, అందమైన పెదవులను కలిగి ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? వివిధ లిప్ ట్రీట్మెంట్స్ ద్వారా అందమైన పెదవులను పొందటం సులభం కాదు. వంటగదిలో మనకు సులభంగా లభ్యమయ్యే రెండు మ్యాజికల్ ఇంగ్రీడియెంట్స్ తో పెదాలను అందంగా మార్చుకోవచ్చు. ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా?

DIY Cinnamon And Sugar Lip Scrub For Beautiful Lips

ఈ రెండు ఇంగ్రిడియెంట్స్ యొక్క సుగుణాల గురించి మీరు తెలుసుకుంటే మీరు తప్పకుండా ఈ ఇంగ్రిడియెంట్స్ ను మీ డైలీ లిప్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకుంటారు. ఈ సింపుల్ లిప్ స్క్రబ్ గురించి వివరించే ముందు ఈ పదార్థాల ద్వారా పెదాలకు అందే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
పెదాలను అందంగా మార్చడంలో దాల్చిన చెక్క పాత్ర?

పెదాలను అందంగా మార్చడంలో దాల్చిన చెక్క పాత్ర?

దాల్చినలో కెస్సా ఆయిల్ లభిస్తుంది. ఇది చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది. చర్మాన్ని ఇరిటేట్ చేయదు. పెదాలపై దీనిని అప్లై చేయగానే బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగవుతుంది. ఎర్రటి పెదాలు మీ సొంతమవుతాయి. దాల్చిన లో లభించే కెస్సా ఆయిల్ అనేది శ్వాసను ఫ్రెష్ గా ఉంచడంలో తోడ్పడుతుంది.

దాల్చిన అనేది పెదాలపై ప్లంపింగ్ సెరమ్ గా పనిచేస్తుంది. దాల్చిన చౌకైనది అలాగే సురక్షితమైనది. వివిధ ఎక్స్పెన్సివ్ లిప్ ప్లంపర్స్ మరియు కాస్మెటిక్ ప్రాసెస్ ల కి సహజమైన ఆల్టర్నేటివ్.

శీతాకాలంలో స్క్రబ్ గా వాడేందుకు దాల్చిన అనేది సరైన పదార్థం. లిప్ స్క్రబ్ గా వాడుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. పెదాలను అందంగా మార్చేందుకు దాల్చిన ద్వారా లభించే వార్మింగ్ సెన్సేషన్ తోడ్పడుతుంది.

అయితే, దాల్చినని లిప్ ప్లంపర్ గా వాడే ముందు మీరో విషయం గుర్తుంచుకోవాలి. ఇది కొంతమేరకు పెదాలపై ఇరిటేషన్ ను కలిగించవచ్చు. అయితే, ఈ విషయంలో చింతించనవసరం లేదు.

షుగర్ ని లిప్ స్క్రబ్ గా ఎలా వాడతారు?

షుగర్ ని లిప్ స్క్రబ్ గా ఎలా వాడతారు?

బ్రౌన్ షుగర్ క్రిస్టల్స్ అనేవి పెదాలపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. పెదాలపై సున్నితంగా వ్యవహరించి ఎటువంటి ఇరిటేషన్ ను కలిగించకుండా పెదాలను అందంగా మారుస్తాయి.

షుగర్ లో లభించే నేచురల్ హ్యూమక్తాన్ట్ లు పెదాలపై మాయిశ్చర్ లాస్ ను అరికడతాయి. కాబట్టి, లిప్స్ అనేవి పొడిబారవు. ఈ స్క్రబ్ ని వాడితే పొడిబారిన పెదాల సమస్యను తగ్గించుకోవచ్చు.

షుగర్ లిప్ స్క్రబ్ ను ఎక్స్ఫోలియేషన్ కోసం వాడి పెదాలను ట్రీట్ చేయడం ద్వారా పెదాల అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. షుగర్ లో కూడా మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీలు కలవు. ఇవి పెదాలను పొడిబారకుండా కాపాడతాయి. అలాగే, పోర్స్ ని అన్ క్లాగ్ చేస్తాయి. పెదాలపై డెడ్ స్కిన్ ను తొలగించి డ్రై స్కిన్ సమస్యను తొలగిస్తుంది.

షుగర్ లోపల నుంచి పెదాలకు పోషణనందిస్తుంది. అలాగే పెదాలను హైడ్రేట్ చేసి ల్యూబ్రికేట్ చేస్తుంది. పెదాలను సూత్ చేస్తుంది. పెదాలపై ఉన్న డార్క్ పిగ్మెంటేషన్ ను తొలగించి పెదాలను పింక్ గా అలాగే మృదువుగా మారుస్తుంది.

DIY దాల్చిన మరియు షుగర్ లిప్ స్క్రబ్:

DIY దాల్చిన మరియు షుగర్ లిప్ స్క్రబ్:

కావలసిన పదార్థాలు:

• ఒక టేబుల్ స్పూన్ దాల్చిన పౌడర్

• ఒక టేబుల్ స్పూన్ షుగర్

• ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ మరియు కొబ్బరి నూనె

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

• ఈ పదార్థాలని ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కలపండి.

• చిక్కటి మిశ్రమంగా తయారుచేసుకున్నాకా ఒక బౌల్ లోకి మార్చండి.

• మీ ఫింగర్ టిప్స్ ను ఉపయోగించి పెదాలపై జెంటిల్ గా మసాజ్ చేయండి. అయిదు నుంచి పది నిమిషాల వరకు అలాగే ఉంచండి.

• ఇప్పుడు తడివస్త్రంతో పెదాలను వైప్ చేయండి.

ఈ లిప్ స్క్రబ్ ఎలా పనిచేస్తుంది?

ఈ లిప్ స్క్రబ్ ఎలా పనిచేస్తుంది?

ఈ లిప్ స్క్రబ్ లో వాడిన దాల్చిన మరియు షుగర్ లో ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీస్ కలవు. ఇవి పెదాలపై రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే సహజమైన మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తాయి. ఎక్స్ఫోలియేషన్ తో పాటు పెదాలను అందంగా మార్చడానికి తోడ్పడతాయి. మీ పెదాలపై సాఫ్ట్ లిప్ బామ్ ను అప్లై చేసుకునేందుకు అనువుగా మీ పెదాలను మార్చుతాయి. రెగ్యులర్ గా దాల్చినను వాడటం వలన పెదాలు అందంగా తయారవుతాయి. షుగర్ అనేది పెదాలను ఎక్స్ఫోలియెట్ చేసేందుకు తోడ్పడుతుంది. ఈ స్క్రబ్ లో వాడిన కొబ్బరి నూనె పెదాలను హైడ్రేట్ చేయడంతో పాటు యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా కూడా వ్యవహరిస్తుంది.

ఎంత తరచుగా ఉపయోగించాలి?

ఎంత తరచుగా ఉపయోగించాలి?

చల్లటి అలాగే కఠినమైన శీతాకాలంలో మరియు వేడి వేసవి కాలంలో పెదాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కాలాలలో పెదవులను ఈ లిప్ స్క్రబ్ ట్ ప్యాంపర్ చేయాలి. ఈ లిప్ స్క్రబ్ ను శీతాకాలంలో వారానికి మూడు సార్లు వాడాలి. మిగతా సమయాలలో వారానికి ఒకసారి వాడితే చాలు.ఎక్కువగా ఈ స్క్రబ్ ను వాడితే పెదాలు సహజ తేమ కోల్పోతాయి. కాబట్టి ఈ స్క్రబ్ ను లిమిట్ గా వాడాలి. ఈ స్క్రబ్ ను వాడటం ద్వారా పెదాలను సహజంగానే మృదువుగా అలాగే అందంగా మార్చుకోవచ్చు.

English summary

DIY Cinnamon And Sugar Lip Scrub For Beautiful Lips

Factors like busy lifestyle, pollution, weather conditions, and excessive use of cosmetics can all take a toll on our lips as much as it affects our skin. Our lips tend to become dull, dark and chapped, lacking natural moisture, when left unattended in the long term. Try making cinnamon and sugar scrub at home to get soft and beautiful lips.
Desktop Bottom Promotion