For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తప్పక ప్రయత్నించవలసిన DIY లెమన్ మరియు షుగర్ స్క్రబ్

మీరు తప్పక ప్రయత్నించవలసిన DIY లెమన్ మరియు షుగర్ స్క్రబ్

|

రకరకాల ట్యూబ్స్ లో లక్షలకొద్దీ స్క్రబ్స్ మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ట్యూబ్ నుంచి స్క్రబ్ ను స్క్వీజ్ చేసి మనం ముఖానికి అలాగే శరీరానికి అప్లై చేసుకోవాలి. మరి, అటువంటి ప్రభావవంతమైన స్క్రబ్ ని కిచెన్ లో సులభంగా అందుబాటులో ఉండే పదార్థాలతో మనం తయారుచేసుకుంటే ఎంత బాగుంటుంది కదూ?

స్క్రబ్ ని ఇంటివద్దే సులభంగా తయారుచేసుకోవచ్చు. అలా ఇంట్లో తయారుచేసుకున్న స్క్రబ్ అనేది చర్మంపై అద్భుతాలను సృష్టిస్తుంది. షుగర్ మరియు లెమన్ స్క్రబ్ లో నున్న విశేష గుణాలను గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. నిమ్మ ఫ్లేవర్ అనేది ఉత్తేజపరుస్తుంది. ముఖానికి ఆలాగే శరీరానికి సాంత్వనని ఇస్తుంది. లెమన్ మరియు షుగర్ ద్వారా చర్మానికి అందే ప్రయోజనాల గురించి ఇక్కడ స్పష్టంగా వివరించాము.

Amazing DIY Lemon And Sugar Scrub You Must Try Today

DIY లెమన్ మరియు షుగర్ స్క్రబ్ ను ముఖానికి అలాగే శరీరానికి వాడుకోవచ్చు. ఈ స్క్రబ్ అనేది పాదాలు, చేతులు, మోచేతులు, మోకాళ్ళలో ఉండే రఫ్ స్పాట్స్ ని స్మూత్ గా మారుస్తుంది. అలాగే క్యూటికల్స్ తో పాటు నెయిల్ బెడ్స్ కు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్క్రబ్ అనేది యాక్నేకి గురయ్యే చర్మాన్ని స్మూత్ గా అలాగే క్లియర్ గా మారుస్తుంది. లెమన్ మరియు ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ నుంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

ఇప్పుడు ఈ అద్భుతమైన స్క్రబ్ ను తయారుచేసుకునేందుకు కావలసిన పదార్థాలు గురించి తెలుసుకుందాం:

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

• అర నిమ్మ చెక్క

• అర కప్పు గ్రేన్యులేటెడ్ షుగర్

• ఒక టేబుల్ స్పూన్ తేనె

• ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

నిమ్మ

నిమ్మ

నిమ్మ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో లిమోనాయిడ్స్ అనే అద్భుతమైన పదార్థం కలదు. ఇది నోటి, కడుపు, లంగ్స్ , కొలోన్, స్కిన్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ పై పోరాడే ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది. నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అందువలన సూర్యుని హానీకార యువీ రేస్ నుంచి చర్మానికి రక్షణ అందుతుంది. స్కిన్ టోన్ మెరుగవుతుంది. ఏజింగ్ సైన్స్ అనేవి వాయిదా వేయబడతాయి. ముడతలు తగ్గుతాయి. జీవంలేని చర్మానికి కళ అందుతుంది. ఇంఫ్లేమేషన్ మరియు పిగ్మెంటేషన్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

నిమ్మలో లభించే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి యాక్నే ను నయం చేసి నేచురల్ ఎక్స్ఫోలియేటర్ లా పనిచేస్తాయి. చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి. చర్మం మృదువుగా మారుతుంది. ప్రకాశవంతంగా మారుతుంది. నిమ్మలో లభించే అల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్స్ అనేవి ఫైన్ లైన్స్ ను స్మూత్ చేసేందుకు తోడ్పడతాయి. తద్వారా, ముడతలు తగ్గి స్కిన్ టెక్స్చర్ మెరుగవుతుంది

షుగర్

షుగర్

షుగర్ అనేది సహజ హుమేక్టన్ట్. అంటే, ఇది వాతావరణం నుంచి తేమను ఆకర్షిస్తుంది. తద్వారా, చర్మం హైడ్రేటెడ్ గా ఉండేందుకు తోడ్పడుతుంది. షుగర్ ని స్కిన్ కేర్ లో భాగంగా చేసుకోవడం వలన చర్మం మాయిశ్చర్డ్ గా అలాగే హైడ్రేటెడ్ గా ఉంటుంది. షుగర్ లో సహజమైన గ్లైకోలిక్ యాసిడ్ లభిస్తుంది. ఇది, చర్మం లోతుల్లోకి చేరి చర్మాన్ని తాజాగా అలాగే యవ్వనంగా ఉంచుతుంది. షుగర్ యొక్క చిన్న చిన్న పార్టికల్స్ అనేవి స్క్రబ్ కి అద్భుతమైన సోర్స్ గా ఉపయోగపడతాయి. గరుకుగా ఉండటం వలన ఇది చర్మంపై డెడ్ స్కిన్ లేయర్స్ ని తొలగించడంలో తోడ్పడుతుంది. తద్వారా, చర్మం ఆరోగ్యకరంగా అలాగే తాజాగా మారుతుంది.

తేనె

తేనె

తేనె అనేది సహజమైన హుమేక్టన్ట్. షుగర్ వంటి లక్షణాలనే కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుల్లోంచి మాయిశ్చర్ చేస్తుంది. పోర్ క్లీన్సర్ లా కూడా ఉపయోగపడుతుంది. అలాగే జెంటిల్ క్లీన్సింగ్ కు తోడ్పడుతుంది. తేనెలో యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ కలవు. ఇవి చర్మాన్ని మృదువుగా అలాగే ఆరోగ్యంగా మార్చి స్కార్స్ ను లైటెన్ చేస్తాయి. పిగ్మెంటేషన్ ను తగ్గిస్తాయి. ఇది సన్ బర్న్ ను ట్రీట్ చేసి యాక్నే మరియు పింపుల్స్ తో పోరాడుతుంది. ఏజింగ్ ప్రాసెస్ ను మందగింపచేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చర్మానికి సహజకాంతిని అద్దుతుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసేందుకు కూడా తోడ్పడుతుంది. చర్మ సంరక్షణతో పాటు శిరోజాలను అలాగే నెయిల్స్ ను సంరక్షించడంలో ఇది దిట్ట. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, డీ, కే మరియు ఈ లభిస్తాయి. ఇవన్నీ చర్మ సంరక్షణకు తోడ్పడతాయి. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ సూర్యుని హానికర యూవీ రేస్ వలన దెబ్బతిన్న చర్మాన్ని కోలుకునేలా చేస్తాయి. ఇది అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. యాక్నేకి దారితీసే బాక్టీరియాపై పోరాటం సాగిస్తుంది.

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

• ఒక శుభ్రమైన పాత్రను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను ఆలాగే నిమ్మరసాన్ని జోడించాలి. వీటిని బాగా కలపాలి. ఇప్పుడు, ఇందులో తేనెను జోడించాలి. చిక్కటి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.

• ఇందులో అర కప్పు గ్రాన్యులేటెడ్ షుగర్ ను జోడించాలి. మిశ్రమానికి తగినంత షుగర్ ను జోడించాలి.

1. ఫేస్ స్క్రబ్ :

1. ఫేస్ స్క్రబ్ :

నిమ్మ మరియు షుగర్ ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ అనేది ఆయిలీ మరియు యాక్నే ప్రోన్ స్కిన్ కు చక్కగా సరిపడుతుంది. నిమ్మలో నున్న గుణాలు పోర్స్ ను టైటన్ చేస్తాయి. షుగర్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. తేనె అనేది చర్మానికి హైడ్రేషన్ ను అందిస్తుంది. ఆలివ్ ఆయిల్ యాక్నే స్కార్స్ ను హీల్ చేస్తుంది. ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది.

• నిమ్మ మరియు షుగర్ స్క్రబ్ ను వేళ్ళతో తీసుకుని ముఖంపై సున్నితంగా అప్లై చేయాలి.

• ఈ మిశ్రమంతో సర్క్యూలర్ మోషన్ లో ముఖంపై మసాజ్ చేయాలి. మసాజ్ చేసేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలి.

• చర్మంపై ఏవైనా గాయాలుంటే నిమ్మను అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే, విపరీతంగా మంట కలుగుతుంది.

• ఈ స్క్రబ్ ను ముఖంపై పది నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో తొలగించాలి.

• ఈ స్క్రబ్ ను వారానికి రెండు సార్లు వాడితే చర్మం మృదువుగా మారుతుంది.

2. బాడీ స్క్రబ్:

2. బాడీ స్క్రబ్:

• ఈ స్క్రబ్ ని శరీరానికి అప్లై చేసేటప్పుడు మోచేతులు, మోకాలు, చేతులు, పాదాలు, గోర్లు మరియు క్యూటికల్స్ వంటి రఫ్ స్పాట్స్ పై ఫోకస్ పెట్టండి.

• ఈ స్క్రబ్ ని సర్క్యూలర్ మోషన్ లో అయిదు నిమిషాల పాటు రబ్ చేయండి.

• నార్మల్ వాటర్ తో స్క్రబ్ ని వాష్ చేయండి.

• ఈ స్క్రబ్ ని వారానికి రెండు సార్లు వాడండి.

ఈ అద్భుతమైన స్క్రబ్ ను తయారుచేయడం ఎంతో సులభం. ఈ స్క్రబ్ వలన కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే.

English summary

Amazing DIY Lemon And Sugar Scrub You Must Try Today

DIY lemon and sugar scrub can be used both on the face and body. This scrub is best for rough spots like feet, hands, elbows, knees and it's also great for the cuticles and nail beds. This scrub works wonderfully on acne-prone skin as it makes the skin smooth and clear, but the whole body can benefit a lot from this lemon and sugar exfoliating scrub.
Story first published:Saturday, July 7, 2018, 6:35 [IST]
Desktop Bottom Promotion