For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ స్టాంట్ గ్లో కోసం DIY హనీ మరియు కుకుంబర్ ఫేస్ ప్యాక్

ఇన్ స్టాంట్ గ్లో కోసం DIY హనీ మరియు కుకుంబర్ ఫేస్ ప్యాక్

|

దోశకాయ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి దోశకాయలో లభించే గుణాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. అందువలన, ఇది స్కిన్ కేర్ కు అమితంగా ఉపయోగపడుతుంది. ఇది చర్మానికి పోషణని అందిస్తుంది. తద్వారా, సహజ కాంతిని వెలికితీస్తుంది. అందువలన, ఇది ఎంతో మంది మహిళల స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా మారింది.

ఈరోజుల్లో, వివిధ బ్యూటీ స్టోర్స్ లో టన్నుల కొద్దీ కుకుంబర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లభ్యమవుతున్నాయి. అయితే, వాటిలో కుకుంబర్ తో పాటు మరికొన్ని ఇంగ్రిడియెంట్స్ కూడా కలిగి ఉంటాయి. అవి చర్మానికి హానీ కలిగించే ప్రమాదం ఉంది.

అటువంటి ప్రోడక్ట్స్ పై డబ్బులను విదిలించుకునే బదులు, స్వయంగా ఇంట్లోనే కుకుంబర్ ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోవడం ఉత్తమం.

DIY Honey And Cucumber Face Pack For Instant Glow

ఈ రోజు, బోల్డ్ స్కై లో అటువంటి కుకుంబర్ (దోశకాయ) ఫేస్ ప్యాక్ గురించి చర్చించుకోబోతున్నాము. ఈ ఫేస్ ప్యాక్ మీ స్కిన్ కు లోతైన పోషణను అందించి చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.

ఈ ఫేస్ ప్యాక్ నార్మల్ మరియు డ్రై స్కిన్ లకు బాగా సూట్ అవుతుంది. ఈ దిగువన వివరించబడిన ఫేస్ ప్యాక్ ను సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇది ఎంతో ప్రభావవంతమైనది అలాగే చౌకైనది. అంతేకాక, ఈ ప్యాక్ ను తయారుచేయడానికి వాడిన పదార్థాలన్నిటిలో స్కిన్ బెనెఫిటింగ్ ఫీచర్స్ కలవు.

ఆ రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

ఒక టేబుల్ స్పూన్ దోశకాయ గుజ్జు

అర టేబుల్ స్పూన్ తేనె

ఒక టేబుల్ స్పూన్ ఓట్స్

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

• పైన చెప్పిన పదార్థాలన్నిటినీ ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలపండి. ప్యాక్ రెడీ అయినట్టే.

• ఈ ప్యాక్ ను అప్లై చేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగండి. ఆ తరువాత ప్యాక్ ను ముఖంపై ఈవెన్ గా అప్లై చేయండి.

• అయిదు నుంచి పది నిమిషాల వరకు బాగా మసాజ్ చేయండి.

• మరో 15 నిమిషాల వరకు ప్యాక్ ను అలాగే ఉంచండి.

• ఆ తరువాత వెచ్చటి నీటితో ప్యాక్ ను తొలగించండి.

ఎంత తరచుగా ఈ ప్యాక్ ను వినియోగించాలి?

ఎంత తరచుగా ఈ ప్యాక్ ను వినియోగించాలి?

ఈ DIY ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి వాడితే చర్మానికి పోషణ అంది చర్మం తాజాగా మారుతుంది.

తేనె ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు:

తేనె ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు:

• తేనెలో స్కిన్ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీలు కలవు. అందువలన, తేనె చక్కటి స్కిన్ కేర్ ఇంగ్రిడియెంట్ గా పనిచేస్తుంది. చర్మంలో మాయిశ్చరైజర్ ను నిలిపి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

• యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించడం వలన తేనె అనేది అద్భుతమైన స్కిన్ క్లీన్సర్ గా కూడా పనిచేస్తుంది. చర్మంలో పేరుకుపోయిన మలినాలను అలాగే కాలుష్య కారకాలను తొలగించి చర్మాన్ని తేటగా మారుస్తుంది. ప్రకాశవంతమైన నిగారింపును అందిస్తుంది.

• తేనె అనేది ఇన్ఫెక్షన్స్ ను అరికట్టేందుకు వికారకరమైన బ్రేకవుట్స్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు.

• అలాగే, చర్మంలోని పి హెచ్ బాలన్స్ ని రేగులేట్ చేయడానికి తద్వారా ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదాన్ని తగ్గించేందుకు తేనె తోడ్పడుతుంది.

• తేనె అనేది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా, మీ చర్మం మృదువుగా అలాగే కోమలంగా మారుతుంది.

దోశకాయ ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు:

దోశకాయ ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు:

• దోశకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన ఇది ఎండాకాలంలో అద్భుతమైన స్కిన్ కేర్ ఇంగ్రిడియెంట్ గా పనిచేస్తుంది. చర్మానికి తగినంత హైడ్రేషన్ ను అందించి చర్మానికి పోషణని అందిస్తుంది.

• విటమిన్ ఏ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ దోశకాయలో పుష్కలంగా లభిస్తాయి. తద్వారా, చర్మానికి హానికర గాలి నుంచి అలాగే కాలుష్య కారకాల నుంచి రక్షణ అందుతుంది.

• విటమిన్స్ లభ్యమవడంతో పాటు సల్ఫేట్ మరియు పొటాషియం వంటి కొన్ని ముఖ్యమైన పదార్థాలు ఇందులో లభించడం వలన దోశకాయ అనేది సన్ బర్న్ ను ట్రీట్ చేసేందుకు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. ఇరిటేటెడ్ స్కిన్ ను ప్రశాంతపరచి ట్యానింగ్ ను తగ్గిస్తుంది.

• దోశకాయను శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కు నిలయంగా భావించవచ్చు. ఇది అద్భుతమైన యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియెంట్ గా పనిచేస్తుంది. దీనిని తరచూ వాడటం వలన ముడతలతో పాటు ఫైన్ లైన్స్ సమస్యను తగ్గించుకోవచ్చు.

చర్మానికి ఓట్స్ ద్వారా అందే ప్రయోజనాలు:

చర్మానికి ఓట్స్ ద్వారా అందే ప్రయోజనాలు:

• సపోనిన్స్ అనే పదార్థం ఓట్ మీల్ లో లభ్యమవుతుంది. ఇది చర్మంలో పేరుకుపోయిన దుమ్మూ ధూళిని తొలగించడానికి తోడ్పడుతుంది. చర్మంపై పేరుకున్న మలినాలు, డెడ్ స్కిన్ సెల్స్ లేదా టాక్సిన్లను ఓట్స్ ద్వారా సునాయాసంగా చర్మంపైనుంచి తొలగించవచ్చు.

• ఈ ఏజ్ ఓల్డ్ స్కిన్ ఇంగ్రిడియెంట్ అనేది సన్ బర్న్ ను హీల్ చేసేందుకు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఓట్స్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేస్తే నొప్పి మరియు దురద నుంచి ఉపశమనం లభిస్తుంది.

• ఇందులో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా లభిస్తాయి. ఇది సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.

• దోశకాయ, తేనె మరియు ఓట్ మీల్ ను కలిపి వాడటం వలన చర్మం అనేక విధాలా ప్రయోజనాలను పొందుతుంది. చర్మం హైడ్రేట్ అవుతుంది. చర్మానికి సహజ కాంతి అందుతుంది.

English summary

DIY Honey And Cucumber Face Pack For Instant Glow

Cucumber is a cult-favourite beauty ingredient that can work wonders on the state of your skin. Its high water content makes it a remarkable skin care ingredient. It has the power to nourish the skin and help it attain a radiant glow. Try making honey and cucumber face pack at home for glowing skin. It is ideal for all skin types.
Story first published:Friday, May 25, 2018, 16:16 [IST]
Desktop Bottom Promotion